Horse Funny Video: గుర్రం ముందు డాన్స్ చేస్తే ఇలాగే అవుతుంది మరి.. ఈమె పరిస్థితి చివరకు..
ABN , Publish Date - Jun 15 , 2025 | 01:57 PM
ఓ మహిళ గడ్డి మైదానంలో డాన్స్ చేస్తూ రీల్స్ తీస్తుంటుంది. అక్కడే రెండు గుర్రాలు మేత మేస్తుంటాయి. ఇంతవరకూ అంతా బాగానే ఉంది కానీ.. ఇక్కడే ఎవరూ ఊహించని ఘటన చోటు చేసుకుంటుంది. ఆమె డాన్స్ చూసి విసుగొచ్చిందో ఏమో గానీ.. గుర్రం ఊహించని విధంగా ప్రవర్తిస్తుంది..

ప్రస్తుత సోషల్ మీడియా యుగంలో పిల్లల నుంచి పెద్దల వరకూ ప్రతి ఒక్కరూ రీల్స్ చేయడం అలవాటుగా చేసుకున్నారు. ఆఖరికి పల్లెటూరిలో చదువు రాని వారు కూడా రీల్స్ చేయడం దినచర్యగా చేసుకుంటున్నారు. ఈ క్రమంలో కొందరు చుట్టూ ఏం జరుగుతుందో.. అన్న కనీస స్పృహ కూడా లేకుండా రీల్స్ చేస్తుంటారు. ఇలాంటి సమయాల్లో కొన్నిసార్లు షాకింగ్ ఘటనలు చోటు చేసుకుంటుంటాయి. ఈ తరహా వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. తాజాగా, ఇలాంటి వీడియో ఒకటి నెట్టింట చక్కర్లు కొడుతోంది. ఓ మహిళ డాన్స్ చేస్తుండడం చూసి గుర్రానికి చిర్రెత్తుకొస్తుంది. చివరకు ఏం చేసిందో మీరే చూడండి..
సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. ఓ మహిళ గడ్డి మైదానంలో డాన్స్ చేస్తూ రీల్స్ తీస్తుంటుంది. అక్కడే రెండు గుర్రాలు మేత మేస్తుంటాయి. ఇంతవరకూ అంతా బాగానే ఉంది కానీ.. ఇక్కడే ఎవరూ ఊహించని ఘటన చోటు చేసుకుంటుంది. ఆమె డాన్స్ చూసి విసుగొచ్చిందో ఏమో గానీ.. గుర్రం ఊహించని విధంగా ప్రవర్తిస్తుంది.
‘ప్రశాంతంగా మేత మేస్తుంటే.. నీ డాన్స్ గోల ఏంటహే’.. అన్నట్లుగా కోపంగా ఆమె వద్దకు వెళ్లి .. వెనక్కు తిరిగి మరీ (Horse kicked the woman) కాలితో ఒక్క తన్ను తన్నింది. దెబ్బకు ఆమె దూరంగా పడిపోతుంది. వామ్మో ఇక బుద్ధి ఉంటే గుర్రాల ముందు డాన్స్ చేయొద్దు.. బాబోయ్.. అనుకుంటూ అక్కడి నుంచి పారిపోతుంది. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.
ఈ వీడియోపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘రీల్స్ తయారీదారులంటే ఈ గుర్రానికి పడదనుకుంటా’.. అంటూ కొందరు, ‘నా ఏరియాలోకి వచ్చి ఏంటీ నీ రీల్స్ గోల.. అనేది గుర్రం ఇన్నర్ ఫీలింగ్’... అంటూ మరికొందరు, వివిధ రకాల ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 3 లక్షలకు పైగా లైక్‌లు, 25 మిలియన్లకు పైగా వ్యూస్‌ను సొంతం చేసుకుంది.
ఇవి కూడా చదవండి..
దుకాణ యజమానితో ఫన్నీ గేమ్.. చివరకు జరిగింది చూస్తే నవ్వు ఆపుకోలేరు..
పాకిస్తాన్ కాదు.. ఇది ట్యాంకిస్తాన్.. ట్రోలింగ్ మామూలుగా లేదుగా..