Cat Funny Viral Video: ఈ పిల్లి ధైర్యం మామూలుగా లేదుగా.. యజమాని ఇంటికి ఏం తెచ్చిందో చూడండి..
ABN , Publish Date - May 11 , 2025 | 07:21 AM
కొన్నిసార్లు పిల్లులు మనుషులను అనుకరిస్తూ చేసే పనులు చూస్తే ఆశ్చర్యం కలుగుతుంటుంది. ఇంకొన్నిసార్లు అదే పిల్లులు మనుషులు షాక్ అయ్యే పనులు కూడా చేస్తుంటాయి. ఇలాంటి సంఘటనలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. తాజాగా..

ప్రస్తుతం ప్రతి ఇంట్లో కుక్కలు, పిల్లులను పెంచుకోవడం సర్వసాధారణమైంది. అవి కూడా యజమానుల పట్ల ఎంతో విశ్వాసంగా ఉండడం చూస్తుంటాం. కొన్నిసార్లు పిల్లులు మనుషులను అనుకరిస్తూ చేసే పనులు చూస్తే ఆశ్చర్యం కలుగుతుంటుంది. ఇంకొన్నిసార్లు అదే పిల్లులు మనుషులు షాక్ అయ్యే పనులు కూడా చేస్తుంటాయి. ఇలాంటి సంఘటనలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. తాజాగా, ఇలాంటి వీడియో ఒకటి నెట్టింట చక్కర్లు కొడుతోంది. ఓ పిల్లి ఇంటికి తీసుకొచ్చిన బహుమతి చూసి యజమాని షాక్ అయ్యాడు. ఈ వీడియో చూసిన నెటిజన్లు.. ‘‘ఈ పిల్లి ధైర్యం మామూలుగా లేదుగా’’.. అంటూ కామెంట్లు చేస్తున్నారు.
సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. ఓ పిల్లి చేసిన నిర్వాకం చూసి అంతా అవాక్కవుతున్నారు. ఇంటి బయట ఉన్న పిల్లికి పాము కనిపించింది. దాన్ని చూడగానే పక్కకు పారిపోవాల్సిన పిల్లి.. అందుకు విరుద్ధంగా ప్రవర్తించింది. పాము దగ్గరికి వెళ్లడమే కాకుండా ఏకంగా దాన్ని నోట కురుచుకుంది.
Woman Funny Video: ఫోన్ వాడడమే కాదు.. దాచడమూ తెలుసు.. ఈమె నిర్వాకం చూస్తే నోరెళ్లబెడతారు..
అంతటితో ఆగకుండా పామును అలాగే పట్టుకుని నేరుగా (Pet Cat Brings Snakes To Owner's House) తన యజమాని ఇంటికి వెళ్లింది. పిల్లి పామును తీసుకురావడం చూసి ఆ యజమాని షాక్ అయ్యాడు. పిల్లి సమీపానికి రాగానే పామును పక్కకు తీసేందుకు ప్రయత్నించాడు. అయినా ఆ పిల్లి దాన్ని ఇంట్లోకి తీసుకెళ్లేందుకు ప్రయత్నిస్తూనే ఉంది. ఇలా ఆ పిల్లి చాలా సేపు పామును నోట కరుచుకుని అక్కడే నిలబడింది. ఈ ఘటనను మొత్తం ఆ వ్యక్తి వీడియో తీసి, సోషల్ మీడియాలో షేర్ చేశాడు.
Monkey Funny Viral Video: లస్సీ తర్వాతే ఏదైనా.. ఈ కోతి నిర్వాకం చూస్తే.. నవ్వకుండా ఉండలేరు..
ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘వామ్మో.. ఈ పిల్లి ధైర్యం మామూలుగా లేదుగా’’.. అంటూ కొందరు, ‘‘పామును బహుమతిగా తీసుకొచ్చిన పిల్లి’’.. అంటూ మరికొందరు, వివిధ రకాల ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 300కి పైగా లైక్‌లు, 4 వేలకు పైగా వ్యూస్‌ను సొంతం చేసుకుంది.
Monkey Funny Video: కొమ్మ చివరన కోతి.. పండు ఎలా కోసిందో చూస్తే..
ఇవి కూడా చదవండి..
Monkey Funny Video: కొమ్మ చివరన కోతి.. పండు ఎలా కోసిందో చూస్తే..
Food Funny Video: విందులో వింత నిర్వాకం.. ఈ అతిథులు చేసిన నిర్వాకం చూస్తే అవాక్కవ్వాల్సిందే..
Stunts Viral Video: చావు అంచుల దాకా వెళ్లడమంటే ఇదే.. వ్యూస్ కోసం వీళ్ల నిర్వాకం చూస్తే..