Monkey Attack Video: వామ్మో.. కుక్కల్లా మారిన కోతులు.. వృద్ధురాలిని చుట్టుముట్టి మరీ..
ABN , Publish Date - May 16 , 2025 | 11:34 AM
ఓ వృద్ధురాలు రోడ్డుపై నిలబడి ఉంటుంది. ఇంతలో ఎక్కడి నుంచి వచ్చాయో ఏమో తెలీదు గానీ.. కొన్ని కోతులు ఆ వృద్ధురాలి వద్దకు వస్తాయి. వచ్చీ రావడంతోనే వాటిలో ఓ కోతి వృద్ధురాలి చీర పట్టుకుని లాగేస్తుంది. చివరకు ఏమైందో మీరే చూడండి..

కోతి చేష్టలు అనగానే.. చెట్టు కొమ్మలపై గెంతులేయడం, ఇళ్లల్లోకి చొరబడి వస్తువులు ఎత్తుకెళ్లడం, పర్యాటకుల చేతుల్లోని ఆహార పదార్థాలను లాక్కోవడం.. వంటి ఘటనలే గుర్తుకొస్తుంటాయి. అయితే ఇలాంటి కోతులు కొన్నిసార్లు ఇందుకు పూర్తి విరుద్ధంగా ప్రవర్తిస్తుంటాయి. కుక్కల తరహాలో మనుషులపై దాడి చేసి రక్కేస్తుంటాయి. ఇలాంటి షాకింగ్ ఘటనలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. తాజాగా, ఇలాంటి వీడియో ఒకటి నెట్టింట చక్కర్లు కొడుతోంది. రోడ్డుపై ఉన్న వృద్ధురాలిపై కోతుల గుంపు దాడి చేసింది. చివరకు ఏమైందో మీరే చూడండి..
సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. ఓ కాలనీ రోడ్డుపై ఓ వృద్ధురాలు నిలబడి ఉంటుంది. ఇంతలో ఎక్కడి నుంచి వచ్చాయో ఏమో తెలీదు గానీ.. కొన్ని కోతులు ఆ వృద్ధురాలి వద్దకు వస్తాయి. వచ్చీ రావడంతోనే వాటిలో ఓ కోతి వృద్ధురాలి (Monkeys Attack An Old woman) చీర పట్టుకుని లాగేస్తుంది. దీంతో ఆమె ఒక్కసారిగా అదుపు తప్పి కిందపడిపోతుంది.
Marriage Funny video: ఇదేం గిఫ్ట్రా బాబోయ్.. దెబ్బకు వధువు వణికిపోయిందిగా..
ఇంతలో మరికొన్ని కోతులు ఆమె చుట్టూ చేరి దాడి చేసేందుకు ప్రయత్నిస్తాయి. వాటి నుంచి ఎంత తప్పించుకుందామని చూసినా కోతులు చుట్టుముట్టి రక్కేందుకు ప్రయత్నిస్తుంటాయి. అయితే ఇంతలో ఆ పక్కనే ఉన్న ఇంటి నుంచి భార్యాభర్తలు బయటికి వస్తారు. వృద్ధురాలు ప్రమాదంలో ఉండడం చూసి కర్రలు తీసుకుని, పరుగెత్తుకుంటూ వెళ్లి కోతులను తరిమికొడతారు. వారిని చూడగానే కోతులన్నీ భయంతో అక్కడి నుంచి పారిపోతాయి. దీంతో వృద్ధురాలు ప్రమాదం నుంచి క్షేమంగా బయటపడుతుంది.
Dog VS Crocodile: మొసలికి చుక్కలు చూపించిన కుక్క.. పారిపోతుండగా ఎలా పట్టుకుందో చూడండి..
కాగా, ఈ ఘటన మొత్తం అక్కడే ఉన్న సీసీ కెమెరాలో రికార్డ్ అయింది. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘వామ్మో.. కోతులేంటీ ఇలా చేస్తున్నాయి’’.. అంటూ కొందరు, ‘‘సమయానికి ఈ దంపతులు రావడం మంచిదైంది’’.. అంటూ మరికొందరు, వివిధ రకాల ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 200కి పైగా లైక్‌లు, 15 వేలకు పైగా వ్యూస్‌ను సొంతం చేసుకుంది.
Marriage Funny Video: టోపీపై టెక్నాలజీ అంటే ఇదేనేమో.. ఈ వరుడి ప్రయోగం చూస్తే.. ఖంగుతినాల్సిందే..
ఇవి కూడా చదవండి..
Python VS Leopard: పులిని మింగాలని చూసిన కొండచిలువ.. చివరికి జరిగింది చూస్తే అవాక్కవ్వాల్సిందే..
Monkey Funny Video: కొమ్మ చివరన కోతి.. పండు ఎలా కోసిందో చూస్తే..
Food Funny Video: విందులో వింత నిర్వాకం.. ఈ అతిథులు చేసిన నిర్వాకం చూస్తే అవాక్కవ్వాల్సిందే..