Viral Video: చూడటానికే చేప.. దీని దంతాల పవర్ చూస్తే మతి పోవాల్సిందే..
ABN , Publish Date - May 11 , 2025 | 09:25 AM
ఎలా పట్టాడో ఏమో తెలీదు గానీ ఓ వ్యక్తి పెద్ద చేపను పట్టుకుంటాడు. ఓ చేతిలో చేపను పట్టుకున్న ఆ వ్యక్తి.. మరో చేతిలో కూల్ డ్రింక్ టిన్ బాటిల్‌ను పట్టుకుని ఉంటాడు. ఈ క్రమంలో చేప చేసిన పని చూసి అంతా షాక్ అవుతున్నారు..

చేపలకు సంబంధించిన అనేక వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంటాయి. చేపల వేటలో కొన్నిసార్లు షాకింగ్ ఘటనలు చోటు చేసుకోవడం చూస్తుంటాం. వలలో పడ్డాయనుకుంటున్న సమయంలో కొన్ని చేపలు తృటిలో తప్పించుకుంటుంటాయి. మరికొన్నిసార్లు వలలో ఉన్న చేపలు కూడా ఎగురుకుంటూ నీటిలోకి వెళ్లిపోతుంటాయి. అలాగే ఇంకొన్నిసార్లు తమ భయంకరమైన దంతాలతో అందరినీ భయపెట్టేస్తుంటాయి. తాజాగా, ఓ చేప ప్రవర్తన చూసి అంతా అవాక్కవుతున్నారు. ఈ వీడియో చూసిన నెటిజన్లు ‘‘ఈ చేప వెరీ షార్ప్ గురూ’’.. అంటూ కామెంట్లు చేస్తున్నారు..
సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. ఎలా పట్టాడో ఏమో తెలీదు గానీ ఓ వ్యక్తి పెద్ద చేపను పట్టుకుంటాడు. ఓ చేతిలో చేపను పట్టుకున్న ఆ వ్యక్తి.. మరో చేతిలో కూల్ డ్రింక్ టిన్ బాటిల్‌ను పట్టుకుని ఉంటాడు. ఈ క్రమంలో టిన్ బాటిల్‌ను చేపతో ఓపెన్ చేయాలని చూస్తాడు.
Woman Funny Video: ఫోన్ వాడడమే కాదు.. దాచడమూ తెలుసు.. ఈమె నిర్వాకం చూస్తే నోరెళ్లబెడతారు..
చేప నోటి ముందు టిన్ను పెట్టగానే.. ఒక్కసారిగా నోరు తెరచిన చేప.. (Fish bites cool drink tin bottle with its teeth) దాన్ని అమాంతం కొరికిపడేస్తుంది. ఆ చేప దంతాల దెబ్బకు టిన్ బాటిల్ తూట్లు పడి కూల్ డ్రింక్ బయటికి వస్తుంది. కూల్ డ్రింక్‌ను చేప ఓపెన్ చేసిన విధానం చూసిన అతను అవాక్కవుతాడు. ఆ వెంటనే తేరుకుని నవ్వుతూ ఆ డ్రింక్‌ను తాగేస్తాడు. ఆ తర్వాత ఆ చేపను మళ్లీ నీటిలో వదిలేస్తాడు.
Cat Funny Viral Video: ఈ పిల్లి ధైర్యం మామూలుగా లేదుగా.. యజమాని ఇంటికి ఏం తెచ్చిందో చూడండి..
కాగా, ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో ఓ వీడియో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివి రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘ఈ చేప దంతాలు వెరీ షార్ప్ గురూ’’.. అంటూ కొందరు, ‘‘ఈ చేపకు కూల్‌డ్రింక్ అంటే చాలా ఇష్టం అనుకుంటా’’.. అంటూ మరికొందరు, వివిధ రకాల ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం లక్షకు పైగా లైక్‌లు, 5.1 మిలియన్లకు పైగా వ్యూస్‌ను సొంతం చేసుకుంది.
Viral Video: తుపాకీతో భయపెట్టాలని చూడగా.. బైకర్ మాటల తూటాల దాటికి చివరకు..
ఇవి కూడా చదవండి..
Monkey Funny Video: కొమ్మ చివరన కోతి.. పండు ఎలా కోసిందో చూస్తే..
Food Funny Video: విందులో వింత నిర్వాకం.. ఈ అతిథులు చేసిన నిర్వాకం చూస్తే అవాక్కవ్వాల్సిందే..
Stunts Viral Video: చావు అంచుల దాకా వెళ్లడమంటే ఇదే.. వ్యూస్ కోసం వీళ్ల నిర్వాకం చూస్తే..