Share News

Tiger Funny Video: చాటుగా వచ్చిన పులి.. సడన్‌గా చూసిన కుక్క.. చివరకు జరిగింది చూస్తే..

ABN , Publish Date - Apr 26 , 2025 | 08:19 PM

ఓ పులి రాత్రి సమయంలో చాటుగా నక్కి నక్కి వీధిలోకి వస్తుంటుంది. ఇలా రోడ్డుపైకి రాగానే.. ఆ పక్కనే గోడపై పడుకుని ఉన్న కుక్క.. సడన్‌గా పైకి లేచి పులిని చూస్తుంది. చివరకు ఏం జరిగిందో మీరే చూడండి..

Tiger Funny Video: చాటుగా వచ్చిన పులి.. సడన్‌గా చూసిన కుక్క.. చివరకు జరిగింది చూస్తే..

పులులను చూస్తే మిగతా జంతువులు భయంతో వణికిపోతుంటాయి. పులుల్లో మాత్రం ఎక్కడా చిన్నపాటి భయం కూడా కనిపించదు. భయం అనే మాటే వాటికి తెలీదు అనేలా ప్రవర్తిస్తుంటాయి. అయితే కొన్నిసార్లు ఇందుకు పూర్తి విరుద్ధంగా జరుగుతుంటుంది. మిగతా జంతువులను చూసి పులులు భయపడాల్సిన పరిస్థితి వస్తుంటుంది. తాజాగా, ఇలాంటి సంఘటనకు సంబంధించిన వీడియో ఒకటి నెట్టింట చక్కర్లు కొడుతోంది. ఈ వీడియోను చూసిన నెటిజన్లు ఫన్నీ ఫన్నీ కామెంట్లు చేస్తున్నారు.


సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. ఓ పులి రాత్రి సమయంలో చాటుగా నక్కి నక్కి వీధిలోకి వస్తుంటుంది. మెల్లగా రోడ్డు పైకి వచ్చిన పులి.. వేట కోసం వెతుకుతూ ఉంటుంది. ఇలా రోడ్డుపైకి రాగానే.. ఆ పక్కనే గోడపై పడుకుని ఉన్న కుక్క.. సడన్‌గా పైకి లేచి పులిని చూస్తుంది.

Accident Viral Video: అయ్యో.. ఎంత ఘోరం.. విద్యార్థినులు నడుస్తూ వెళ్తుండగా.. ఏమైందో చూస్తే..


పులిని చూడగానే కుక్క గట్టిగా మొరుగుతుంది. దీంతో చిరుత పులి (tiger ran away when the dog barked) భయంతో పరుగందుకుంటుంది. కళ్లు మూసి తెరిచేలోగానే అక్కడి నుంచి పారిపోతుంది. ఇలా కుక్క మొరగడంతో చిరుత భయంతో పారిపోవడం చూసి అంతా అవాక్కవుతున్నారు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.

Woman Stunt Viral Video: వామ్మో.. ఇదెక్కడి టాలెంట్ బాబోయ్.. వేగంగా తిరిగే ఫ్యాన్‌ను సైతం..


ఈ వీడియోపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘పులిని వణికించిన కుక్క’’.. అంటూ కొందరు, ‘‘చూస్తుంటేనే నవ్వొస్తోంది.. భలే భయపెట్టిందిగా’’.. అంటూ మరికొందరు, వివిధ రకాల ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 7 వేలకు పైగా వ్యూస్‌ను సొంతం చేసుకుంది.

Woman Dance Funny Video: ముందూ, వెనుకా చూసుకోవాలనేది ఇందుకే.. ఈమెకు ఏమైందో చూస్తే..


ఇవి కూడా చదవండి..

Woman Dance Funny Video: ముందూ, వెనుకా చూసుకోవాలనేది ఇందుకే.. ఈమెకు ఏమైందో చూస్తే..

Tiger Funny Video: కొండచిలువను తిన్న పులి.. చివరకు ఏమైందో చూస్తే నవ్వు ఆపుకోలేరు..

Funny Viral Video: ఓయో రూంలో ప్రేమ జంట.. తలుపులు వేయడం మర్చిపోవడంతో.. చివరకు..

మరిన్ని వైరల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Updated Date - Apr 26 , 2025 | 08:19 PM