Funny Viral Video: హిజ్రాకే మస్కా కొట్టారుగా.. డబ్బులు ఇవ్వకుండా ఎలా తప్పించుకున్నారో చూడండి..
ABN , Publish Date - Jun 19 , 2025 | 09:29 PM
ఓ హిజ్రా రైల్లో ప్రయాణికులను డబ్బులు అడుక్కుంటోంది. ఓ వైపు నుంచి మరోవైపునకు డబ్బులు అడుగుతూ వస్తుంది. అదే బోగీలో ఇద్దరు యువకులు ఎదురెదురుగా కూర్చుని తమాషాగా గొడవ పడుతుంటారు. అయితే..

బస్సు, రైలు ప్రయాణాల్లో భిక్షగాళ్లతో పాటూ హిజ్రాలు కూడా డబ్బులు అడుక్కోవడం సర్వసాధారణం. అయితే కొన్నిసార్లు కొందరు హిజ్రాలు డబ్బులు అడిగే పద్ధతి అభ్యంతకరంగా ఉంటుంది. దీంతో చాలా మంది వారిని చూడగానే డబ్బులు ఇవ్వడమో లేక దాక్కోవడమో చేస్తుంటారు. ఇలాంటి సంఘటనలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. అయితే తాజాగా, వైరల్ అవుతున్న వీడియోలో ఓ తమాషా సంఘటన చోటు చేసుకుంది.
సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. ఓ హిజ్రా రైల్లో ప్రయాణికులను డబ్బులు అడుక్కుంటోంది. ఓ వైపు నుంచి మరోవైపునకు (Hijra begging for money on the train) డబ్బులు అడుగుతూ వస్తుంది. అదే బోగీలో ఇద్దరు యువకులు ఎదురెదురుగా కూర్చుని తమాషాగా గొడవ పడుతుంటారు. అయితే ఇంతలో హిజ్రా డబ్బులు అడుగుతూ వారి సీటు సమీపానికి వచ్చేస్తుంది.
హిజ్రా తమ దగ్గరికి రావడాన్ని గమనించిన యువకులు.. సడన్‌గా సీట్లో పడుకుండిపోతారు. అక్కడికి వచ్చిన హిజ్రా.. యువకులు పడుకుని ఉండడాన్ని చూసి డబ్బులు అడక్కుండా వారి తలపై చేయి పెట్టి ఆశీర్వదించి వెళ్లిపోతుంది. ఇలా హిజ్రాకు డబ్బులు ఇవ్వకుండా ఎంతో తెలివిగా తప్పించుకుంటారన్నమాట. ఈ ఘటనను కొందరు వీడియో తీసి, సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఈ వీడియో ప్రస్తుతం తెగ చక్కర్లు కొడుతోంది.
ఈ వీడియోపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘వీరి టైం బాగుంది.. మమ్మల్ని అయితే నిద్రపోయినా వదల్లేదు’.. అంటూ కొందరు, ‘తప్పించుకోవడానికి క్యాష్ లేదు అని చెప్పాను.. ఆ వెంటనే వారు స్కానర్ బయటికి తీశారు’.. అంటూ మరికొందరు, ఫన్నీ ఫన్నీ ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తు్న్నారు. ఈ వీడియో ప్రస్తుతం 2700కి పైగా లైక్‌లు, 1.2 మిలియన్‌కు పైగా వ్యూస్‌ను సొంతం చేసుకుంది.
ఇవి కూడా చదవండి..
అర్ధరాత్రి టెంట్‌లో కొత్త జంటలు.. సమీపానికి వెళ్లిన సింహాలు.. చివరకు..
దుకాణ యజమానితో ఫన్నీ గేమ్.. చివరకు జరిగింది చూస్తే నవ్వు ఆపుకోలేరు..
మరిన్ని వైరల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..