Train Accident Video: రన్నింగ్ రైలు ఎక్కుతున్న వృద్ధుడు.. యువకుడిని పట్టుకోవడంతో.. చివరకు..
ABN , Publish Date - May 18 , 2025 | 12:57 PM
ఓ వృద్దుడు రైలు ఎక్కేందుకు స్టేషన్‌కు వస్తాడు. అయితే అప్పటికే రైలు కదులుతుంటుంది. అయినా అతను రైలు ఎక్కేందుకు ప్రయత్నిస్తాడు. అయితే చివరకు షాకింగ్ ఘటన చోటు చేసుకుంటుంది..

రైలు ప్రయాణ సమయాల్లో చాలా మంది నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ చివరికి ప్రాణాల మీదకు తెచ్చుకుంటుంటారు. కొందరు సోషల్ మీడియాలో ఫేమస్ అవ్వాలనే ఉద్దేశంతో వివిధ రకాల విన్యాసాలు చేస్తుంటే.. మరికొందరు త్వరగా గమ్యస్థానం చేరాలనే తొందరలో ప్రమాదాల్లో చిక్కుకుంటుంటారు. ఇలాంటి షాకింగ్ ఘటనలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. తాజాగా, ఇలాంటి వీడియో ఒకటి నెట్టింట చక్కర్లు కొడుతోంది. ఓ వృద్ధుడు రన్నింగ్ రైలు ఎక్కుతూ చివరకు యువకుడిని పట్టుకున్నాడు. చివరకు ఏం జరిగిందో చూడండి..
సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. ఈ ఘటన కర్నాటకలో (Karnataka) జరిగినట్లు తెలుస్తోంది. ఓ వృద్దుడు రైలు ఎక్కేందుకు స్టేషన్‌కు వస్తాడు. అయితే అప్పటికే రైలు కదులుతుంటుంది. అయినా అతను రైలు ఎక్కేందుకు ప్రయత్నిస్తాడు. పరుగెత్తుకుంటూ వెళ్లి జనరల్ బోగీ డోరు పట్టుకుని నిలబడతాడు. అప్పటికే అక్కడ కొంతమంది నిలబడి ఉంటారు.
Innovative Fan Viral Video: ఇంట్లో, బయటా కూల్ కూల్.. ఇలాంటి ఫ్యాన్ ఎక్కడా ఉండదేమో..
ఈ క్రమంలో ఆ వృద్ధుడు బ్యాలెన్స్ తప్పి.. అక్కడున్న యువకుడిని పట్టుకుంటాడు. దీంతో ఇద్దరూ అదుపు తప్పి (young man and an old man fell while boarding train) ఒక్కసారిగా కిందపడిపోతారు. వారు కిందపడడం చూసిన వారంతా పరుగెత్తుకుంటూ వచ్చి పక్కకు లాగేస్తారు. దీంతో వారు ఎలాంటి గాయాలూ కాకుండా క్షేమంగా బయటపడతారు. కాగా, ఈ ఘటన మొత్తం అక్కడే ఉన్న వారు వీడియో తీసి, సోషల్ మీడియాలో షేర్ చేశారు.
Theft Viral Video: వామ్మో.. ఎంతకు తెగించారు.. బస్సులో వీళ్లు చేసిన చోరీ చూస్తే..
ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ఈ పెద్దాయన ఎంత పని చేశాడు.. అంటూ కొందరు, ఇలాంటి పనులు చేయడం వల్ల తాము ప్రమాదంలో పడడమే కాకుండా ఎదుటివారు కూడా ప్రమాదంలో పడతారు .. అంటూ మరికొందరు, వివిధ రకాల ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం లక్షకు పైగా లైక్‌లు, 15.3 మిలియన్లకు పైగా వ్యూస్‌ను సొంతం చేసుకుంది.
Tap Viral Video: ఈ కుళాయిని ఆన్ చేయాలంటే.. ఆలోచించాల్సిందే.. భలే సెట్ చేశాడుగా..
ఇవి కూడా చదవండి..
Python VS Leopard: పులిని మింగాలని చూసిన కొండచిలువ.. చివరికి జరిగింది చూస్తే అవాక్కవ్వాల్సిందే..
Monkey Funny Video: కొమ్మ చివరన కోతి.. పండు ఎలా కోసిందో చూస్తే..
Food Funny Video: విందులో వింత నిర్వాకం.. ఈ అతిథులు చేసిన నిర్వాకం చూస్తే అవాక్కవ్వాల్సిందే..