Nurse Viral Video: ఈ నర్సు టెక్నిక్ మామూలుగా లేదుగా.. పిల్లాడిని సెకన్లలో ఎలా నిద్రపుచ్చిందో చూడండి..
ABN , Publish Date - Jun 14 , 2025 | 01:39 PM
రోజుల వయసున్న శిశువు ఏడుస్తూ మారాం చేస్తోంది. దీంతో అక్కడికి వెళ్లిన నర్సు.. పిల్లాడిని బోర్లా పడుకోబెట్టి ఓ ప్రయోగం చేస్తుంది. ముందుగా పిల్లాడి దవడల కింద రెండు చేతి వేళ్లతో సుతిమెత్తగా మసాజ్ చేస్తుంది. దీంతో చివరకు ఏమైందో మీరే చూడండి..

కొందరు పిల్లలు ఓ వయసు వచ్చే వరకూ తెగ మారాం చేస్తుంటారు. ముఖ్యంగా రాత్రి వేళల్లో నిద్రపోకుండా ఇబ్బంది పెడుతుంటారు. ఎంత లాలించినా ఏడుపు మాత్రం మానుకోరు. ఇలాంటి సమయాల్లో వారిని నిద్రపుచ్చేందుకు తల్లిదండ్రులు తెగ తంటాలు పడుతుంటారు. ఇప్పుడీ ప్రస్తావన ఎందుకొచ్చిందంటే.. సోషల్ మీడియాలో ఓ నర్సు వీడియో తెగ వైరల్ అవుతోంది. మారాం చేస్తున్న పిల్లాడిని క్షణాల వ్యవధిలో నిద్రపోయేలా చేసింది. ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది. ఈ వీడియో చూసిన నెటిజన్లు నర్సు టాలెంట్ చూసి ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఈ టెక్నిక్ ఏదో చాలా బాగుందే.. అంటూ కామెంట్లు చేస్తున్నారు.
సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. రోజుల వయసున్న శిశువు ఏడుస్తూ మారాం చేస్తోంది. దీంతో అక్కడికి వెళ్లిన నర్సు.. పిల్లాడిని బోర్లా పడుకోబెట్టి ఓ ప్రయోగం చేస్తుంది. ముందుగా పిల్లాడి దవడల కింద రెండు చేతి వేళ్లతో సుతిమెత్తగా మసాజ్ చేస్తుంది. ఆ తర్వాత నుదుటిపై కూడా తన ముని వేళ్లతో మసాజ్ చేస్తుంది.
ఇలా ఆ నర్సు కొద్ది సేపు చేయగానే ఆ పిల్లాడు ఆవలించి (Nurse Put Baby To Sleep) నిద్రలోకి జారుకుంటాడు. ఆ తర్వాత పిల్లాడిని పడుకోబెట్టగా హాయిగా నిద్రపోతాడు. ఇలా ఆ నర్సు వినూత్నమైన టెక్నిక్‌తో ఆ పిల్లాడిని నిద్రపుచ్చుతుంది. అయితే ఈ వీడియోను అంతా ఏఐ టెక్నాలజీ చేశారని అంటుండగా.. మరికొందరు నర్సు టాలెంట్‌ను అభినందిస్తున్నారు.
ఏది ఏమైనా ఈ వీడియో మాత్రం ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘ఈ టెక్నిక్ ఏదో బాగుందే.. మేమూ ఇలా ట్రైచేసి చూస్తాం’.. అంటూ కొందరు, ‘ఈ పిల్లాడి బరువు మొత్తం దిగిపోయినట్లుంది’.. అంటూ మరికొందరు, ఫన్నీ ఫన్నీ ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 2 లక్షలకు పైగా లైక్‌లు, 10 మిలియన్లకు పైగా వ్యూస్‌ను సొంతం చేసుకుంది.
ఇవి కూడా చదవండి..
దుకాణ యజమానితో ఫన్నీ గేమ్.. చివరకు జరిగింది చూస్తే నవ్వు ఆపుకోలేరు..
పాకిస్తాన్ కాదు.. ఇది ట్యాంకిస్తాన్.. ట్రోలింగ్ మామూలుగా లేదుగా..