Monkey Viral Video: హోటల్లోకి వచ్చిన కోతికి ఊహించని సర్‌ఫ్రైజ్.. వీడియో చూస్తే అవాక్కవుతారు..
ABN , Publish Date - Jul 30 , 2025 | 09:30 AM
ఎక్కడి నుంచి వచ్చిందో ఏమో గానీ.. ఓ కోతి నేరుగా ఓ హోటల్లోకి దూరింది. దాన్ని చూడగానే లోపల ఉన్న కస్టమర్లు మొత్తం పరుగులు తీశారు. కోతిని చూసి కోపంగా తరిమికొట్టాల్సిన సిబ్బంది.. అందుకు పూర్తి విరుద్ధంగా ప్రవర్తించారు.

కోతులు ఇళ్లు, దుకాణాల్లోకి చొరబడి తినుబండారాలు, విలువైన వస్తువులను ఎత్తుకెళ్లడం సర్వసాధారణంగా జరుగుతుంటుంది. కోతుల బెదడ భరించలేక కొందరు తీవ్ర ఇబ్బందులు పడుతుంటారు. కోతులు లోపలికి రాకుండా అనేక జాగ్రత్తలు తీసుకోవడం చూస్తుంటాం. ఇలాంటి సంఘటనలకు సంబంధించిన వీడియోలను నిత్యం చేస్తూనే ఉంటాం. అయితే తాజాగా, ఓ వింత ఘటనలకు సంబంధించిన వీడియో ఒకటి నెట్టింట చక్కర్లు కొడుతోంది. హోటల్లోకి చొరబడిన కోతికి సిబ్బంది ఊహించని సర్‌ప్రైజ్ ఇచ్చారు. ఈ వీడియో చూసిన నెటిజన్లు హోటల్ సిబ్బందిని అభినందిస్తూ కామెంట్లు చేస్తున్నారు.
సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. ఎక్కడి నుంచి వచ్చిందో ఏమో గానీ.. ఓ కోతి నేరుగా (Monkey Entered The Hotel) ఓ హోటల్లోకి దూరింది. దాన్ని చూడగానే లోపల ఉన్న కస్టమర్లు మొత్తం పరుగులు తీశారు. కోతిని చూసి కోపంగా తరిమికొట్టాల్సిన సిబ్బంది.. అందుకు పూర్తి విరుద్ధంగా ప్రవర్తించారు.
లోపలికి వచ్చిన కోతికి ఆహ్వానం పలికడమే కాకుండా టేబుల్‌పై కూర్చోబెట్టి భోజనం కూడా వడ్డించారు. దీంతో ఆ కోతి దర్జాగా మనుషుల్లానే (Monkey Eating in Hotel) టేబుల్‌పై కూర్చుని భోజనం చేసింది. కోతి అలా బుద్ధిగా భోజనం చేయడాన్ని అక్కడున్న వారంతా ఆసక్తిగా తిలకించారు. కొందరు ఈ ఘటనను వీడియో తీసి, సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది.
ఈ వీడియోపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘కోతికి అతిథి మర్యాదలు మామూలుగా లేవుగా’.. అంటూ కొందరు, ‘ఈ హోటల్ యజమానిది చాలా గొప్ప మనసులా ఉంది’.. అంటూ మరికొందరు, వివిధ రకాల ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 2700కి పైగా లైక్‌లు, 68 వేలకు పైగా వ్యూస్‌ను సొంతం చేసుకుంది.
ఇవి కూడా చదవండి..
శివుడితో కామెడీ చేస్తే ఇలాగే ఉంటుంది.. ఎలాంటి ప్రతిఫలం దక్కిందంటే..
ఈ భర్తను చూస్తే అయ్యో పాపం అనాల్సిందే.. బైకుపై భార్య ఏం చేస్తుందో చూస్తే..
మరిన్ని వైరల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి