Watch Video: ఏం తింటున్నావురా అయ్యా.. పచ్చి కొబ్బరికాయను ఎలా పగులగొట్టాడో చూస్తే..
ABN , Publish Date - Jun 22 , 2025 | 09:49 PM
కొబ్బరికాయలు నేలపై కుప్పగా పోసి ఉంటారు. వాటి వద్దకు వెళ్లిన ఓ యువకుడు.. వాటిలో నుంచి ఓ కొబ్బరికాయను తీసుకున్నాడు. దాన్ని చేతిలోకి తీసుకుని, మరో చేత్తో ఒక్క గుద్దు గుద్దుతాడు. చివరికి ఏమైందో మీరే చూడండి..

కొందరి టాలెంట్ చూస్తే ఆశ్చర్యం కలుగుతుంటుంది. ఎవరూ చేయలేని పనులను ఎంతో అవలీలగా చేస్తూ అందరినీ షాక్‌కు గురి చేస్తుంటారు. ట్రాఫిక్‌లో బైకులను భుజం పైకి ఎత్తుకుని మోసుకెళ్లడం, కార్లు, బస్సులు, లారీలను వెంట్రులతో లాగడం వంటి సాహసాలు చేయడం చూస్తుంటాం. ఇలాంటి విచిత్ర ప్రయోగాలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. తాజాగా, ఓ వ్యక్తి విచిత్రమైన టాలెంట్ వీడియో తెగ చక్కర్లు కొడుతోంది. పచ్చి కొబ్బరికాయను చేత్తో పగులగొట్టడం చూసి అంతా షాక్ అవుతున్నారు.
సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. కొబ్బరికాయలు నేలపై కుప్పగా పోసి ఉంటారు. వాటి వద్దకు వెళ్లిన ఓ యువకుడు.. అందులో నుంచి ఓ కొబ్బరికాయను తీసుకున్నాడు. దాన్ని చేతిలోకి తీసుకుని, మరో చేత్తో (Man cracked coconut with his hands) దానిపై ఒక్క గుద్దు గుద్దుతాడు.
అలా చేత్తో కొట్టగానే.. దెబ్బకు కొబ్బరికాయ పగిలి, నీరు బయటికి వస్తుంది. ఆ తర్వాత దాన్ని వట్టి చేతులతో రెండుగా చీల్చి, అందులోని నీళ్లు తాగేస్తాడు. కత్తితో కొట్టాల్సిన పచ్చి కొబ్బరికాయను ఇలా వట్టి చేతులతో అవలీలగా పగులగొట్టి అందరినీ షాక్‌కు గురి చేస్తున్నాడు. కాగా, ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.
ఈ వీడియోపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘వామ్మో.. ఇతడి టాలెంట్ మామూలుగా లేదుగా’.. అంటూ కొందరు, ‘ఇది చేయి కాదు.. సుత్తి’.. అంటూ మరికొందరు, వివిధ రకాల ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 800కి పైగా లైక్‌లు, 42 వేలకు పైగా వ్యూస్‌ను సొంతం చేసుకుంది.
ఇవి కూడా చదవండి..
మీ దుంపలు తెగా.. చైనాను మించిపోయారు కదరా.. ఆమ్లెట్ ఎలా చేస్తున్నాడో చూడండి..
అర్ధరాత్రి టెంట్‌లో కొత్త జంటలు.. సమీపానికి వెళ్లిన సింహాలు.. చివరకు..
మరిన్ని వైరల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..