Share News

Thief Funny Video: చోరీ చేయడమే కాదు.. తప్పించుకోవడమూ తెలియాలి.. ఈ దొంగకు ఏమైందో చూడండి..

ABN , Publish Date - Jul 26 , 2025 | 02:12 PM

స్కూటీపై వచ్చిన ఓ దొంగ.. రోడ్డు పక్కన ఎత్తుగా పేర్చిన ట్రేల వద్దకు వెళ్లాడు. ఆ ట్రేలలో ఒకదాన్ని తీసుకుని బండిపై పెట్టుకున్నాడు. ఇంతవరకూ అంతా బాగానే ఉంది కానీ.. ఇక్కడ ఎవరూ ఊహించని ఘటన చోటు చేసుకుంది.

Thief Funny Video: చోరీ చేయడమే కాదు.. తప్పించుకోవడమూ తెలియాలి.. ఈ దొంగకు ఏమైందో చూడండి..

దొంగలు చోరీ చేసే సమయంలో కొన్నిసార్లు షాకింగ్ ఘటనలు చోటు చేసుకుంటుంటాయి. మరికొన్నిసార్లు తమాషా సంఘటనలు చోటు చేసుకుంటుంటాయి. చోరీ కోసం వెళ్లి ఇనుప ఊచల్లో ఇరుక్కుపోయిన దొంగలను చూశాం. చోరీ చేసిన ఇళ్లలో స్నానాలూ, భోజనాలూ చేసిన దొంగలను కూడా చూశాం. ఇలాంటి వింత ఘటనలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో నిత్యం చూస్తుంటాం. తాజాగా, ఓ ఫన్నీ వీడియో నెట్టింట చక్కర్లు కొడుతోంది. చోరీ చేసేందుకు వెళ్లిన దొంగకు షాకింగ్ అనుభవం ఎదురైంది. ఈ వీడియో చూసిన నెటిజన్లు ఫన్నీ ఫన్నీ కామెంట్లు చేస్తున్నారు.


సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. స్కూటీపై వచ్చిన ఓ దొంగ.. రోడ్డు పక్కన ఎత్తుగా పేర్చిన ట్రేల వద్దకు వెళ్లాడు. ఆ ట్రేలలో ఒకదాన్ని తీసుకుని బండిపై పెట్టుకున్నాడు. ఇంతవరకూ అంతా బాగానే ఉంది కానీ.. ఇక్కడ ఎవరూ ఊహించని ఘటన చోటు చేసుకుంది.


ట్రేను తీసుకుని కాస్త ముందుకు వెళ్లగానే మలుపు తిరిగే సమయంలో (Thief slips while riding scooty) అదుపు తప్పి కిందపడ్డాడు. దీంతో ట్రేలోని వస్తువులన్నీ కిందపడిపోయాయి. వాటిని తీసుకునేందుకు కిందకు దిగే క్రమంలో అతడి హెల్మెట్ ఎగిరి పక్కన పడిపోతుంది. దాన్ని తీసుకునేందుకు వెళ్లగా స్కూటీ పూర్తిగా కిందకు వాలిపోతుంది. ఆ తర్వాత ఎలాగోలా అన్నీ సర్దుకుని ముందుకు వెళ్లాలని చూశాడు. అయితే వేగంగా వెళ్తుండగా ఒక్కసారిగా కారు ఎదురుగా వస్తుంది.


కారును తప్పించేందుకు బ్రేకులు వేయగా.. ఒక్కసారిగా జారిపడిపోతాడు. ఇలా ఆ ట్రేను తీసుకెళ్లడం ఆ దొంగ ప్రాణాలకు వస్తుందన్నమాట. ఈ ఘటనకు సంబంధిచిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘చోరీ చేయడంలో ఇతడికి ప్రాక్టీస అవపరం’.. అంటూ కొందరు, ‘ఇతన్ని చూస్తుంటే.. నవ్వు, ఏడుపు.. రెండూ ఒకేసారి వస్తున్నాయి’.. అంటూ మరికొందరు, ఫన్నీ ఫన్నీ ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 4.6 మిలియన్లకు పైగా వ్యూస్‌ను సొంతం చేసుకుంది.


ఇవి కూడా చదవండి..

శివుడితో కామెడీ చేస్తే ఇలాగే ఉంటుంది.. ఎలాంటి ప్రతిఫలం దక్కిందంటే..

ఈ భర్తను చూస్తే అయ్యో పాపం అనాల్సిందే.. బైకుపై భార్య ఏం చేస్తుందో చూస్తే..

మరిన్ని వైరల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Updated Date - Jul 26 , 2025 | 02:12 PM