Share News

Shocking Viral Video: పడుకోవాలని వెళ్లాడు.. తల దిండు కింద చూసి ఖంగుతిన్నాడు..

ABN , Publish Date - Jun 03 , 2025 | 08:11 AM

ఓ వ్యక్తి పడుకునేందుకు మంచం వద్దకు వెళ్లాడు. అయితే తీరా పడుకునే ముందు అతడికి సందేహం కలిగింది. చివరకు తల దిండు కింద చూసి షాక్ అయ్యాడు. ఈ వీడియో చూసిన నెటిజన్లు.. మంచంపై మృత్యువు అంటే ఇదేనేమో.. అంటూ కామెంట్లు చేస్తున్నారు..

Shocking Viral Video: పడుకోవాలని వెళ్లాడు.. తల దిండు కింద చూసి ఖంగుతిన్నాడు..

ఇంట్లో రోజూ వాడే వస్తువులే కదా అని నిర్లక్ష్యంగా ఉంటే ప్రాణాలు పోయే ప్రమాదం ఉంటుంది. రోజూ వాడే వస్తువులు ప్రాణాలు ఎలా తీస్తాయని మీకు సందేహం రావొచ్చు. అయితే తీక్షణంగా పరిశీలిస్తే తప్ప ఆ వస్తువుల వెనుక మృత్యువు పొంచి ఉందనే విషయం తెలీదు. ఇందుకు నిదర్శనంగా మన కళ్ల ముందు అనేక సంఘటనలు చోటు చేసుకుంటుంటాయి. ఇలాంటి వీడియోలు నెట్టింట తెగ చక్కర్లు కొడుతుంటాయి. తాజాగా, ఇలాంటి వీడియో ఒకటి నెట్టింట చక్కర్లు కొడుతోంది. ఓ వ్యక్తి పడుకునే ముందు మంచంపై చూడగా షాకింగ్ సీన్ కనిపించింది. ఈ వీడియో చూసిన నెటిజన్లు.. మంచంపై మృత్యువు.. అంటూ కామెంట్లు చేస్తున్నారు.


సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. ఓ వ్యక్తి పడుకునేందుకు మంచం వద్దకు వెళ్లాడు. అయితే తీరా పడుకునే ముందు అతడికి సందేహం కలిగింది. మంచంపై తల దిండు కింద ఏదో ఉన్నట్లు అనుమానం రావడంతో.. ఏముందో తెలుసుకునేందుకు దాన్ని పైకి తీశాడు.

కొండపై మహిళ విచిత్ర నిర్వాకం.. వీడియో చూస్తే అవాక్కవ్వాల్సిందే..


తీరా చూస్తే దాని కింద నాగుపాము బుసలు (Cobra under the pillow) కొడుతూ కనిపిచింది. తల దిండు తీయగానే పాము తల పైకి ఎత్తి కాటేయడానికి ప్రయత్నించింది. పామును చూడగానే అతను ఒక్కసారిగా షాక్ అయ్యాడు. సందేహం వచ్చింది కాబట్టి సరిపోయింది. అదే నిర్లక్ష్యంగా పడుకుని ఉంటే పెద్ద ప్రమాదం జరిగి ఉండేది.

రోడ్డుపై స్కేటింగ్ చేయాలని చూశాడు.. చివరకు గేదె చేసిన పనికి ఖంగుతిన్నాడు..


కాగా, ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. తల దిండు కింద రెస్ట్ తీసుకుంటున్న పాము.. అంటూ కొందరు, మంచంపై మృత్యువు అంటే ఇదేనేమో.. అంటూ మరికొందరు, వివిధ రకాల ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు.

అవేమన్నా కుక్క పిల్లలు అనుకున్నావా.. ఇతను ఏం చేస్తున్నాడో చూడండి..


ఇవి కూడా చదవండి..

ఈ ఇంజినీర్‌కు చేతులెత్తి మొక్కాల్సిందే.. టాయిలెట్‌ను ఎక్కడ కట్టాడో చూడండి..

కారు టైరుతో కూలర్ తయారీ.. ఎలా సెట్ చేశాడో చూస్తే అవాక్కవుతారు..

మరిన్ని వైరల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Updated Date - Jun 03 , 2025 | 08:12 AM