Share News

Marriage Funny Video: అయ్యో.. ఈ కెమెరామెన్‌కు పెద్ద కష్టమే వచ్చిందే.. వధువును వీడియో తీస్తూ..

ABN , Publish Date - May 27 , 2025 | 08:32 PM

ఓ వివాహ కార్యక్రమంలో సడన్‌గా జరిగిన షాకింగ్ ఘటన చూసి అంతా తెగ నవ్వుకుంటున్నారు. అందంగా ముస్తాబైన వధువు .. పెళ్లి మంటపంలోకి నడుస్తూ వస్తుంటుంది. అదే సమయంలో ఆ ఘట్టాన్ని కెమెరామెన్ వీడియో తీస్తుంటాడు. ఇంతలో చివరకు ఎవరూ ఊహించని ఘటన చోటు చేసుకుంటుంది..

Marriage Funny Video: అయ్యో.. ఈ కెమెరామెన్‌కు పెద్ద కష్టమే వచ్చిందే.. వధువును వీడియో తీస్తూ..

ప్రస్తుతం జరిగే పెళ్లిళ్లు సినిమాలకు తీసిపోని విధంగా ఉన్నాయనడంలో ఎలాంటి సందేహం లేదు. ఫొటో షూట్స్ పేరుతో వధూవరులకు సినిమా తరహా స్టిల్స్ తీయడం, డాన్స్ చేయించడం, పెళ్లి మంటంపంలోకి వినూత్నంగా ఎంట్రీ ఇవ్వడం.. ఇలా ప్రతి ఘట్టాన్నీ ఎంతో అందంగా , వినూత్నంగా ఉండేలా చిత్రీకరిస్తున్నారు. ఈ క్రమంలో కొందరు కెమెరామెన్‌లు చిత్రవిచిత్రంగా వీడియోలు తీయడం కూడా చూస్తుంటాం. అయితే ఇలాంటి సమయాల్లో కొన్నిసార్లు అనుకోని సంఘటనలు చోటు చేసుకుంటుంటాయి. తాజాగా, ఇలాంటి సంఘటనకు సంబంధించిన వీడియో ఒకటి నెట్టింట చక్కర్లు కొడుతోంది. ఈ వీడియో చూసిన వారంతా.. అయ్యో.. ఈ కెమెరామెన్‌కు పెద్ద కష్టమే వచ్చిందిగా.. అంటూ కామెంట్లు చేస్తున్నారు.


సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. ఓ వివాహ (Marriage) కార్యక్రమంలో సడన్‌గా జరిగిన షాకింగ్ ఘటన చూసి అంతా తెగ నవ్వుకుంటున్నారు. అందంగా ముస్తాబైన వధువు (Bride) .. పెళ్లి మంటపంలోకి నడుస్తూ వస్తుంటుంది. ఆ సమయంలో ఆమె చుట్టూ నిలబడ్డ వారు రంగు రంగుల దుపట్టాను వధువుకు నీడగా పట్టుకుని వస్తుంటారు.

ఈ మేక తెలివి మామూలుగా లేదుగా.. ఎలా తప్పించుకుందో చూడండి..


ఈ ఘట్టాన్ని కెమెరామెన్ వినూత్నంగా చిత్రీకరించాలనే ఉద్దేశంతో వెనక్కు నడుస్తూ వీడియో తీస్తుంటాడు. ఇంతవరకూ అంతా బాగానే ఉంది కానీ.. ఇక్కడే ఓ తమాషా సంఘటన చోటు చేసుకుంది. వెనక్కు నడుస్తూ వీడియో తీస్తున్న కెమెరామెన్.. తన వెనుక ఏముందన్న విషయం కూడా మర్చిపోయాడు. అలా వెనక్కు వెళ్తూ వీడియో తీస్తుండగా.. కాళ్లకు డస్ట్ బిన్ తగులుకుని (Cameraman Falls While Shooting Bride) ధబేల్‌మని కిందపడిపోయాడు. ఈ ఘటనతో వధువుతో పాటూ అక్కడున్న వారంతా ఒక్కసారిగా షాక్ అయ్యారు. ఆ వెంటనే తేరుకుని పగలబడి నవ్వుకున్నారు.

కారు టైరుతో కూలర్ తయారీ.. ఎలా సెట్ చేశాడో చూస్తే అవాక్కవుతారు..


ఈ ఘటనను మొత్తం అక్కడే ఉన్న వారు వీడియో తీసి, సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘ఈ కెమెరామెన్‌కు పెద్ద కష్టం వచ్చిందే’.. అంటూ కొందరు, ‘కెమెరామెన్ తొలిసారి తడబడ్డాడు’.. అంటూ మరికొందరు, ఫన్నీ ఫన్నీ ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 6.4 మిలియన్లకు పైగా వ్యూస్‌ను సొంతం చేసుకుంది.

ఈ ఇంజినీర్‌కు చేతులెత్తి మొక్కాల్సిందే.. టాయిలెట్‌ను ఎక్కడ కట్టాడో చూడండి..


ఇవి కూడా చదవండి..

ఈ ఇంజినీర్‌కు చేతులెత్తి మొక్కాల్సిందే.. టాయిలెట్‌ను ఎక్కడ కట్టాడో చూడండి..

కారు టైరుతో కూలర్ తయారీ.. ఎలా సెట్ చేశాడో చూస్తే అవాక్కవుతారు..

మరిన్ని వైరల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Updated Date - May 27 , 2025 | 08:32 PM