Viral Video: ఈ కూలర్ చాలా స్పెషల్ గురూ.. చల్లదనంతో పాటూ..
ABN , Publish Date - May 12 , 2025 | 12:23 PM
ఓ వ్యక్తి తన ఇంట్లోని కూలర్‌లో విచిత్రమైన ఏర్పాట్లు చేశాడు. సాధారణంగా కూలర్ నుంచి చల్లని గాలి మాత్రమే వస్తుంది. అయితే ఇతను కూలర్‌లో చేసిన ఏర్పాట్లు చూసి అంతా అవాక్కవుతన్నారు. ఈ వీడియోను చూసిన నెటిజన్లు.. ‘‘ఈ కూలర్ చాలా స్పెషల్ గురూ’’.. అంటూ కామెంట్లు చేస్తున్నారు..

విచిత్రమైన వస్తువులకు సంబంధించిన వీడియోలను సోషల్ మీడియాలో నిత్యం చూస్తుంటాం. చాలా మంది ఫ్రిజ్డ్‌లు, ఫ్యాన్లు, కూలర్లపై వింత వింత ప్రయోగాలు చేయడం చూస్తుంటాం. కొందరు టేబుల్ ఫ్యాన్‌తో ఏసీ గాలి వచ్చేలా చేస్తుంటే.. మరికొందరు ఫ్రిడ్జ్ ముందర కూలర్ పెట్టి చల్లగాలి వచ్చేలా చేస్తుంటారు. ఇంకొందరేమో ఏకంగా ఇటుకలతోనే కూలర్‌ను నిర్మించేస్తుంటారు. ఇలాంటి విచిత్ర సంఘటనలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. తాజాగా, ఇలాంటి వీడియో ఒకటి నెట్టింట చక్కర్లు కొడుతోంది. ఓ వ్యక్తి కూలర్‌లో చేసిన ఏర్పా్ట్లు చూసి అంతా అవాక్కవుతున్నారు. ఈ వీడియో చూసిన వారంతా.. ‘‘ఈ కూలర్ చాలా స్పెషల్ గురూ’’.. అంటూ కామెంట్లు చేస్తున్నారు..
సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. ఓ వ్యక్తి తన ఇంట్లోని కూలర్‌లో విచిత్రమైన ఏర్పాట్లు చేశాడు. సాధారణంగా కూలర్ నుంచి చల్లని గాలి మాత్రమే వస్తుంది. అయితే ఈ కూలర్‌లో చల్లని గాలితో పాటూ పాటలు కూడా వచ్చేలా ఏర్పాట్లు చేశాడు.
Funny Hand Pump Video: ఏంట్రా ఇదీ.. చేతిబోరును ఎలా సెట్ చేశాడో చూస్తే.. ఖంగుతింటారు..
కూలర్ ఆన్ చేయగానే కూలర్ పైన ఏర్పాటు చేసిన డిస్‌ప్లేలో (Music in the cooler) పాట వివరాలు వచ్చేలా సెట్ చేశాడు. దీంతో ఈ కూలర్ ఎదురుగా ఉన్న వారికి చల్లదనంతో పాటూ హాయిగా సంగీతం వినే అవకాశాన్ని కూడా కల్పించాడు. ఈ వినూత్నమైన కూరల్‌ను చూసి అంతా అవాక్కవుతున్నారు. ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది.
Stunt Viral Video: రైలు పట్టాలపై డేంజరస్ స్టంట్.. సజ్జన్నార్ ఏమన్నారంటే..
ఈ వీడియోపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘ఈ కూలర్ ఎదురుగా కూర్చుంటే హాయిగా నిద్ర వచ్చేస్తుందిగా’’.. అంటూ కొందరు, ‘‘ఎలా వస్తాయో ఇలాంటి ఐడియాలు’’.. అంటూ మరికొందరు, వివిధ రకాల ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 15 వేలకు పైగా లైక్‌లు, 4 లక్షలకు పైగా వ్యూస్‌ను సొంతం చేసుకుంది.
Marriage Funny Video: ఈ వరుడు చల్లగుండ.. ఊరేగింపులో ఎలా వస్తున్నాడో చూడండి..
ఇవి కూడా చదవండి..
Python VS Leopard: పులిని మింగాలని చూసిన కొండచిలువ.. చివరికి జరిగింది చూస్తే అవాక్కవ్వాల్సిందే..
Monkey Funny Video: కొమ్మ చివరన కోతి.. పండు ఎలా కోసిందో చూస్తే..
Food Funny Video: విందులో వింత నిర్వాకం.. ఈ అతిథులు చేసిన నిర్వాకం చూస్తే అవాక్కవ్వాల్సిందే..