Share News

Marriage Funny Video: టోపీపై టెక్నాలజీ అంటే ఇదేనేమో.. ఈ వరుడి ప్రయోగం చూస్తే.. ఖంగుతినాల్సిందే..

ABN , Publish Date - May 16 , 2025 | 10:28 AM

ఓ వివాహ కార్యక్రమంలో వరుడు పురోహితుడి ఎదురుగా కూర్చుని పూజలు చేస్తుంటాడు. పురోహితుడి సూచనల మేరకు.. పూజలు చేస్తుంటాడు. అయితే ఈ సమయంలో వరుడు ధరించిన తలపాగా చూసి అంతా అవాక్కవుతున్నారు.. ఈ వీడియో చూసిన వారంతా.. ‘‘టోపీపై టెక్నాలజీ అంటే ఇదేనేమో’’.. అంటూ కామెంట్లు చేస్తున్నారు..

Marriage Funny Video: టోపీపై టెక్నాలజీ అంటే ఇదేనేమో.. ఈ వరుడి ప్రయోగం చూస్తే.. ఖంగుతినాల్సిందే..

వివాహ కార్యక్రమాల్లో చోటు చేసుకునే వింత వింత ఘటనలు కొన్నిసార్లు అందరికీ తెగ నవ్వు తెప్పిస్తుంటాయి. సాధారణంగా పెళ్లి అనగానే.. వధూవరులు ఒకరిపై ఒకరు ప్రాంక్ చేసుకోవడం, స్నేహితులంతా కలిసి వధూవరులను ఆట పట్టించడం, పెళ్లి మంటపంలోకి వినూత్నంగా ఎంటరవడం వంటి ఘటనలే గుర్తుకొస్తుంటాయి. ఇలాంటి సంఘటనలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. తాజాగా, ఇలాంటి వీడియో ఒకటి నెట్టింట చక్కర్లు కొడుతోంది. వరుడు ధరించిన తలపాగా అందరినీ అవాక్కయ్యేలా చేస్తోంది. ఈ వీడియో చూసిన వారంతా ఫన్నీ ఫన్నీ కామెంట్లు చేస్తున్నారు..


సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. ఓ వివాహ (Marriage) కార్యక్రమంలో వరుడు పురోహితుడి ఎదురుగా కూర్చుని పూజలు చేస్తుంటాడు. పురోహితుడు దగ్గరుండి మరీ వరుడితో సాంప్రదాయ పద్ధతిలో పూజలు చేయిస్తుంటాడు. ఈ సమయంలో వరుడు కూడా సాంప్రదాయ దుస్తులతో పాటూ తలపాగా (Groom's Hat) ధరించి ఉంటాడు. ఇంతవరకూ అంతా బాగానే ఉంది కానీ.. ఇక్కడే ఎవరూ ఊహించని ఘటన చోటు చేసుకుంది.

Marriage Funny video: ఇదేం గిఫ్ట్‌రా బాబోయ్.. దెబ్బకు వధువు వణికిపోయిందిగా..


అక్కడున్న వారందరి చూపు వరుడి తలపాగా పైనే పడింది. అంత ఆసక్తిగా గమనించడానికి.. ఆ తలపాగాలో ఏముందీ.. అని అనుకుంటున్నారు కదా. తలపాగాపై చిన్న సైజులో ఉండే రంగు రంగుల లైట్లను అమర్చాడు. ఆ వెనుకే బ్యాటరీని కూడా టేపుతో తలపాగాకు అంటించాడు. ఆ బ్యాటరీ నుంచి లైట్లకు కనెక్షన్ ఇచ్చాడు. ఫైనల్‌గా రంగు రంగుల లైట్ల వెలుతురులో (Lights On Groom's Hat) ఉండే తలపాగా చూపరులను తనవైను తిప్పేలా చేసిందన్నమాట.

Dog VS Crocodile: మొసలికి చుక్కలు చూపించిన కుక్క.. పారిపోతుండగా ఎలా పట్టుకుందో చూడండి..


కాగా, ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘టెక్నాలజీని ఇంతకంటే బాగా వాడేవారు ఉండరేమో’’.. అంటూ కొందరు, ‘‘ఈ వరుడి తలపాగా మామూలుగా లేదుగా’’.. అంటూ మరికొందరు, వివిధ రకాల ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 22 వేలకు పైగా లైక్‌లు, 1.4 మిలియన్‌కు పైగా వ్యూస్‌ను సొంతం చేసుకుంది.

Couple Funny Video: భార్యల మెంటాలిటీ ఇలా ఉంటుందా.. ఈ భర్త చేసిన ప్రయోగం చూస్తే..


ఇవి కూడా చదవండి..

Python VS Leopard: పులిని మింగాలని చూసిన కొండచిలువ.. చివరికి జరిగింది చూస్తే అవాక్కవ్వాల్సిందే..

Monkey Funny Video: కొమ్మ చివరన కోతి.. పండు ఎలా కోసిందో చూస్తే..

Food Funny Video: విందులో వింత నిర్వాకం.. ఈ అతిథులు చేసిన నిర్వాకం చూస్తే అవాక్కవ్వాల్సిందే..

మరిన్ని వైరల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Updated Date - May 16 , 2025 | 11:21 AM