Elephant Sad Video: అయ్యో.. ఈ ఏనుగుకు ఎంత కష్టమొచ్చిందీ.. రోడ్డుపై ట్రక్కు వద్ద ఏం చేస్తుందో చూస్తే..
ABN , Publish Date - May 16 , 2025 | 01:59 PM
ఓ పిల్ల ఏనుగు అడవిలో మధ్యలోని రోడ్డుపైకి వచ్చింది. అయితే ఈ క్రమంలో ఓ ట్రక్కు ఢీకొని ఆ ఏనుగు అక్కడికక్కడే చనిపోయింది. ఆ తర్వాత అక్కడికి వచ్చిన తల్లి ఏనుగు తల్లిడిల్లిపోయింది. ఈ వీడియోను చూసిన నెటిజన్లు.. ‘‘అయ్యో.. ఈ ఏనుగు ఎంత కష్టమొచ్చిందీ’’.. అంటూ కామెంట్లు చేస్తున్నారు..

ఏనుగులు ఎంత శక్తివంతమైన జంతువులో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. అడవిలో వీటికి ఎదురుపడి ఏ జంతువూ ప్రాణాలతో తిరిగి వెళ్లదు. అందుకే దీన్ని చూడగానే పులులు, సింహాలు వంటి ప్రమాదకర జంతువులు కూడా భయంతో పారిపోతుంటాయి. ఇంతటి శక్తివంతమైన ఏనుగుల్లో కూడా మనుషుల్లాగే భావేద్వేగాలు దాగి ఉంటాయి. సందర్భాన్ని బట్టి వాటి ఫీలింగ్స్ బయటపడుతుంటాయి. తాజాగా, బాధపడుతున్న ఓ ఏనుగు వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఈ వీడియోను చూసిన వారంతా.. ‘‘అయ్యో పాపం.. ఈ ఏనుగు ఎంత కష్టమొచ్చిందీ’’.. అంటూ కామెంట్లు చేస్తున్నారు..
సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. మలేషియా (Malaysia) పెరాక్లోని గెరిక్-జెలి పరిధి రహదారిపై ఈ ఘటన చోటు చేసుకుంది. ఓ పిల్ల ఏనుగు అడవిలో మధ్యలోని రోడ్డుపైకి వచ్చింది. అయితే ఈ క్రమంలో ఓ ట్రక్కు ఢీకొని (Baby elephant dies after being hit by truck) ఆ ఏనుగు అక్కడికక్కడే చనిపోయింది.
Marriage Funny video: ఇదేం గిఫ్ట్రా బాబోయ్.. దెబ్బకు వధువు వణికిపోయిందిగా..
ఏనుగు కళేబరం ట్రక్కు కింద ఇరుక్కుపోవడంతో.. వాహనాన్ని రోడ్డుపైనే ఆపాల్సి వచ్చింది. అయితే ఇంతలో తల్లి ఏనుగు అక్కడికి వచ్చింది. తన పిల్ల లారీ కింద పడి చనిపోవడాన్ని చూసి తట్టుకోలేకపోయింది. ట్రక్కు పక్కనే నిలబడి, తలను దానిపై వాల్చి బాధపడుతూ ఉండిపోయింది. ఇలా చాలా సేపు ఆ ఏనుగు అలా బాధపడుతూనే ఉంది. ఇంతలో కొందరు అక్కడికి చేరుకుని ఏనుగుకు తాళ్లు కట్టి బలవంతంగా అక్కడి నుంచి తరలించారు.
Marriage Funny Video: టోపీపై టెక్నాలజీ అంటే ఇదేనేమో.. ఈ వరుడి ప్రయోగం చూస్తే.. ఖంగుతినాల్సిందే..
చివరకు ఆ ఏనుగు ఎంతో బాధపడుతూనే అక్కడి నుంచి వెళ్లిపోవాల్సి వస్తుంది. ఈ ఏనుగును చూసి అక్కడున్న వారంతా.. అయ్యో పాపం.. అంటూ ఆవేదన వ్యక్తం చేశారు. కాగా, ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘అయ్యో.. పాపం.. ఈ ఏనుగుకు ఎంత కష్టం వచ్చింది’’.. అంటూ కొందరు, ‘‘ఏనుగును చూస్తుంటే ఎంతో బాధగా ఉంది’’.. అంటూ మరికొందరు, బాధాకరమైన ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియోను ఇప్పటివరకూ 2.9 మిలియన్ల మందికి పైగా వీక్షించారు.
Monkey Attack Video: వామ్మో.. కుక్కల్లా మారిన కోతులు.. వృద్ధురాలిని చుట్టుముట్టి మరీ..
ఇవి కూడా చదవండి..
Python VS Leopard: పులిని మింగాలని చూసిన కొండచిలువ.. చివరికి జరిగింది చూస్తే అవాక్కవ్వాల్సిందే..
Monkey Funny Video: కొమ్మ చివరన కోతి.. పండు ఎలా కోసిందో చూస్తే..
Food Funny Video: విందులో వింత నిర్వాకం.. ఈ అతిథులు చేసిన నిర్వాకం చూస్తే అవాక్కవ్వాల్సిందే..