Watch Video: ఇతడిది మామూలు గుండె కాదు.. డాక్టర్ల ముందు బ్యాగులో నుంచి ఏం తీశాడో చూడండి..
ABN , Publish Date - Jun 27 , 2025 | 06:08 PM
ఓ వ్యక్తి స్టూడెంట్ తరహాలో స్టైల్‌గా బ్యాగు తగిలించుకుని మరీ ఆస్పత్రికి వచ్చాడు. అంతా అతను ఏవైనా మందులు విక్రయించడానికి వచ్చాడేమో అని అనుకున్నారు. అయితే నేరుగా లోపలికి వచ్చిన అతను.. డాక్టర్ వద్దకు వెళ్లి..

ఆస్పత్రుల్లో డాక్టర్లకు నిత్యం వివిధ రకాల అనుభవాలు ఎదురవుతుంటాయి. అనేక సమస్యలతో వచ్చే రోగులు.. కొన్నిసార్లు వైద్యులను అవాక్కయ్యేలా చేస్తుంటారు. కడుపు నొప్పితో వచ్చిన వారికి స్కానింగ్ తీస్తే.. లోపల ఇనుప వస్తువులు కనిపిస్తుంటాయి. అలాగే చెవి నొప్పితో వాచ్చే వారిని చెక్ చేస్తే.. ఏకంగా లోపలి నుంచి పాములే బయటికి వస్తుంటాయి. ఇలాంటి చిత్రవిచిత్ర సంఘటనలకు సంబంధించిన వీడియోలను నిత్యం చూస్తుంటాం. తాజాగా, ఓ విచిత్ర సంఘటనకు సంబంధించిన వీడియో ఒకటి నెట్టింట చక్కర్లు కొడుతోంది. ఓ వ్యక్తి స్టైల్‌గా బ్యాగు తగిలించుకుని ఆస్పత్రికి వచ్చాడు. చివరకు అందులో నుంచి బయటికి తీసింది చూసి అంతా షాక్ అయ్యారు.
సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. ఈ ఘటన జైపూర్‌లోని రాజస్థాన్ యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ ఆసుపత్రిలో చోటు చేసుకుంది. ఓ వ్యక్తి స్టూడెంట్ తరహాలో స్టైల్‌గా బ్యాగు తగిలించుకుని మరీ ఆస్పత్రికి వచ్చాడు. అంతా అతను ఏవైనా మందులు విక్రయించడానికి వచ్చాడేమో అని అనుకున్నారు. అయితే నేరుగా లోపలికి వచ్చిన అతను.. డాక్టర్ వద్దకు వెళ్లి.. ‘నన్ను పాము కరిచింది డాక్టర్’.. అంటూ నవ్వుతూ చెప్పాడు.
పాము కాటేసిన విషయాన్ని నవ్వుతూ చెప్పడమే కాకుండా బ్యాగులో (Man took the snake out of bag) నుంచి బతికున్న పామును బయటికి తీశాడు. బ్యాగులో ఏముందబ్బా.. అని ఆసక్తిగా ఎదురు చూసిన వారంతా.. లోపల పాము ఉండడం చూసి షాక్ అయ్యారు. పక్కనే ఉన్న కొందరు సిబ్బంది పామును చూసి భయంతో దూరంగా వెళ్లిపోయారు. తర్వాత వైద్యులు అతడికి చికిత్స అందించారు. అలాగే పామును సురక్షితంగా అడవిలోకి వదిలేశారు.
కాగా, ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలోని వివిధ వేదికల్లో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘పాము కాటేసినా నవ్వుతూ చెప్పడం గ్రేట్’.. అంటూ కొందరు, ‘అది పాము అనుకున్నావా.. తాడు అనుకున్నావా’.. అంటూ మరికొందరు, వివిధ రకాల ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు.
ఇవి కూడా చదవండి..
మీ దుంపలు తెగా.. చైనాను మించిపోయారు కదరా.. ఆమ్లెట్ ఎలా చేస్తున్నాడో చూడండి..
అర్ధరాత్రి టెంట్‌లో కొత్త జంటలు.. సమీపానికి వెళ్లిన సింహాలు.. చివరకు..
మరిన్ని వైరల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..