Share News

Watch video: ప్యారిస్ మెట్రోలో యువతి.. లెహంగాలో ఆమె అందానికి అంతా ఫిదా..

ABN , Publish Date - May 20 , 2025 | 08:09 PM

మన దేశానికి సంబంధించిన ఎంతో మంది యువతీయువకులు విదేశాల్లో సాంప్రదాయ దుస్తుల ధరించడం తరచూ చూస్తుంటాం. ఇలాంటి సంఘటలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. తాజాగా, ఓ యువతి లెహంగా ధరించి ప్యారిస్ మెట్రోలో ప్రయాణించిన వీడియో తెగ చక్కర్లు కొడుతోంది..

Watch video: ప్యారిస్ మెట్రోలో యువతి.. లెహంగాలో ఆమె అందానికి అంతా ఫిదా..

మన సంస్కృతి సంప్రదాయాలు.. మన దేశం దాటి ప్రపంచాన్ని చుట్టేస్తున్నాయనడంలో ఎలాంటి సందేహం లేదు. విదేశీయులు సైతం మన వస్త్రధారణను ఇష్టపడుతున్నారు. ఎంతో మంది విదేశీ మహిళలు చీరలు ధరించడం చూస్తున్నాం. అలాగే మన దేశానికి సంబంధించిన ఎంతో మంది యువతీయువకులు విదేశాల్లో సాంప్రదాయ దుస్తుల ధరించడం తరచూ చూస్తుంటాం. ఇలాంటి సంఘటలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. తాజాగా, ఓ యువతి లెహంగా ధరించి ప్యారిస్ మెట్రోలో ప్రయాణించిన వీడియో తెగ చక్కర్లు కొడుతోంది. ఈ వీడియో చూసిన నెటిజన్లు.. ఆమె అందానికి ఫిదా అవుతున్నారు..


నివ్య అనే యువతి.. భారతీయ సాంప్రదాయాలను గుర్తు చేస్తూ ప్యారిస్‌లో వీడియోలు తీస్తుంటుంది. తాజాగా, ఈమె అందమైన లెహెంగా ధరించి (young woman wearing lehenga) చేసిన వీడియో (Viral Video) సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఆరెంట్, గోల్డ్ కలర్‌‌ ఎంబ్రాయిడరీతో కూడిన అందమైన లెహంగా ధరించిన నివ్య.. ప్యారిస్ లోకల్ రైల్లో ప్రయాణించింది. అందంగా ముస్తాబైన ఆమె.. స్టేషన్‌లోకి ఎంతో హుందాగా అడుగుపెట్టింది.

Optical illusion: ఈ చిత్రంలో దాక్కున్న మహిళను.. 10 సెకన్లలో పసిగట్టారంటే.. మీది డేగ చూపే..


ఎంట్రీ దగ్గర నుంచి రైల్లోకి వెళ్లే వరకూ ఆమె నడక, వ్యవహార శైలి అక్కడున్న వారందరినీ కట్టిపడేసింది. రైలు (Paris Metro Train) ఎక్కిన తర్వాత కళ్లద్దాలను ధరించి, మరింత అందంగా కనిపించింది. రైల్లో ఉన్న వారు కూడా ఈమెను అలాగే చూస్తుండిపోయారు. లెహంగాతో పాటూ ఒంటిపై వివిధ రకాల ఆభరణాలు ధరించి, అచ్చమైన తెలుగమ్మాయిలా కనిపించింది. కాగా, ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.

Snake Funny Video: వైన్ షాపులోకి దూరిన పాము.. తరిమికొట్టాలని చూడగా.. ఎలా భయపెట్టిందంటే..


ఈమె అందానికి ప్యారిస్ ప్రజలతో పాటూ నెటిజన్లు కూడా ఫిదా అవుతున్నారు. ఈ వీడియో చూసిన వారంతా షాకింగ్ కామెంట్లు చేస్తున్నారు. ‘‘ప్యారిస్‌ ప్రజలకు భారతీయ సాంప్రదాయాలను గుర్తు చేయడం ఎంతో గ్రేట్’’.. అంటూ కొందరు, ‘‘సాంప్రదాయ వస్త్రధారణలో మెరిసిపోతున్న యువతి’’.. అంటూ మరికొందరు, వివిధ రకాల ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 1400కి పైగా లైక్‌లు, 54 వేలకు పైగా వ్యూస్‌‌ను సొంతం చేసుకుంది.

Woman Funny Video: ఇలాంటి ప్రయోగాలు మహిళలకే సాధ్యమేమో.. ఉల్లిపాయలను ఎలా కట్ చేస్తుందో చూస్తే..


ఇవి కూడా చదవండి..

Viral Video: వీళ్ల తెలివి తగలెయ్య.. ఎయిర్‌పాడ్స్‌ను ఎలా వాడుతున్నారో చూస్తే.. కళ్లు తేలేస్తారు..

Python VS Leopard: పులిని మింగాలని చూసిన కొండచిలువ.. చివరికి జరిగింది చూస్తే అవాక్కవ్వాల్సిందే..

Monkey Funny Video: కొమ్మ చివరన కోతి.. పండు ఎలా కోసిందో చూస్తే..

మరిన్ని వైరల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Updated Date - May 20 , 2025 | 08:09 PM