Train Accident Video: నిర్లక్ష్యానికి లైవ్ ఎగ్జాంపుల్.. రైలుకు, ప్లాట్‌ఫామ్‌కు మధ్యలో ఇరుక్కోవడంతో..
ABN , Publish Date - Apr 27 , 2025 | 12:28 PM
రైలు ప్రయణ సమయాల్లో చాలా మంది నిర్లక్ష్యం కారణంగా ప్రాణాల మీదకు తెచ్చుకుంటుంటారు. కొందరు తెలీక చేసే పనులు కారణంగా, కంగారులో మరికొందరు, తెలిసి తెలిసి ఇంకొందరు ప్రమాదాల్లో చిక్కుకుంటుంటారు. అయితే..

రైలు ప్రయణ సమయాల్లో చాలా మంది నిర్లక్ష్యం కారణంగా ప్రాణాల మీదకు తెచ్చుకుంటుంటారు. కొందరు తెలీక చేసే పనులు కారణంగా, కంగారులో మరికొందరు, తెలిసి తెలిసి ఇంకొందరు ప్రమాదాల్లో చిక్కుకుంటుంటారు. అయితే ఇలాంటి సమయాల్లో కొందరు అదృష్టవశాత్తు ప్రాణాలతో బయటపడుతుంటారు. ఇలాంటి షాకింగ్ ఘటనలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. తాజాగా ఇలాంటి వీడియో ఒకటి నెట్టింట చక్కర్లు కొడుతోంది. ఓ వ్యక్తి రైలుకు, ప్లాట్‌ఫామ్‌కు మధ్యలో ఇరుక్కున్నాడు. చివరకు ఏం జరిగిందో మీరే చూడండి..
సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. మహారాష్ట్రలోని (Maharashtra) అంబర్‌నాథ్ రైల్వే స్టేషన్‌లో ఈ ఘటన చోటు చేసుకుంది. ఉల్హాస్‌నగర్‌లోని లాల్‌చౌకి ప్రాంతానికి చెందిన 34 ఏళ్ల హిత్ బచ్చెలాల్ యాదవ్ అనే వ్యక్తి .. అంబర్‌నాథ్ రైల్వే స్టేషన్ చేరుకున్నాడు.
Bathroom Funny Video: బాత్రూంకు జెడ్ ప్లస్ సెక్యూరిటీ.. ఇతడి నిర్వాకం చూస్తే నవ్వు ఆపుకోలేరు..
అదే సమయంలో లోకల్ రైలు బయలుదేరడంతో పరుగెత్తుకుంటూ రైలు ఎక్కే ప్రయత్నం చేశాడు. ఈ క్రమంలో ప్రమాదవశాత్తు రైలుకు, ప్లాట్‌ఫామ్‌కు మధ్యలో (man stuck in middle of train and platform) పడిపోయాడు. తర్వాత సుమారు రెండు మూడు బోగీల మేర రైలు ముందుకు కదిలింది. తర్వాత విషయం తెలుసుకుని రైలును ఆపేశారు. ఈ ఘటనలో ఆ వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు.
Tiger Funny Video: చాటుగా వచ్చిన పులి.. సడన్‌గా చూసిన కుక్క.. చివరకు జరిగింది చూస్తే..
అతి కష్టం మీద అతన్ని బయటికి తీసి, చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. అయితే చికిత్స పొందుతూ అతను మృతి చెందాడు. కాగా, ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘అయో.. ఎంత ఘోరం జరిగింది’’.. అంటూ కొందరు, ‘‘రైలు ఎక్కి, దిగే సమయంలో ఎంతో జాగ్రత్తగా ఉండాలి’’.. అంటూ మరికొందరు, వివిధ రకాల ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియోను ప్రస్తుతం 67 వేల మందికి పైగా వీక్షించారు.
Pig viral video: ఈ పంది అలెర్ట్ చూస్తే అవాక్కవ్వాల్సిందే.. ఎలా తప్పించుకుందో చూడండి..
ఇవి కూడా చదవండి..
Woman Dance Funny Video: ముందూ, వెనుకా చూసుకోవాలనేది ఇందుకే.. ఈమెకు ఏమైందో చూస్తే..
Tiger Funny Video: కొండచిలువను తిన్న పులి.. చివరకు ఏమైందో చూస్తే నవ్వు ఆపుకోలేరు..
Funny Viral Video: ఓయో రూంలో ప్రేమ జంట.. తలుపులు వేయడం మర్చిపోవడంతో.. చివరకు..