Daughter caught by mother: ప్రియుడితో ఫోన్లో మాట్లాడుతున్న కూతురు.. సడన్‌గా లోపలికి వచ్చిన తల్లి.. చివరకు..
ABN , Publish Date - May 21 , 2025 | 08:32 PM
ఓ యువతి తన ఇంట్లో తల్లిదండ్రులకు తెలీకుండా ప్రియుడితో సీక్రెట్‌గా ఫోన్లో మాట్లాడుతూ ఉంటుంది. ఇలా మాట్లాడుతుండగా.. సడన్‌గా ఆమె తల్లి లోపలికి వస్తుంది. చివరకు ఏం జరిగిందో మీరే చూడండి..

ప్రేమికులకు సంబంధించిన అనేక వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంటాయి. బహిరంగ ప్రదేశాల్లో కొందరు అసభ్యకరంగా ప్రవర్తించడం చూస్తుంటాం. మరికొందరు ఇంట్లో దొంగచాటుగా కలుస్తూ చివరకు పెద్దవారికి దొరికిపోతుంటారు. ఇలాంటి షాకింగ్ ఘటనలకు సంబంధించిన వీడియోలను నిత్యం చూస్తుంటాం. ఇలాంటి వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. తాజాగా, ఇలాంటి వీడియో ఒకటి నెట్టింట చక్కర్లు కొడుతోంది. ఓ యువతి ఇంట్లో సీక్రెట్‌గా ప్రియుడితో ఫోన్లో మాట్లాడుతూ ఉంటుంది. ఇంతలో సడన్‌గా ఆమె తల్లి ఎంట్రీ ఇస్తుంది. చివరకు ఏం జరిగిందో మీరే చూడండి..
సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. ఓ యువతి తన ఇంట్లో తల్లిదండ్రులకు తెలీకుండా (young woman talking on phone with her boyfriend) ప్రియుడితో సీక్రెట్‌గా ఫోన్లో మాట్లాడుతూ ఉంటుంది. ఇలా మాట్లాడుతుండగా.. సడన్‌గా ఆమె తల్లి లోపలికి వస్తుంది. తల్లిని చూడగానే ఆ యువతి ఒక్కసారిగా షాక్ అవుతుంది.
Marriage Funny Video: అరెరే.. అనవసరంగా వరుడికి తిక్క రేపాడుగా.. సడన్‌గా బుగ్గ గిల్లేయడంతో.. చివరకు..
వచ్చీరాగానే కూతురు చేయి పట్టుకున్న తల్లి.. (Daughter caught by mother) ఫోన్లో స్పీకర్ ఆన్ చేయమని చెబుతుంది. భయపడుతూనే స్పీకర్ ఆన్ చేయడంతో అవతలి వైపు నుంచి ప్రియుడు వాయిస్ వినపడుతుంది. ‘‘అన్నం తిన్నావా’’.. అని అవతలి వైపు నుంచి అతను అనడంతో తల్లికి కోపం కట్టలు తెంచుకుంటుంది. ‘‘లేదురా.. నువ్వు వచ్చి తినిపించు’’.. అని ఆగ్రహం వ్యక్తం చేస్తుంది.
ప్రియురాలి తల్లి వాయిస్ వినగానే అతను ఒక్కసారిగా సైలెంట్ అయిపోతాడు. ఆ తర్వాత ఆమె తన కూతురిని చేత్తో పదే పదే కొడుతూ ఆగ్రహం వ్యక్తం చేస్తుంది. ‘‘25 ఏళ్ల వయసులో మా అమ్మ కూడా ఇలాగే నన్ను పట్టుకుంది’’.. అంటూ ఓ వ్యక్తి స్పందించగా.. ‘‘ఆ వ్యక్తి ఇంకోసారి కాల్ చేయలేడేమో’’.. అంటూ మరొకరు కామెంట్ చేశారు. అలాగే చాలా మంది వివిధ రకాల ఎమోజీలతో కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 4,700కి పైగా లైక్‌లు, 3.60 లక్షలకు పైగా వ్యూస్‌ను సొంతం చేసుకుంది.
ఇవి కూడా చదవండి..
Viral Video: వీళ్ల తెలివి తగలెయ్య.. ఎయిర్‌పాడ్స్‌ను ఎలా వాడుతున్నారో చూస్తే.. కళ్లు తేలేస్తారు..
Python VS Leopard: పులిని మింగాలని చూసిన కొండచిలువ.. చివరికి జరిగింది చూస్తే అవాక్కవ్వాల్సిందే..