Share News

Lucky Woman Viral Video: అదృష్టమంటే ఈమెదే.. ప్రమాదం నుంచి ఎలా బయటపడిందంటే..

ABN , Publish Date - Jul 27 , 2025 | 01:19 PM

వర్షానికి ఓ కాలనీ సందులో వర్షపు నీరు నిలిచి ఉంటుంది. ఇంతలో ఓ మహిళ గొడుగు పట్టుకుని తన ఇంటికి వస్తుంది. డోరు తీసి ఇంట్లోకి అడుగు పెట్టి.. తర్వాత డోరు వేసేస్తుంది. ఇంతవరకూ అంతా బాగానే ఉంది కానీ.. ఇక్కడే ఎవరూ ఊహించని విధంగా షాకింగ్ ఘటన చోటు చేసుకుంది.

Lucky Woman Viral Video: అదృష్టమంటే ఈమెదే.. ప్రమాదం నుంచి ఎలా బయటపడిందంటే..

ప్రమాదాలు ఎప్పుడు ఎలా వస్తాయో ఎవరికీ తెలీదు. అవి వచ్చేది మనకు తెలీదు.. వచ్చాక తెలుసుకోవడానికి మనం మిగలం. అయితే కొన్నిసార్లు కొందరు ఎంతో లక్కీగా బయటపడుతుంటారు. మరికొందరైతే పెద్ద పెద్ద ప్రమాదాల నుంచి చిన్న గాయం కూడా కాకుండా తప్పించుకుంటుంటారు. ఇలాంటి విచిత్ర సంఘటనలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. తాజాగా, ఇలాంటి వీడియో ఒకటి నెట్టింట చక్కర్లు కొడుతోంది. ఓ మహిళ ఇంట్లోకి వెళ్లగానే బయట చోటు చేసుకున్న ఘటన చూసి అంతా షాక్ అవుతున్నారు.


సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. వర్షానికి ఓ కాలనీ సందులో వర్షపు నీరు నిలిచి ఉంటుంది. ఇంతలో ఓ మహిళ గొడుగు పట్టుకుని తన ఇంటికి వస్తుంది. డోరు తీసి ఇంట్లోకి అడుగు పెట్టి.. తర్వాత డోరు వేసేస్తుంది. ఇంతవరకూ అంతా బాగానే ఉంది కానీ.. ఇక్కడే ఎవరూ ఊహించని విధంగా షాకింగ్ ఘటన చోటు చేసుకుంది.


ఆమె (woman) ఇంట్లోకి అడుగు పెట్టగానే బయట ఉన్న ప్రహరీ ఒక్కసారిగా (wall has collapsed) ధబేల్‌మని కూలిపోతుంది. ఆమె ఇంట్లోకి వెళ్లడం ఒక్క క్షణం ఆలస్యం అయ్యున్నా.. పెద్ద ప్రమాదం జరిగి ఉండేది. ఇలా ఆమె ఇంట్లోకి వెళ్లగానే గోడ కూలిపోవడం చూసి అంతా షాక్ అవుతున్నారు. ఈ ఘటన మొత్తం అక్కడే ఉన్న సీసీ కెమెరాలో రికార్డ్ అయింది.


ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘అదృష్టం అంటే ఈమెదే’’.. అంటూ కొందరు, ‘లక్ అంటే ఇదే.. చూస్తుంటేనే ఆశ్చర్యంగా ఉంది’.. అంటూ మరికొందరు, వివిధ రకాల ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 2 వేలకు పైగా లైక్‌లు, 94 వేలకు పైగా వ్యూస్‌ను సొంతం చేసుకుంది.


ఇవి కూడా చదవండి..

శివుడితో కామెడీ చేస్తే ఇలాగే ఉంటుంది.. ఎలాంటి ప్రతిఫలం దక్కిందంటే..

ఈ భర్తను చూస్తే అయ్యో పాపం అనాల్సిందే.. బైకుపై భార్య ఏం చేస్తుందో చూస్తే..

మరిన్ని వైరల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Updated Date - Jul 27 , 2025 | 01:19 PM