Share News

Watch Video: వర్షపు నీటిలో రోడ్డు దాటుతున్నారా.. ఈ వీడియో చూస్తే ఆలోచనలో పడతారు..

ABN , Publish Date - May 31 , 2025 | 02:00 PM

భారీ వర్షాల కారణంగా ఓ రోడ్డును వరద నీరు ముంచెత్తింది. అయితే రోడ్డు దాటే సమయంలో పాదచారులకు షాకింగ్ సీన్ కనిపించింది. వరద నీటిలో రోడ్డు దాటే ముందు జాగ్రత్తగా ఉండాలన్న విషయాన్ని గుర్తు చేస్తున్న ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.

Watch Video: వర్షపు నీటిలో రోడ్డు దాటుతున్నారా.. ఈ వీడియో చూస్తే ఆలోచనలో పడతారు..

వర్షాకాలంలో పరిస్థితి ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ప్రధానంగా రోడ్లపై నీళ్లు నిల్వ చేరడం వల్ల అనేక ఇబ్బందులు పడాల్సి వస్తుంటుంది. ఏమాత్రం అజాగ్రత్తగా ఉన్నా కూడా మ్యాన్‌హోళ్లలో పడిపోయే ప్రమాదం ఉంటుంది. అలాగే విద్యుత్ స్తంభాలకు కరెంట్ షాక్ కొట్టే అవకాశం కూడా ఉంటుంది. అయితే కొన్నిసార్లు ఇంకొన్ని అనూహ్య ప్రమాదాలు కూడా పొంచి ఉండే ప్రమాదం ఉంటుంది. ఇందుకు నిదర్శనంగా మన కళ్ల ముందు అనేక సంఘటనలు చోటు చేసుకుంటుంటాయి. తాజాగా, ఇలాంటి ప్రమాదానికి సంబంధించిన వీడియో ఒకటి నెట్టింట చక్కర్లు కొడుతోంది. వర్షపు నీటిలో రోడ్డుపై కనిపించిన దృశ్యం చూసి అంతా షాక్ అవుతున్నారు.


సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. ఈ ఘటన ముంబైలో (Mumbai) చోటు చేసుకుంది. భారీ వర్షాల (Heavy Rains) కారణంగా మహారాష్ట్రలోని చాల ప్రాంతాల్లో వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. మరోవైపు రోడ్లపై వరద నీరు చేరడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇదిలావుండగా ముంబైలో చోటు చేసుకున్న షాకింగ్ ఘటనకు సంబంధించిన వీడియో ఒకటి తెగ వైరల్ అవుతోంది.

సింహమైనా డోంట్ కేర్.. ఈ తల్లి గేదె టాలెంట్ చూస్తే..


నవీ ముంబైలోని ఓ ప్రాంతంలో రోడ్డుపై వరద నీరు వచ్చి చేరింది. అయితే రోడ్డు దాటుతున్న స్థానికులకు షాకింగ్ దృశ్యం కనిపించింది. రోడ్డు పక్కన ఫుట్‌పాత్‌‌ వద్ద ఓ కొండ చిలువ తల పైకి పెట్టి పడుకుంది. కొండచిలువను (Python) చూడగానే అక్కడున్న వారంతా షాక్ అయ్యారు. ఆ కొండ చిలువ చాలా సేపు అక్కడే అలా కదలకుండా ఉండిపోయింది.

రైలుకు వేలాడుతూ యువతి భయంకర విన్యాసం.. చివరకు ఏమైందో చూడండి..


అయితే ఎవరికీ ఎలాంటి ప్రమాదం జరక్కపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. కొందరు ఈ ఘటనను వీడియో తీసి, సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘వామ్మో ఈ సీన్ చూస్తుంటనే వరద నీటిలో నవాలంటేనే భయమేస్తోంది’.. అంటూ కొందరు, ‘ఇలాంటి సమయాల్లో ఎంతో జాగ్రత్తగా ఉండాలి’.. అంటూ మరికొందరు, వివిధ రకాల ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం లక్షకు పైగా లైక్‌‌లు, 5.1 మిలియన్లకు పైగా వ్యూస్‌ను సొంతం చేసుకుంది.

తాళి కట్టే ముందు వింత ఘటన.. వధువు అనుమతి తీసుకుని మరీ..


ఇవి కూడా చదవండి..

ఈ ఇంజినీర్‌కు చేతులెత్తి మొక్కాల్సిందే.. టాయిలెట్‌ను ఎక్కడ కట్టాడో చూడండి..

కారు టైరుతో కూలర్ తయారీ.. ఎలా సెట్ చేశాడో చూస్తే అవాక్కవుతారు..

మరిన్ని వైరల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Updated Date - May 31 , 2025 | 02:00 PM