Share News

Lion Viral Video: అర్ధరాత్రి టెంట్‌‌లో కొత్త జంటలు.. సమీపానికి వెళ్లిన సింహాలు.. చివరకు..

ABN , Publish Date - Jun 18 , 2025 | 07:32 PM

కొన్ని జంటలు హనీమూన్ వెళ్లి రాత్రి వేళ్ల టెంట్‌లలో పడుకుని ఉంటారు. అయితే రాత్రి వేళ్ల ఉన్నట్టుండి షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. కొన్ని సింహాలు ఆ టెంట్‌ల వద్దకు చొరబడ్డాయి. టెంట్‌లను విచిత్రంగా చూసిన సింహాలు.. చివరకు ఏం చేశాయో మీరే చూడండి..

Lion Viral Video:  అర్ధరాత్రి టెంట్‌‌లో కొత్త జంటలు.. సమీపానికి వెళ్లిన సింహాలు.. చివరకు..

జనావాసాల్లోకి అడవి జంతువులు చొరబడే ఘటనలు తరచూ చూస్తుంటాం. ఇలాంటి సమయాల్లో మనుషులు, జంతువులపై దాడి చేయడం చూస్తుంటాం. కొన్నిసార్లు కొందరు పులులు, సింహాల బారి నుంచి తృటిలో తప్పించుకుంటుంటారు. ఇలాంటి విచిత్ర సంఘటనలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. తాజాగా, ఇలాంటి వీడియో ఒకటి నెట్టింట చక్కర్లు కొడుతోంది. హనీమూన్‌లో కొన్ని జంటలు టెంట్‌లో పడుకుని ఉంటారు. అయితే అర్ధరాత్రి సమయంలో కొన్ని సింహాలు అక్కడికి వెళ్తాయి. చివరకు ఏం జరిగిందో చూడండి..


సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. కొన్ని జంటలు హనీమూన్ వెళ్లి రాత్రి వేళ్ల టెంట్‌లలో పడుకుని ఉంటారు. అయితే రాత్రి వేళ్ల ఉన్నట్టుండి షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. కొన్ని సింహాలు ఆ టెంట్‌ల (Lions approached the tents at night) వద్దకు చొరబడ్డాయి. టెంట్‌లను విచిత్రంగా చూసిన సింహాలు.. అక్కడున్న వస్తువులను చిందరవందరగా పడేస్తాయి.


తర్వాత టెంట్ చుట్టూ తిరుగుతూ ఆహారం కోస వెతుకుతాయి. ఈ క్రమంలో కొద్ది సేపటి తర్వాత టెంట్‌ లోపల ఉన్న వారికి మెలకువ వస్తుంది. బయట సింహాలు తిరుగుతండడం చూసి వారంతా షాక్ అవుతారు. వాటికి అనుమానం రాకుండా సైలెంట్‌గా పడుకుండిపోతారు. ఇలా చాలా సేపు వరకూ ఆ సింహాలు అక్కడే తిరుగుతూ వారిని భయభ్రాంతులకు గురి చేస్తాయి. అయితే ఈ ఘటనలో ఎవరికీ ఎలాంటి ప్రమాదం జరక్కపోవడంతో అంతా ఊపిరి పీల్చుకుంటారు. ఈ ఘటన మొత్తం అక్కడే వారు తమ కెమెరాల్లో బంధించారు.


అయితే ఇదంతా కావాలని షూట్ చేసినట్లుగా ఉందంటూ కొందరు కొట్టిపారేస్తున్నారు. ఏది ఏమైనా ఈ వీడియో మాత్రం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘హనీమూన్ రాత్రి.. కాలరాత్రిగా మారిందే’.. అంటూ కొందరు, ‘సింహాలను కూడా తట్టుకునేలా ఉన్న టెంట్లు’... అంటూ మరికొందరు, వివిధ రకాల ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 1600కి పైగా లైక్‌లు, 1.79 లక్షలకు పైగా వ్యూస్‌ను సొంతం చేసుకుంది.


ఇవి కూడా చదవండి..

దుకాణ యజమానితో ఫన్నీ గేమ్.. చివరకు జరిగింది చూస్తే నవ్వు ఆపుకోలేరు..

పాకిస్తాన్ కాదు.. ఇది ట్యాంకిస్తాన్.. ట్రోలింగ్ మామూలుగా లేదుగా..

మరిన్ని వైరల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Updated Date - Jun 18 , 2025 | 07:32 PM