Share News

Swimming Viral Video: స్విమ్మింగ్ ‌ఫూల్‌లో డెత్ గేమ్.. చూస్తే షాకవ్వాల్సిందే..

ABN , Publish Date - May 28 , 2025 | 03:57 PM

చాలా మంది స్విమ్మింగ్ ఫూల్‌లో ఈత కొడుతుంటారు. అలాగే మరికొందరు ఎత్తైన ప్రదేశం నుంచి స్విమ్మింగ్ ‌ఫూల్‌లోకి జారుడు బల్లపై జారుకుంటూ వస్తుంటారు. అయితే ఈ సందర్భంగా యువకులు ఆడిన డెత్ గేమ్ చూసి అంతా షాక్ అవుతున్నారు.

Swimming Viral Video: స్విమ్మింగ్ ‌ఫూల్‌లో డెత్ గేమ్.. చూస్తే షాకవ్వాల్సిందే..

ప్రస్తుత సోషల్ మీడియా యుగంలో ఫేమస్ అవ్వాలని కొందరు, ప్రత్యేకంగా కనిపించాలని మరికొందరు, అందరి ముందూ హీరోలా బిల్డప్ ఇస్తూ ఇంకొందరు ప్రాణాంతక విన్యాసాలు చేయడం చూస్తున్నాం. కొందరైతే ప్రాణాలు పోతాయని తెలిసినా ప్రమాదకర ఆటలు ఆడుతూ అందరికీ షాక్ ఇస్తుంటారు. ఇలాంటి షాకింగ్ ఘటనకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. తాజాగా, ఇలాంటి వీడియో ఒకటి నెట్టింట చక్కర్లు కొడుతోంది. స్విమ్మింగ్ ఫూల్‌లో కొందరు ఆడిన ఆట చూసి అంతా అవాక్కవుతున్నారు. ఈ వీడియో చూసిన వారంతా.. ‘‘స్విమ్మింగ్ ‌ఫూల్‌లో డెత్ గేమ్’’.. అంటూ కామెంట్లు చేస్తున్నారు.


సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. చాలా మంది స్విమ్మింగ్ ఫూల్‌లో (Swimming Fool) ఈత కొడుతుంటారు. అలాగే మరికొందరు ఎత్తైన ప్రదేశం నుంచి స్విమ్మింగ్ ‌ఫూల్‌లోకి జారుడు బల్లపై జారుకుంటూ వస్తుంటారు. చాలా ఎత్తుగా ఉండడంతో అత్యంత వేగంగా జారుకుంటూ వచ్చి నీళ్లలో పడిపోతుంటారు. ఇంతవరకూ అంతా బాగానే ఉన్నా ఇక్కడే షాకింగ్ ఘటన చోటు చేసుకుంది.

అయ్యో.. ఈ కెమెరామెన్‌కు పెద్ద కష్టమే వచ్చిందే.. వధువును వీడియో తీస్తూ..


జారుడు బల్ల అంచున నిలబడ్డ కొందరు యువకులు.. పైనుంచి జారుకుంటూ వస్తున్న వారితో డెత్ గేమ్ స్టార్ట్ చేశారు. జారుడు బల్ల వద్ద నిలబడిన వారు.. పైనుంచి జారుకుంటూ వస్తున్న వారు తమకు తాకకుండా తప్పించుకోవాలి. ఇది చెప్పడానికి బాగున్నా.. అసలు గేమ్ స్టార్ట్ అవగానే చూసేవారికి కూడా గుండెలు గుబేల్‌మన్నాయి. జెట్ స్పీడుతో దూసుకొచ్చని వారి నుంచి రెప్పపాటు కాలంలో కిందకు వంగి తప్పించుకున్నారు. ఇలా చాలా సేపు వారు ఆ ప్రమాదకర గేమ్ ఆడుతూనే ఉన్నారు.

కారు టైరుతో కూలర్ తయారీ.. ఎలా సెట్ చేశాడో చూస్తే అవాక్కవుతారు..


ఒకవేళ ఆ సమయంలో వారు ఒకరినొకరు ఢీకొని ఉంటే ప్రాణాలు పోయేంత ప్రమాదం ఉండేది. కాగా, ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘వార్నీ.. ఇదేం గేమ్‌రా బాబోయ్.. చూస్తుంటేనే ప్రాణం పోతోంది’’.. అంటూ కొందరు, ‘‘ఇలాంటి ప్రమాదకర ఆటలు ఆడడం చాలా ప్రమాదం’’.. అంటూ మరికొందరు, వివిధ రకాల ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 2400కి పైగా లైక్‌లు, 5 లక్షలకు పైగా వ్యూస్‌ను సొంతం చేసుకుంది.

ఈ ఇంజినీర్‌కు చేతులెత్తి మొక్కాల్సిందే.. టాయిలెట్‌ను ఎక్కడ కట్టాడో చూడండి..


ఇవి కూడా చదవండి..

ఈ ఇంజినీర్‌కు చేతులెత్తి మొక్కాల్సిందే.. టాయిలెట్‌ను ఎక్కడ కట్టాడో చూడండి..

కారు టైరుతో కూలర్ తయారీ.. ఎలా సెట్ చేశాడో చూస్తే అవాక్కవుతారు..

మరిన్ని వైరల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Updated Date - May 28 , 2025 | 03:58 PM