Monkey Funny Video: కొండ ఎక్కుతున్న యువకుడు.. సడన్‌గా ప్రత్యక్షమైన కోతి.. చివరకు చూస్తే..
ABN , Publish Date - Jul 26 , 2025 | 12:19 PM
కొందరు పర్యాటకులు ట్రెక్కింగ్‌లో భాగంగా ఓ ఎత్తైన కొండను ఎక్కుతున్నారు. వారిలో యువకుడు కొండ మధ్యలోకి వెళ్లగానే సడన్‌గా షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. ఎటు నుంచి వచ్చిందో ఏమో గానీ.. ఓ కోతి సడన్‌గా అతడికి ఎదురుగా వచ్చి కూర్చుంది. కోతిని చూడగానే..

కోతుల ప్రవర్తన చిత్రవిచిత్రంగా ఉంటుంది. కొన్నిసార్లు కోతులు ఎక్కడి నుంచి వస్తాయో తెలీదు గానీ.. సడన్‌గా కళ్లముందుకు వచ్చి అందినకాడికి దోచుకుంటుంటాయి. మరికొన్నిసార్లు బెదిరించి మరీ లాక్కుంటుంటుంటాయి. ఇంకొన్నిసార్లు బ్యాగులు మొత్తం సెర్చ్ చేసి తమకు కావాల్సిన ఆహార పదార్థాలను ఎత్తుకెళ్తుంటాయి. ఇలాంటి సమయాల్లో కొన్నిసార్లు తమాషా సంఘటనలు చోటు చేసుకుంటుంటాయి. తాజాగా, ఇలాంటి వీడియో ఒకటి నెట్టింట చక్కర్లు కొడుతోంది. కొండ ఎక్కుతున్న ఓ యువకుడికి షాకింగ్ అనుభవం ఎదురైంది. సడన్‌గా కోతి ఎదురవడంతో చివరకు ఏం జరిగిందో మీరే చూడండి..
సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. కొందరు పర్యాటకులు ట్రెక్కింగ్‌లో (Trekking) భాగంగా ఓ ఎత్తైన కొండను ఎక్కుతున్నారు. వారిలో యువకుడు కొండ మధ్యలోకి వెళ్లగానే సడన్‌గా షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. ఎటు నుంచి వచ్చిందో ఏమో గానీ.. ఓ కోతి సడన్‌గా అతడికి ఎదురుగా వచ్చి కూర్చుంది. కోతిని చూడగానే ఎక్కడ కరిచేస్తుందో అని భయపడి.. అతను అలాగే కదలకుండా ఉండిపోయాడు.
అతడి వైపు కోపంగా చూసిన కోతి.. ‘కదిలావంటే.. తోసేస్తా.. నా పని అయ్యే వరకూ అలాగే సైలెంట్‌గా ఉండు’.. అన్నట్లుగా కంటి చూపుతో బెదరిస్తుంది. ఆ తర్వాత అతడి బ్యాగు జిప్ తీసి, లోపల ఏమైనా తినుబండారాలు ఉన్నాయా (Monkey checked in tourist's bag) అని చూస్తుంది. ఈ క్రమంలో బ్యాగులోని బట్టలన్నీ బయట పడేస్తుంది. ఇలా ఆ కోతి చాలా సేపు ఆ బ్యాగులో వెతుకుతుంది. కదిలితే కోతి ఎక్కడ కిందకు తోసస్తుందో అనే భయంతో అతను.. అలాగే సైలెంట్‌గా ఉండిపోతాడు.
ఈ ఘటన మొత్తం అక్కడే ఉన్న వారు వీడియో తీసి, సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘కోతి రౌడీయిజం మామూలుగా లేదుగా’.. అంటూ కొందరు, ‘ఒకరి నిస్సయాతను క్యాష్ చేసుకోవడమంటే ఇదే’.. అంటూ మరికొందరు, ఫన్నీ ఫన్నీ ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 3 లక్షలకు పైగా లైక్‌లు, 20 మిలియన్లకు పైగా వ్యూస్‌ను సొంతం చేసుకుంది.
ఇవి కూడా చదవండి..
శివుడితో కామెడీ చేస్తే ఇలాగే ఉంటుంది.. ఎలాంటి ప్రతిఫలం దక్కిందంటే..
ఈ భర్తను చూస్తే అయ్యో పాపం అనాల్సిందే.. బైకుపై భార్య ఏం చేస్తుందో చూస్తే..
మరిన్ని వైరల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి