Snakes VS Dogs: ఓకే బావిలో పాముల మధ్యలో పడిపోయిన కుక్కలు.. సడన్‌గా లోపలికి దిగిన వ్యక్తి.. చివరకు..
ABN , Publish Date - May 14 , 2025 | 07:25 AM
ఎలా పడ్డాయో ఏమో తెలీదు గానీ.. కొండ చిలువ, పాము, మానిటర్ బల్లులు బావిలో ఉండగా.. మూడు కుక్కలు అందులో పడిపోయాయి. ఈ క్రమంలో కుక్కలు ఒకదానిపై మరొకటి దాడి చేసుకుంటూ గందరగోళం సృష్టించాయి.

పాములు, కుక్కల మధ్య కొన్నిసార్లు షాకింగ్ ఘటనలు చోటు చేసుకుంటుంటాయి. ఇళ్లల్లోకి చొరబడే పాములను కుక్కలు తరిమి తరిమి కొడుతుంటాయి. అప్పుడప్పుడూ కొన్ని కుక్కలు విషపూరిత పాములను కూడా నోటితో కరిచి చంపేస్తుంటాయి. ఇలాంటి వీడియోలను తరచూ చూస్తూనే ఉంటాం. ఇలాంటి షాకింగ్ ఘటనలకు సంబంధించిన వీడియోలను నిత్యం చూస్తుంటాం. తాజాగా, ఓ విచిత్ర ఘటనలకు సంబంధించిన వీడియో ఒకటి నెట్టింట చక్కర్లు కొడుతోంది. ఓ బావిలో పాములు, కొండచిలువలు,మ మానిటర్ బల్లుల మధ్యలో మూడు కుక్కలు పడిపోయాయి. చివరకు ఏమైందో మీరే చూడండి..
సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. ఎలా పడ్డాయో ఏమో తెలీదు గానీ.. కొండ చిలువ, పాము, మానిటర్ బల్లులు (Python, snake, monitor lizards) బావిలో ఉండగా.. మూడు కుక్కలు అందులో పడిపోయాయి. అయితే ఏదీ మరోదానికి హాని చేయలేదు. అయితే మధ్యలో కుక్కల మధ్య పోట్లాట జరిగింది. ఒకదానిపై మరొకటి దాడి చేసుకుంటూ బావిలో గందరగోళం సృష్టించాయి.
Funny Hand Pump Video: ఏంట్రా ఇదీ.. చేతిబోరును ఎలా సెట్ చేశాడో చూస్తే.. ఖంగుతింటారు..
ఈ క్రమంలో మానిటర్ బల్లులు, పాములు, కొండచిలువ అటూ, ఇటూ తిరుగుతూ కుక్కలపై (Dogs) దాడి చేసే ప్రయత్నం చేశాయి. అయితే ఈ క్రమంలో స్థానికుల సమచారంతో స్నేక్ క్యాచర్ (Snake Catcher) అక్కడికి చేరుకున్నాడు. నిచ్చెన సాయంతో బావిలోకి దిగాడు. ముందుగా కుక్కలకు తాడు కట్టి పైకి పంపించాడు. ఆ తర్వాత కొండచిలువ, పాము, మానిటర్ బల్లులను ఒక్కొక్కటిగా పైకి పంపించాడు. ఇలా అతడి చొరవతో వాటికి విముక్తి కలిగింది. మురళి అనే ఈ వ్యక్తి ప్రమాదకర పాములను సైతం ఎంతో చాకచక్యంగా పట్టుకుని సురక్షిత ప్రాంతాల్లో వదిలేస్తుంటాడు.
Marriage Funny Video: ఈ వరుడు చల్లగుండ.. ఊరేగింపులో ఎలా వస్తున్నాడో చూడండి..
అందుకు సంబంధించిన వీడియోలను యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్ తదితర వేదికల్లో షేర్ చేస్తుంటాడు. సమయానికి స్పందించిన స్నేక్ క్యాచర్‌కు స్థానికులంతా కృతజ్ఞతలు తెలియజేశారు. కాగా, ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘అయ్యో.. వీటికి ఎంత కష్టం వచ్చిందీ’’.. అంటూ కొందరు, ‘‘స్నేక్ క్యాచర్ ఎంతో మంచి పని చేశారు.. గ్రేట్’’.. అంటూ మరికొందరు, వివిధ రకాల ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 67 లక్షలకు పైగా లైక్‌లు, 192 మిలియన్లకు పైగా వ్యూస్‌ను సొంతం చేసుకుంది.
Python VS Leopard: పులిని మింగాలని చూసిన కొండచిలువ.. చివరికి జరిగింది చూస్తే అవాక్కవ్వాల్సిందే..
ఇవి కూడా చదవండి..
Python VS Leopard: పులిని మింగాలని చూసిన కొండచిలువ.. చివరికి జరిగింది చూస్తే అవాక్కవ్వాల్సిందే..
Monkey Funny Video: కొమ్మ చివరన కోతి.. పండు ఎలా కోసిందో చూస్తే..
Food Funny Video: విందులో వింత నిర్వాకం.. ఈ అతిథులు చేసిన నిర్వాకం చూస్తే అవాక్కవ్వాల్సిందే..