Innovative Fan Viral Video: ఇంట్లో, బయటా కూల్ కూల్.. ఇలాంటి ఫ్యాన్ ఎక్కడా ఉండదేమో..
ABN , Publish Date - May 18 , 2025 | 09:30 AM
చిత్రవిచిత్ర నిర్మాణాలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. తాజాగా, ఇలాంటి వీడియో ఒకటి నెట్టింట చక్కర్లు కొడుతోంది. ఓ వ్యక్తి ఫ్యాన్‌ను సెట్ చేసిన విధానం చూసి అంతా అవాక్కవుతున్నారు. ఈ వీడియోను చూసిన వారంతా.. ఇంట్లో, బయటా కూల్ కూల్.. ఐడియా అదిరిందిగా.. అంటూ కామెంట్లు చేస్తున్నారు..

ఇంట్లోని ఫ్రిడ్జ్, కూలర్, ఫ్యాన్లను చిత్రవిచిత్ర పద్ధతిలో తయారు చేసే వారిని చూస్తుంటాం. కొందరు కూలర్లో కూరగాయలు స్టోర్ చేస్తే.. మరికొందరు కూలర్‌తో పని లేకుండా ఇంట్లోకి చల్లని గాలి వచ్చేలా సెట్ చేస్తుంటారు. అలాగే ఇంకొందరు ఏకంగా ఇటుకలతోనే కూలర్ తరహాలో నిర్మాణం చేస్తుంటారు. ఇలాంటి చిత్రవిచిత్ర నిర్మాణాలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. తాజాగా, ఇలాంటి వీడియో ఒకటి నెట్టింట చక్కర్లు కొడుతోంది. ఓ వ్యక్తి ఫ్యాన్‌ను సెట్ చేసిన విధానం చూసి అంతా అవాక్కవుతున్నారు. ఈ వీడియోను చూసిన వారంతా.. ఇంట్లో, బయటా కూల్ కూల్.. ఐడియా అదిరిందిగా.. అంటూ కామెంట్లు చేస్తున్నారు.
సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral video) తెగ వైరల్ అవుతోంది. ఓ వ్యక్తి తన ఇంటి వరండాలో ఫ్యాన్ ఏర్పాటు చేశాడు. ఇందులో ప్రత్యేకత ఏముందీ.. అని అనుకుంటున్నారా. ఇతను ఏర్పాటు చేసిన ఫ్యాన్ వల్ల ఇంటి వరండాతో పాటూ ఇంటి బయట కూడా చల్లని గాలి వీచేలా ఏర్పాట్లు చేశాడు.
Crocodile Viral Video: మొసలి బొమ్మ అనుకుని నీటిలోకి దిగాడు.. చివరకు గుండెలు ఆగిపోయే సీన్..
ఇందుకోసం.. వరండాలోని స్తంభానికి ఇనుప క్లాంప్లు, పొడవాటి రాడ్ ఏర్పాటు చేశాడు. దానికి చివర్లో ఫ్యాన్‌ను సెట్ చేసి, అది అటూ ఇటూ (Rotation Ceiling Fan) తిరిగేలా బిగించాడు. అక్కడున్న గేర్ వంటి రాడ్‌ను అటూ, ఇటూ తిప్పడం ద్వారా ఫ్యాన్‌ను ఇంటి వరండాలోకి, బయటికి తిరిగేలా చేయొచ్చన్నమాట.
Accident Viral Videos: వామ్మో.. ఒళ్లు గగుర్పొడిచే వీడియో.. ఇలాంటి తప్పు ఎప్పుడూ చేయకండి..
ఇలా ఒకే ఫ్యాన్‌ను ఇలా రెండు విధాలా ఉపయోగించేలా ఏర్పాట్లు చేసి అంతా అవాక్కయ్యేలా చేస్తున్నాడు. కాగా, ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఇలాంటి ఫ్యాన్‌ను ఎక్కడా చూడలేదు.. అంటూ కొందరు, ఎలా వస్తాయో ఇలాంటి ఐడియాలు.. అంటూ మరికొందరు, వివిధ రకాల ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 2 లక్షలకు పైగా లైక్‌లు, 16.2 మిలియన్లకు పైగా వ్యూస్‌ను సొంతం చేసుకుంది.
Tap Viral Video: ఈ కుళాయిని ఆన్ చేయాలంటే.. ఆలోచించాల్సిందే.. భలే సెట్ చేశాడుగా..
ఇవి కూడా చదవండి..
Python VS Leopard: పులిని మింగాలని చూసిన కొండచిలువ.. చివరికి జరిగింది చూస్తే అవాక్కవ్వాల్సిందే..
Monkey Funny Video: కొమ్మ చివరన కోతి.. పండు ఎలా కోసిందో చూస్తే..
Food Funny Video: విందులో వింత నిర్వాకం.. ఈ అతిథులు చేసిన నిర్వాకం చూస్తే అవాక్కవ్వాల్సిందే..