Share News

Funny Viral Video: ఇలాంటి అదృష్టం ఎంతమందికి వస్తుందీ.. ఎలా వడ్డిస్తున్నారో చూడండి..

ABN , Publish Date - May 17 , 2025 | 07:51 AM

అతిథి దేవో భవ.. అన్న సూక్తి ప్రకారం అతిథులను దైవంతో సమానంగా చూడాలి. వారికి ఎలాంటి లోటుపాట్లు రాకుండా గౌరవంగా చూసుకోవాలని పెద్దలు అంటుంటారు. అయితే దీన్ని ఎవరు ఎంతవరకూ పాటిస్తారో తెలీదు గానీ.. కొందరు మాత్రం ఈ మాటను తూచాతప్పకుండా పాటిస్తుంటారు. ఇందుకు నిదర్శనంగా..

Funny Viral Video: ఇలాంటి అదృష్టం ఎంతమందికి వస్తుందీ.. ఎలా వడ్డిస్తున్నారో చూడండి..

అతిథి దేవో భవ.. అన్న సూక్తి ప్రకారం అతిథులను దైవంతో సమానంగా చూడాలి. వారికి ఎలాంటి లోటుపాట్లు రాకుండా గౌరవంగా చూసుకోవాలని పెద్దలు అంటుంటారు. అయితే దీన్ని ఎవరు ఎంతవరకూ పాటిస్తారో తెలీదు గానీ.. కొందరు మాత్రం ఈ మాటను తూచాతప్పకుండా పాటిస్తుంటారు. ఇందుకు నిదర్శనంగా మన కళ్ల ముందు అనేక సంఘటనలు చోటు చేసుకుంటుంటాయి. తాజాగా, వైరల్ అవుతున్న వీడియోనే ఇందుకు నిదర్శనం. ఓ యువకుడికి భోజనం వడ్డించిన తీరు చూసి అంతా అవాక్కవుతున్నారు. ఈ వీడియోను చూసిన వారంతా.. ‘‘అతిథి మర్యాదలంటే ఇవీ..’’.. అంటూ కామెంట్లు చేస్తున్నారు.


సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. అతిథిగా తమ ఇంటికి వచ్చిన ఓ యువకుడిని నేలపై కూర్చోబెట్టి, అతడి ఎదురుగా ఆహారాన్ని వడ్డిస్తారు. ఆహారం అంటే అన్నం, పప్పు, సాంబారు, పెరుగు వంటివి కాదు. ఏకంగా అన్ని రకాల (Many Food Items) ఆహార పదార్థాలను అతడి ముందు వరుసగా పేర్చారు.

Elephant Sad Video: అయ్యో.. ఈ ఏనుగుకు ఎంత కష్టమొచ్చిందీ.. రోడ్డుపై ట్రక్కు వద్ద ఏం చేస్తుందో చూస్తే..


స్వీట్లు మొదలుకొని, కూల్ డ్రింక్స్ వరకూ, అలాగే టిఫిన్స్, వివిధ రకాల మాంసాహారాలు తదితరాలు అన్నింటినీ ప్లేట్లో పెట్టి వడ్డించారు. వాటన్నింటినీ వృత్తాకారంలో అందంగా అలంకరించి మరీ వడ్డించేశారు. తన ముందున్న అనేక రకాల ఆహార పదార్థాలలో ఏది ముందు తినాలో తెలీక, దేన్ని సెలెక్ట్ చేసుకోవాలో అర్థం కాక.. ఆ వ్యక్తి బిత్తర చూపులు చూస్తుంటాడు. మరో వైపు ఆ ఇంట్లోని యువతులు, మహిళలు మరిన్ని ఆహార పదార్థాలను వడ్డిస్తుంటారు.

Monkey Attack Video: వామ్మో.. కుక్కల్లా మారిన కోతులు.. వృద్ధురాలిని చుట్టుముట్టి మరీ..


ప్లేట్లకు మధ్యలో పూలను కూడా అలంకరిస్తుంటారు. ఇలా అనేక రకాల ఆహార పదార్థాలను ఒకేసారి వడ్డించి, అందరినీ ఆశ్చర్యానికి గురి చేశారన్నమాట. కాగా, ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘అతిథి మర్యాదలంటే ఇవి’’.. అంటూ కొందరు, ‘‘ఇతనెవరో గానీ చాలా లక్కీ ఫెలో’’.. అంటూ మరికొందరు, ‘‘అత్తమామలంటే ఇలా ఉండాలి’’.. అంటూ ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 300కి పైగా లైక్‌‌‌లు, 14 వేలకు పైగా వ్యూస్‌ను సొంతం చేసుకుంది.

Marriage Funny Video: టోపీపై టెక్నాలజీ అంటే ఇదేనేమో.. ఈ వరుడి ప్రయోగం చూస్తే.. ఖంగుతినాల్సిందే..


ఇవి కూడా చదవండి..

Python VS Leopard: పులిని మింగాలని చూసిన కొండచిలువ.. చివరికి జరిగింది చూస్తే అవాక్కవ్వాల్సిందే..

Monkey Funny Video: కొమ్మ చివరన కోతి.. పండు ఎలా కోసిందో చూస్తే..

Food Funny Video: విందులో వింత నిర్వాకం.. ఈ అతిథులు చేసిన నిర్వాకం చూస్తే అవాక్కవ్వాల్సిందే..

మరిన్ని వైరల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Updated Date - May 17 , 2025 | 07:52 AM