Share News

Pig viral video: ఈ పంది అలెర్ట్ చూస్తే అవాక్కవ్వాల్సిందే.. ఎలా తప్పించుకుందో చూడండి..

ABN , Publish Date - Apr 27 , 2025 | 11:42 AM

ఓ పంది అప్రమత్తతో తన ప్రాణాలను కాపాడుకుంది. దాహం వేయడంతో ఓ పంది నీళ్లు తాగేందుకు నది వద్దకు వెళ్లింది. తీరా నీళ్లు తాగుతున్న సమయంలో షాకింగ్ ఘటన చోటు చేసుకుంది.

Pig viral video: ఈ పంది అలెర్ట్ చూస్తే అవాక్కవ్వాల్సిందే.. ఎలా తప్పించుకుందో చూడండి..

నిర్లక్ష్యం కొన్నిసార్లు ప్రాణాలు తీసేస్తుంది. అప్రమత్తత కొన్నిసార్లు పెద్ద పెద్ద ప్రమాదాల నుంచి బయటపడేస్తుంది. ఇది మనుషులకే కాకుండా జంతువులకూ వర్తిస్తుంది. ఇందుకు నిదర్శనంగా మన కళ్ల ముందు అనేక సంఘటనలు చోటు చేసుకుంటుంటాయి. ఈ తరహా వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. తాజాగా, ఓ పంది వీడియో నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది. అప్రమత్తంగా వ్యవహరించి ప్రాణాలు కాపాడుకున్న పందిని చూసిన అంతా అవాక్కవుతున్నారు. ఈ వీడియో చూసిన వారంతా.. ‘‘ఈ పంది అలెర్ట్ మామూలుగా లేదుగా’’.. అంటూ కామెంట్లు చేస్తున్నారు.


సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. ఓ పంది అప్రమత్తతో తన ప్రాణాలను కాపాడుకుంది. దాహం వేయడంతో ఓ పంది నీళ్లు తాగేందుకు నది వద్దకు వెళ్లింది. తీరా నీళ్లు తాగుతున్న సమయంలో షాకింగ్ ఘటన చోటు చేసుకుంది.

Bathroom Funny Video: బాత్రూంకు జెడ్ ప్లస్ సెక్యూరిటీ.. ఇతడి నిర్వాకం చూస్తే నవ్వు ఆపుకోలేరు..


ఓ పెద్ద మొసలి అప్పటికే వేట కోసం వేచి చూస్తూ ఉంది. పంది నీళ్లు తాగుండగా సడన్‌గా దాడి చేసేందుకు దూసుకొచ్చింది. అయితే అప్పటికే ఆ పంది ఓ కన్ను నీటిపై మరో కన్ను మొసలిపై వేసింది. దీంతో మొసలి మీదకు వచ్చేలోగానే దూరంగా పరుగెత్తిపోయింది. ఇలా మొసలి బారి నుంచి ఎంతో చాకచక్యంగా తప్పించుకుంది. ఈ ఘటన మొత్తం పర్యాటకుల సమక్షంలోనే జరిగింది.

Food Viral Video: అరటిపండు అంటేనే అసహ్యం పుట్టేలా చేశారు కదరా.. వింత రెసిపీపై నెటిజన్ల షాకింగ్ రియాక్షన్..


కొందరు ఈ ఘటనను వీడియో తీసి, సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘వామ్మో.. ఈ పంది తెలివి మామూలుగా లేదుగా’’.. అంటూ కొందరు, ‘‘అప్రమత్తతతో ప్రాణాలు దక్కించుకున్న పంది’’.. అంటూ మరికొందరు, వివిధ రకాల ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 2,400లకు పైగా లైక్‌లు, 1.92 లక్షలకు పైగా వ్యూస్‌ను సొంతం చేసుకుంది.

Tiger Funny Video: చాటుగా వచ్చిన పులి.. సడన్‌గా చూసిన కుక్క.. చివరకు జరిగింది చూస్తే..


ఇవి కూడా చదవండి..

Woman Dance Funny Video: ముందూ, వెనుకా చూసుకోవాలనేది ఇందుకే.. ఈమెకు ఏమైందో చూస్తే..

Tiger Funny Video: కొండచిలువను తిన్న పులి.. చివరకు ఏమైందో చూస్తే నవ్వు ఆపుకోలేరు..

Funny Viral Video: ఓయో రూంలో ప్రేమ జంట.. తలుపులు వేయడం మర్చిపోవడంతో.. చివరకు..

మరిన్ని వైరల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Updated Date - Apr 27 , 2025 | 12:19 PM