Share News

Driving Funny Video: వరద నీటిలో సేఫ్టీ ప్రయాణం.. ఇతడి ఐడియా మామూలుగా లేదుగా..

ABN , Publish Date - Jul 30 , 2025 | 12:31 PM

ఓ వ్యక్తి వరద నీటిలో స్కూటీపై వెళ్తున్నారు. అయితే ఎదురుగా వాహనాలు వస్తుండడంతో వరద నీరంతా మీద పడుతుంటుంది. దీంతో చివరకు అతడికి ఓ విచిత్రమైన ఐడియా వచ్చింది. చివరకు ఇతడు చేసిన పని చూసి అంతా తెగ నవ్వుకుంటున్నారు..

Driving Funny Video: వరద నీటిలో సేఫ్టీ ప్రయాణం.. ఇతడి ఐడియా మామూలుగా లేదుగా..

ప్రస్తుతం ఎక్కడ చూసినా విరివిగా వర్షాలు కురుస్తున్నాయి. కొన్ని ప్రాంతాల్లో అయితే భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ నేపథ్యంలో చాలా మంది ఇబ్బందులు పడుతున్న ఘటనలు చూస్తున్నాం. మరోవైపు రూడ్లపై వరద నీరు చేరడంతో వాహనదారులు కూడా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇక బైకర్ల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. రోడ్డుపై వెళ్లే సమయంలో కారు, బస్సు, లారీలు వంటి వాహనాలు ఎదురైతే.. వరద నీరు మొత్తం ఎగిరి మీదపడుతుంటుంది. ఇప్పుడీ ప్రస్తావన ఎందుకొచ్చిందంటే.. ఇలాంటి సమస్యకు ఓ స్కూటరిస్ట్‌ వింత పరిష్కారం కనుక్కున్నాడు.


సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. ఓ వ్యక్తి వరద నీటిలో స్కూటీపై వెళ్తున్నారు. అయితే ఎదురుగా వాహనాలు వస్తుండడంతో వరద నీరంతా మీద పడుతుంటుంది. దీంతో చివరకు అతడికి ఓ విచిత్రమైన ఐడియా వచ్చింది. వెంటనే రోడ్డు పక్కన ఉన్న ఇటుక రాయి తీసుకున్నాడు. ఓ చేతిలో రాయి పట్టుకుని, మరో చేత్తో స్కూటీని నడుపుతూ ముందుకు కదిలాడు.


ఎదురుగా వస్తున్న వాహనాలకు తన చేతిలోని ఇటుక రాయిని చూపిస్తూ.. వేగంగా వచ్చారో.. రాయితో కొడతా.. అన్నట్లుగా బెదిరించాడు. అతడి చేతిలో రాయిని చూసిన వాహనదారులు.. ఎక్కడ రాయితో అద్డాలు పగులగొడతాడో అనే భయంతో మెల్లగా వచ్చారు. దీంతో వరద నీరు తన మీద పడే ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. ఇలా ఆ స్కూటరిస్టు (Scooterist).. ఎంతో తెలివిగా ఆలోచించి వరద నీరు మీద పడకుండా జాగ్రత్తలు తీసుకున్నాడన్నమాట.


కాగా, ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘ఈ స్కూటరిస్ట్ ఐడియా మామూలుగా లేదుగా’.. అంటూ కొందరు, ‘ఎలా వస్తాయో ఇలాంటి ఐడియాలు’.. అంటూ మరికొందరు, వివిధ రకాల ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 200కి పైగా లైక్‌లు, 41 వేలకు పైగా వ్యూస్‌ను సొంతం చేసుకుంది.


ఇవి కూడా చదవండి..

శివుడితో కామెడీ చేస్తే ఇలాగే ఉంటుంది.. ఎలాంటి ప్రతిఫలం దక్కిందంటే..

ఈ భర్తను చూస్తే అయ్యో పాపం అనాల్సిందే.. బైకుపై భార్య ఏం చేస్తుందో చూస్తే..

మరిన్ని వైరల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Updated Date - Jul 30 , 2025 | 12:31 PM