Snake Bite Video: దుప్పటి కప్పుకొని పడుకున్న వ్యక్తి.. లోపలికి దూరిన కింగ్ కోబ్రా.. కాటేయడంతో చివరకు..
ABN , Publish Date - May 21 , 2025 | 04:25 PM
ఓ వ్యక్తి మంచంపై దుప్పటి కప్పుకొని పడుకుని ఉండగా.. వేకువజాము కింగ్ కోబ్రా మంచం పైకి ఎక్కేస్తుంది.

పాములతో కొందరు పిచ్చి పిచ్చి ఆటలు ఆడుతూ ప్రమాదాలను కొని తెచ్చుకుంటుంటారు. మరికొందరు తమ తప్పు లేకున్నా పొరపాటున పాము కాటుకు గురవుతుంటారు. ఇలాంటి సమయాల్లో కొందరు చివరి నిముషంలో అదృష్టవశాత్తు ప్రాణాలతో బయటపడుతుంటారు. అయితే మరికొందరు మాత్రం సరైన సమయానికి వైద్యం అందకపోవడం, నాటు వైద్యాన్ని ఆశ్రయించడం.. తదితర కారణాలతో ప్రాణాలు కోల్పోతుంటారు. ఇలాంటి విషాద ఘటనలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. తాజాగా, ఇలాంటి వీడియో ఒకటి సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఓ వ్యక్తి మంచంపై దుప్పటి కప్పుకొని పడుకుని ఉండగా.. వేకువజాము కింగ్ కోబ్రా మంచం పైకి ఎక్కేస్తుంది. ఈ క్రమంలో అతన్ని కాటేయడంతో చివరకు ఏం జరిగిందో చూడండి..
సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. ఉత్తరప్రదేశ్ (Uttar Pradesh) బాగ్పత్ ఛప్రౌలి పరిధి లంబ్ గ్రామంలో ఈ ఘటన చోటు చేసుకుంది. స్థానిక ప్రాంతానికి చెందిన మనోజ్ (17) అనే బాలుడు.. ఇదే ప్రాంతంలోని ఓ హోటల్లో వంట మనిషిగా పని చేస్తున్నాడు. ఇతను హోటల్ పని చేస్తూ రాత్రి కూడా అక్కడే పడుకునేవాడు. అయితే ఈ క్రమంలో శుక్రవారం రాత్రి విషాద ఘటన చోటు చేసుకుంది. రోజూ లాగే ఆ రోజు కూడా పని ముగించుకున్న మనోజ్.. రాత్రి హోటల్లోని ఓ గదిలో నిద్రపోయాడు.
Funny Viral Video: ఆశీర్వదించకుండా అతి చేస్తే ఇలాగే అవుతుంది.. ఈ వధువు ఏం చేసిందో చూడండి..
అయితే వేకువ జాము 3.30 గంటల సమయంలో కింగ్ కోబ్రా పాము ఆ గదిలోకి వెళ్లింది. నేరుగా అతడి మంచంపైకి వెళ్లిన పాము.. చివరకు మనోజ్‌పైకి ఎక్కేసింది. ఆ సమయంలో మనోజ్ దుప్పటి కప్పుకొని నిద్రపోతున్నాడు. అయితే మనోజ్ నిద్రలో అటూ, ఇటూ కదలడంతో (King cobra bites sleeping youth) పాము అతన్ని కాటేసింది. రెండో సారి అతడి చేతిపై కాటేసింది. దీంతో మెలకువ వచ్చి పైకి లేచి చూశాడు తన దుప్పట్లో పాము దూరడం చూసి భయంతో మంచం దిగి దూరంగా పరుగెత్తాడు. అయితే అప్పటికే పాము అతన్ని రెండు సార్లు కాటేయడంతో పరిస్థితి విషమిస్తూ వచ్చింది. తర్వాత తన యజమానికి ఫోన్ చేసి, సమాచారం అందించాడు. అక్కడికి చేరుకున్న యజమాని అతన్ని చికిత్స నిమిత్తం కీర్తల్ అనే గ్రామంలో ఉన్న వైద్యుడి వద్దకు తీసుకెళ్లాడు.
Woman Funny Video: ఇలాంటి ప్రయోగాలు మహిళలకే సాధ్యమేమో.. ఉల్లిపాయలను ఎలా కట్ చేస్తుందో చూస్తే..
అయితే అప్పటికే అతడి పరిస్థితి విషమించంతో చికిత్స పొందుతూ మృతి చెందాడు. మనోజ్ మృతితో గ్రామంలో విషాదచాయలు అలుముకున్నాయి. మనోజ్ ఇద్దరు సోదరుల్లో చిన్నవాడు. ఇతడి అన్న అనుజ్ కూడా కూలీగా పని చేసేవాడు. అయితే సుమారు 15 ఏళ్ల క్రితం మరణించాడు. కాగా, మనోజ్ మంచంపైకి పాము వచ్చిన ఘటన మొత్తం అక్కడే ఉన్న సీసీ కెమెరాలో రికార్డ్ అయింది. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘అయ్యో.. ఎంత ఘోరం జరిగింది’’.. అంటూ కొందరు, ‘‘ఇలా జరగడం చాలా బాధాకరం’’.. అంటూ మరికొందరు, వివిధ రకాల ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు.
Viral Video: నిప్పు లేకుండానే టీ చేసేశారు.. వీళ్ల ప్రయోగం చూస్తే అవాక్కవుతారు..
ఇవి కూడా చదవండి..
Viral Video: వీళ్ల తెలివి తగలెయ్య.. ఎయిర్‌పాడ్స్‌ను ఎలా వాడుతున్నారో చూస్తే.. కళ్లు తేలేస్తారు..
Python VS Leopard: పులిని మింగాలని చూసిన కొండచిలువ.. చివరికి జరిగింది చూస్తే అవాక్కవ్వాల్సిందే..
Monkey Funny Video: కొమ్మ చివరన కోతి.. పండు ఎలా కోసిందో చూస్తే..