Elephant Viral Video: నీళ్లలో మునిగిపోతున్న జింకను.. ఏనుగు ఎలా కాపాడిందో చూస్తే..
ABN , Publish Date - Jun 08 , 2025 | 01:35 PM
ఓ జూలో కొన్ని జింకలు అటూ, ఇటూ పరుగెడుతుంటాయి. అక్కడే ఓ పెద్ద ఏనుగు సైలెంట్‌గా నిలబడి ఉంటుంది. ఆ సమయంలో అక్కడే ఉన్న ఓ పిల్ల జింక నీళ్లు తాగే క్రమంలో అందులో పడిపోయింది. అయితే చివరకు ఏనుగు ఆ జింకను కాపాడిన విధానం చూసి అంతా అవాక్కవుతున్నారు..

ఏనుగు ఎంత శక్తివంతమైన జంతువో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఒక్కసారి దానికి కోపం వచ్చిందంటే.. ఊర్లు, ఇళ్లు, వనాలూ గుళ్లగుళ్ల కావాల్సిందే. కొన్నిసార్లు జనాలపై పడి బీభత్సం సృష్టించడం కూడా చూస్తుంటాం. అయితే అలాంటి ఏనుగులు అప్పుడప్పుడూ అంతా శభాష్ అనేలా ప్రవర్తిస్తుంటాయి. ఆపదలో ఉన్న జంతువులను కాపాడి.. ఔరా అని అనిపిస్తుంటాయి. ఇలాంటి ఆసక్తికర ఘటనలకు సంబంధించిన వీడియోలను నిత్యం చూస్తూనే ఉంటాం. తాజాగా, ఇలాంటి వీడియో ఒకటి నెట్టింట చక్కర్లు కొడుతోంది. నీళ్లలో మునిగిపోతున్న జింకను కాపాడిన ఏనుగును చూసి అంతా ప్రశంసలు కురిపిస్తూ కామెంట్లు చేస్తున్నారు..
సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. ఓ జూలో కొన్ని జింకలు అటూ, ఇటూ పరుగెడుతుంటాయి. అక్కడే ఓ పెద్ద ఏనుగు సైలెంట్‌గా నిలబడి ఉంటుంది. ఆ సమయంలో అక్కడే ఉన్న ఓ పిల్ల జింక నీళ్లు తాగే క్రమంలో అందులో పడిపోయింది. బయటికి రాలేక నీళ్లలో గిలగిలా కొట్టుకుంటూ ఉంది.
జింకలో నీళ్లలో పడిపోవడాన్ని గమనించిన ఏనుగు.. దగ్గరికి వెళ్లి తొండంతో బయటికి లాగేస్తుంది. మొదటి ప్రయత్నంలో విఫలమైనా.. రెండోసారి మళ్ీల ప్రయత్నించి (Elephant Saves Deer ) జింకను క్షేమంగా బయటికి తీసుకొస్తుంది. ఆ తర్వాత జింకలను నీళ్ల వద్దకు వెళ్లకుండా అడ్డుకుంటుంది. ఏనుగు చేసిన ఈ మంచి పని చూసి అక్కడే ఉన్న పర్యాటకులు శభాష్ అంటూ కేకలు వేశారు.
కొందరు ఈ ఘటనను వీడియో తీసి, సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘ఈ ఏనుగుది ఎంత మంది మనసు’.. అంటూ కొందరు, ‘మనుషులంతా ఈ ఏనుగును ఆదర్శంగా తీసుకోవాలి’.. అంటూ మరికొందరు, వివిధ రకాల ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 74 వేలకు పైగా లైక్‌లు, 2 మిలియన్లకు పైగా వ్యూస్‌ను సొంతం చేసుకుంది.
ఇవి కూడా చదవండి..
పాకిస్తాన్ కాదు.. ఇది ట్యాంకిస్తాన్.. ట్రోలింగ్ మామూలుగా లేదుగా..
ఎక్కడ ఏది చేయకూడదో అదే చేశారుగా.. టాయిలెట్ కమోడ్ను ఎలా వాడుతున్నారో చూడండి..