Share News

Bathroom Funny Video: బాత్రూంకు జెడ్ ప్లస్ సెక్యూరిటీ.. ఇతడి నిర్వాకం చూస్తే నవ్వు ఆపుకోలేరు..

ABN , Publish Date - Apr 26 , 2025 | 09:39 PM

ఇళ్లల్లోని వస్తువులతో చిత్రవిచిత్ర ప్రయోగాలు చేసే వారిని తరచూ చూస్తుంటాం. కొందరు టేబుల్ ఫ్యాన్లతో ఏసీ ఎఫెక్ట్ వచ్చేలా చేస్తుంటే.. మరికొందరు ఏకంగా ఇంజెక్షన్ సాయంతో బల్బ్‌ను వెలిగిస్తుంటారు. ఇలాంటి..

Bathroom Funny Video: బాత్రూంకు జెడ్ ప్లస్ సెక్యూరిటీ.. ఇతడి నిర్వాకం చూస్తే నవ్వు ఆపుకోలేరు..

ఇళ్లల్లోని వస్తువులతో చిత్రవిచిత్ర ప్రయోగాలు చేసే వారిని తరచూ చూస్తుంటాం. కొందరు టేబుల్ ఫ్యాన్లతో ఏసీ ఎఫెక్ట్ వచ్చేలా చేస్తుంటే.. మరికొందరు ఏకంగా ఇంజెక్షన్ సాయంతో బల్బ్‌ను వెలిగిస్తుంటారు. ఇలాంటి ప్రయోగాలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. తాజాగా, ఓ వ్యక్తి తయారు చేసిన బాత్రూం డోరు చూసి అంతా అవాక్కవుతున్నారు. ఈ వీడియోను చూసిన వారంతా.. ‘‘బాత్రూంకు జెడ్ ప్లస్ సెక్యూరిటీ’’.. అంటూ కామెంట్లు చేస్తున్నారు..


సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. ఓ వ్యక్తి బాత్రూం డోరును (Bathroom Door) ఏర్పాటు చేసిన విధానం చూసి అంతా అవాక్కవుతున్నారు. ఇనుప డోరును ఏర్పాటు చేసిన అతను.. దానికి కింద, పైనా, చుట్టు పక్కల కలిపి మొత్తం ఏడు లాక్‌లను ఏర్పాటు చేశాడు.

Food Viral Video: అరటిపండు అంటేనే అసహ్యం పుట్టేలా చేశారు కదరా.. వింత రెసిపీపై నెటిజన్ల షాకింగ్ రియాక్షన్..


ఆ లాక్‌లన్నీ వేశాక.. మళ్లీ ఓ ఇనుప కడ్డీని కూడా తగిలించి బాగా బిగిస్తాడు. దీన్ని చూసి ముందుగా అంతా అదేదో బీరువాకు తలుపులు బలంగా వేస్తున్నాడని అనుకుంటారు. కానీ తీరా చూస్తే లోపల బాత్రూం కమోడ్ కనిపిస్తుంది. దీంతో అప్పటిదాకా అతను బాత్రూం డోరును వేశాడు అని అర్థమవుతుంది. ఇలా బాత్రూం డోరును ఎంతో భద్రంగా లాక్ చేయడం చూసి అంతా తెగ నవ్వుకుంటున్నారు.

Accident Viral Video: అయ్యో.. ఎంత ఘోరం.. విద్యార్థినులు నడుస్తూ వెళ్తుండగా.. ఏమైందో చూస్తే..


ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘బాత్రూంకు జెడ్ ప్లస్ సెక్యూరిటీ’’.. అంటూ కొందరు, ‘‘అదేమైనా బ్యాంక్ అనుకున్నావా.. బ్రో..’’.. అంటూ మరికొందరు, ఫన్నీ ఫన్నీ ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 88వేలకు పైగా లైక్‌లు, 1.5 మిలియన్‌కు పైగా వ్యూస్‌ను సొంతం చేసుకుంది.

Tiger Funny Video: చాటుగా వచ్చిన పులి.. సడన్‌గా చూసిన కుక్క.. చివరకు జరిగింది చూస్తే..


ఇవి కూడా చదవండి..

Woman Dance Funny Video: ముందూ, వెనుకా చూసుకోవాలనేది ఇందుకే.. ఈమెకు ఏమైందో చూస్తే..

Tiger Funny Video: కొండచిలువను తిన్న పులి.. చివరకు ఏమైందో చూస్తే నవ్వు ఆపుకోలేరు..

Funny Viral Video: ఓయో రూంలో ప్రేమ జంట.. తలుపులు వేయడం మర్చిపోవడంతో.. చివరకు..

మరిన్ని వైరల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Updated Date - Apr 26 , 2025 | 09:39 PM