Share News

Crocodile Viral Video: మొసలి బొమ్మ అనుకుని నీటిలోకి దిగాడు.. చివరకు గుండెలు ఆగిపోయే సీన్..

ABN , Publish Date - May 17 , 2025 | 11:37 AM

ఓ భారీ మొసలి నీటిపై తేలుతూ ఉంటుంది. దాన్ని చూసిన ఓ వ్యక్తి బొమ్మ అనుకుంటాడు. దీంతో ఫొటో దిగేందుకు నీటిలోకి దిగుతాడు. అయితే తీరా దగ్గరికి వెళ్లి, ఫొటో తీసుకుంటుండగా.. మొసలి ఒక్కసారిగా కదులుతుంది. ఆ వెంటనే ..

Crocodile Viral Video: మొసలి బొమ్మ  అనుకుని నీటిలోకి దిగాడు.. చివరకు గుండెలు ఆగిపోయే సీన్..

మొసలి దాడి చేస్తే ఎలాంటి ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. నీటిలో ఉన్న మొసలి నోటికి ఎలాంటి జంతువు చిక్కినా తప్పించుకోవడం దాదాపు అసాధ్యం. దీంతో ఏనుగులు సైతం మొసలి జోలికి వెళ్లాలంటే భయపడుతుంటాయి. కొన్నిసార్లు మనుషులు వాటితో ఆటలు ఆడుతూ విన్యాసాలు చేస్తుంటారు. మరికొన్నిసార్లు కొందరు ప్రమాదవశాత్తు వాటి నోటికి చిక్కి ప్రాణాలు కోల్పోతుంటారు. ఇలాంటి షాకింగ్ ఘటనలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. తాజాగా, ఇలాంటి వీడియో ఒకటి నెట్టింట చక్కర్లు కొడుతోంది. ఓ వ్యక్తి నీటిలో మొసలిని బొమ్మ అని భ్రమపడ్డాడు. సమీపానికి వెళ్లగా చివరకు ఏమైందో మీరే చూడండి..


సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. ఓ భారీ మొసలి నీటిపై తేలుతూ ఉంటుంది. దాన్ని చూసిన ఓ వ్యక్తి బొమ్మ అనుకుంటాడు. దీంతో ఫొటో దిగేందుకు నీటిలోకి దిగుతాడు. అయితే తీరా దగ్గరికి వెళ్లి, ఫొటో తీసుకుంటుండగా.. మొసలి ఒక్కసారిగా కదులుతుంది. ఆ వెంటనే అతడి కాలు పట్టేసుకుంటుంది.

Viral Video: ఇలాంటి ఉద్యోగిని ఎక్కడైనా చూశారా.. బాస్‌కు ఎలా మస్కా కొడుతున్నాడంటే..


మొసలి దాడితో షాక్ అయిన ఆ వ్యక్తి.. మొసలి నుంచి తప్పించుకునేందుకు శతవిధాలా ప్రయత్నించాడు. అయినా మొసలి అతన్ని వదలకుండా (Crocodile attacks young man) గట్టిగా పట్టుకుంటుంది. మధ్య మధ్యలో అతన్ని అటూ, ఇటూ తిప్పుతూ కాలిని విరిచే ప్రయత్నం చేస్తుంది. ఇలా ఆ మొసలి చాలా సేపు అతన్ని పట్టుకుని, చంపే ప్రయత్నం చేస్తుంది. ఈ వీడియో ఇంతటితో ముగుస్తుంది.

Elephant Sad Video: అయ్యో.. ఈ ఏనుగుకు ఎంత కష్టమొచ్చిందీ.. రోడ్డుపై ట్రక్కు వద్ద ఏం చేస్తుందో చూస్తే..


ఈ ఘటన ఎప్పుడు ఎక్కడ జరిగింది తెలియాల్సి ఉంది. అలాగే మొసలి దాడిలో అతడు క్షేమంగా బయటపడ్డాడా.. లేక ప్రాణాలు కోల్పోయాడా అనే విషయం కూడా తెలియాల్సి ఉంది. కాగా, ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘అయ్యో.. ఎంత ఘోరం జరిగింది’’.. అంటూ కొందరు, ‘‘అతడికి ఏమీ కాకూడదు’’.. అంటూ మరికొందరు, వివిధ రకాల ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియోను ఇప్పటి వరకూ 4.5 మిలియన్ల మంది వీక్షించారు.

Funny Viral Video: ఇలాంటి అదృష్టం ఎంతమందికి వస్తుందీ.. ఎలా వడ్డిస్తున్నారో చూడండి..


ఇవి కూడా చదవండి..

Python VS Leopard: పులిని మింగాలని చూసిన కొండచిలువ.. చివరికి జరిగింది చూస్తే అవాక్కవ్వాల్సిందే..

Monkey Funny Video: కొమ్మ చివరన కోతి.. పండు ఎలా కోసిందో చూస్తే..

Food Funny Video: విందులో వింత నిర్వాకం.. ఈ అతిథులు చేసిన నిర్వాకం చూస్తే అవాక్కవ్వాల్సిందే..

మరిన్ని వైరల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Updated Date - May 17 , 2025 | 11:57 AM