Marriage Funny video: ఇదేం గిఫ్ట్‌రా బాబోయ్.. దెబ్బకు వధువు వణికిపోయిందిగా..
ABN , Publish Date - May 14 , 2025 | 01:15 PM
పెళ్లిలో వేదికపై ఉన్న వధూవరులకు .. స్నేహితులు, బంధువులు తమకు తోచిన గిఫ్ట్‌లు అందిస్తూ ఫొటోలు దిగుతున్నారు. అయితే ఇంతవరకూ అంతా బాగానే ఉంది కానీ.. ఇక్కడే ఎవరూ ఊహించని ఘటన చోటు చేసుకుంది..

పెళ్లిళ్లు అంటేనే విందులు, చిందులు, వినోదానికి పెట్టింది పేరు. అయితే ప్రస్తుత సోషల్ మీడియాలో యుగంలో ఈ వినోదం డోస్ పెరిగిపోయింది. నెటిజన్ల దృష్టిని ఆకర్షించేందుకు పెళ్లిలో వివిధ రకాల ప్రయత్నాలు చేస్తుంటారు. వధూవరులు ఒకరిపై మరొకరు ప్రాంక్‌లు చేసుకోవడం, స్నేహితులంతా కలిసి వధూవరులను ఆట పట్టించడం జరుగుతుంటుంది. ఇలాంటి సంఘటనలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. తాజాగా, ఇలాంటి వీడియో ఒకటి నెట్టింట చక్కర్లు కొడుతోంది. పెళ్లిలో వరుడు గిఫ్ట్ బాక్స్ ఓపెన్ చేయగానే వధువు భయంతో వణికిపోయింది. ఈ వీడియో చూసిన నెటిజన్లు.. ‘‘ ఇదేం గిఫ్ట్‌రా బాబోయ్’’.. అంటూ కామెంట్లు చేస్తున్నారు..
సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. పెళ్లిలో (Marriage) వేదికపై ఉన్న వధూవరులకు (Bride and groom) .. స్నేహితులు, బంధువులు తమకు తోచిన గిఫ్ట్‌లు అందిస్తూ ఫొటోలు దిగుతున్నారు. అయితే ఇంతవరకూ అంతా బాగానే ఉంది కానీ.. ఇక్కడే ఎవరూ ఊహించని ఘటన చోటు చేసుకుంది.
Dog VS Crocodile: మొసలికి చుక్కలు చూపించిన కుక్క.. పారిపోతుండగా ఎలా పట్టుకుందో చూడండి..
స్నేహితులు అందించిన విచిత్రమైన గిఫ్ట్‌ను వరుడు తెరిచేందుకు ప్రయత్నించాడు. బాక్స్‌ను ఓపెన్ చేయగానే.. అందులో నుంచి ఓ కప్ప (frog came out of gift box) ఎగురుకుంటూ వధువుపై దూకింది. దాన్ని చూడగానే వధువు.. కెవ్వుమని కేకలు పెడుతూ భయంతో ఎగిరి పక్కకు పడిపోయింది. ఈ ఘటనతో అక్కడున్న వారంతా తెగ నవ్వుకున్నారు.
Couple Funny Video: భార్యల మెంటాలిటీ ఇలా ఉంటుందా.. ఈ భర్త చేసిన ప్రయోగం చూస్తే..
కాగా, ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘మీ దుంపలు తెగ.. ఇదెక్కి గిఫ్ట్‌రా నాయనా..’’.. అంటూ కొందరు, ‘‘ఇలాంటి గిఫ్ట్ కూడా ఉంటుందని ఇప్పుడే తెలిసింది’’.. అంటూ మరికొందరు, వివిధ రకాల ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 2 వేలకు పైగా లైక్‌లు, లక్షకు పైగా లైక్‌లను సొంతం చేసుకుంది.
Snakes VS Dogs: ఓకే బావిలో పాముల మధ్యలో పడిపోయిన కుక్కలు.. సడన్‌గా లోపలికి దిగిన వ్యక్తి.. చివరకు..
ఇవి కూడా చదవండి..
Python VS Leopard: పులిని మింగాలని చూసిన కొండచిలువ.. చివరికి జరిగింది చూస్తే అవాక్కవ్వాల్సిందే..
Monkey Funny Video: కొమ్మ చివరన కోతి.. పండు ఎలా కోసిందో చూస్తే..
Food Funny Video: విందులో వింత నిర్వాకం.. ఈ అతిథులు చేసిన నిర్వాకం చూస్తే అవాక్కవ్వాల్సిందే..