Share News

Tiger Stunt Video: ఇంతవరకూ వేటాడే పులిని మాత్రమే చూశారు.. ఈ వీడియో చూస్తే..

ABN , Publish Date - Jun 07 , 2025 | 12:45 PM

ఓ పులి వేట కోసం వెతుకుతూ ఉంటుంది. అడవిలో అటూ, ఇటూ తిరుగుతున్న సమయంలో దానికి మధ్యలో ఓ వాగు అడ్డుగా వస్తుంది. దీంతో చివరకు పులి చేసిన పని చూసి అంతా షాక్ అవుతున్నారు..

Tiger Stunt Video: ఇంతవరకూ వేటాడే పులిని మాత్రమే చూశారు.. ఈ వీడియో చూస్తే..

పులి వేట ఎంత భయంకరంగా, ఎంత చాకచక్యంగా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఒక్కసారి వేటలోకి దిగిందంటే కళ్లు చెదిరే వేగంతో పరుగులు పెడుతూ క్షణాల వ్యవధిలో పని పూర్తి చేస్తుంటాయి. పులులు వేట విషయంలోనే కాకుండా అనేక విషయాల్లో అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తుంటాయి. ఇలాంటి విచిత్ర సంఘటనలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. తాజాగా, ఓ పులి స్టంట్ వీడయో తెగ హల్‌చల్ చేస్తోంది. ఈ వీడియో చూసిన వారంతా.. ఇది హైలెవెల్ జంప్.. అంటూ కామెంట్లు చేస్తున్నారు.


సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. ఓ పులి వేట కోసం వెతుకుతూ ఉంటుంది. అడవిలో అటూ, ఇటూ తిరుగుతున్న సమయంలో దానికి మధ్యలో ఓ వాగు అడ్డుగా వస్తుంది. వాగును చూడగానే కాసేపు ఒడ్డున ఆగి చూస్తుంది.


‘వెనక్కు వెళ్లే ప్రసక్తే లేదు.. ఎలాగైనా ఈ వాగును తడవకుండా దాటాల్సిందే’.. అని ఫిక్స్ అవుతుంది. ఆ వెంటనే గట్టు మీద నుంచి ఒక్క ఉదుటున గాల్లోకి లేస్తుంది. చూస్తుండగానే వాగు అవతలి గట్టు మీదకు ( tiger jumped the stream) అవలీలగా దూకేస్తుంది. ఆ సమయంలో అక్కడే ఉన్న వారు ఈ స్టంట్ చూసి షాక్ అయ్యారు.


కాగా, ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘ఈ పులి స్టంట్ మామూలుగా లేదుగా’.. అంటూ కొందరు, ‘ఇది హైలెవెల్ జంప్’.. అంటూ మరికొందరు, వివిధ రకాల ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 1600కి పైగా లైక్‌లు, 53 వేలకు పైగా వ్యూస్‌ను సొంతం చేసుకుంది.


ఇవి కూడా చదవండి..

పాకిస్తాన్ కాదు.. ఇది ట్యాంకిస్తాన్.. ట్రోలింగ్ మామూలుగా లేదుగా..

ఎక్కడ ఏది చేయకూడదో అదే చేశారుగా.. టాయిలెట్ కమోడ్‌ను ఎలా వాడుతున్నారో చూడండి..

మరిన్ని వైరల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Updated Date - Jun 07 , 2025 | 12:51 PM