Bangalore Professor Dance: వామ్మో.. ఈ ప్రొఫెసర్ టాలెంట్ మామూలుగా లేదుగా.. ఎలా డాన్స్ చేస్తుందో చూడండి..
ABN , Publish Date - Jul 27 , 2025 | 12:09 PM
సోషల్ మీడియాలో ఓ మహళా ప్రొఫెసర్ డాన్స్ వీడియో నెట్టింట చక్కర్లు కొడుతోంది. ఈ ప్రొఫెసర్ డాన్స్ చూసిన వారంతా ఫిదా అవుతున్నారు. ‘వావ్.. డాన్స్ మామూలుగా లేదు మేడం’.. అంటూ కామెంట్లు చేస్తున్నారు.

ఉపాధ్యాయులు, అధ్యాపకులు అంటేనే పాఠాలు బోధించడం, తప్పు చేస్తే మందలించే సీన్లే గుర్తుకొస్తాయి. అయితే ఇలాంటి టీచర్లు.. రొటీన్‌కు భిన్నంగా పాటలకు తమదైన డాన్స్‌లు వేయడం చూస్తుంటాం. ఇలాంటి వీడియోలు సోషల్ మీడియాలోనూ తెగ వైరల్ అవుతుంటాయి. తాజాగా, బెంగళూరు చెందిన ఓ మహళా ప్రొఫెసర్ వీడియో నెట్టింట చక్కర్లు కొడుతోంది. ఈ ప్రొఫెసర్ డాన్స్ చూసిన వారంతా ఫిదా అవుతున్నారు. ‘వావ్.. డాన్స్ మామూలుగా లేదు మేడం’.. అంటూ కామెంట్లు చేస్తున్నారు.
సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. ఈ ఘటన బెంగళూరులోని (Bangalore) జ్యోతి నివాస్ కళాశాలలో చోటు చేసుకుంది. ఇటీవల ఈ కళాశాలలో సాంస్కృతిక కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా కళాశాలలో అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా పని చేస్తున్న మందార గౌడ అనే మహిళ.. స్టేజిపై మరాఠీ పాటకు కాలు కదిపింది.
ఏదో డాన్స్ చేశాం అంటే చేశాం అన్నట్లుగా కాకుండా.. ఎంతో నిబద్ధతతో సినిమా హీరోయిన్లను (Bengaluru professor dance to Marathi song) తలదన్నేలా స్టెప్పులు వేసింది. స్టేజిపై అటూ, ఇటూ తిరుగుతూ ఆమె వేసిన లయబద్ధమైన స్టెప్పులు అందరినీ కట్టిపడేశాయి. ప్రొఫెసర్ డాన్స్ చేస్తున్నంత సేపూ అక్కడున్న విద్యార్థులంతా ఈలలు, కేకలు, చప్పట్లతో మారుమోగించారు. ఈ వీడియో కూడా ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.
ఈ వీడియోపై నెటిజన్లు కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. ‘ఈ ప్రెఫెసర్ ఎంతో అద్భుతంగా డాన్స్ చేశారు’.. అంటూ కొందరు, ‘ఈ వీడియో తర్వాత.. ఈ మేడం క్లాసులకు విద్యార్థులు పోటెత్తుతారు’.. అంటూ మరికొందరు, వివిధ రకాల ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 3 లక్షలకు పైగా లైక్‌లు, 3.2 మిలియన్‌కు పైగా వ్యూస్‌ను సొంతం చేసుకుంది.
ఇవి కూడా చదవండి..
శివుడితో కామెడీ చేస్తే ఇలాగే ఉంటుంది.. ఎలాంటి ప్రతిఫలం దక్కిందంటే..
ఈ భర్తను చూస్తే అయ్యో పాపం అనాల్సిందే.. బైకుపై భార్య ఏం చేస్తుందో చూస్తే..
మరిన్ని వైరల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి