Theft Viral Video: వామ్మో.. ఎంతకు తెగించారు.. బస్సులో వీళ్లు చేసిన చోరీ చూస్తే..
ABN , Publish Date - May 18 , 2025 | 12:20 PM
బస్సు ఎక్కిన కొందరు దొంగలు.. అమాయకుల కోసం ఎదురు చూస్తున్నారు. ఇంతలో ఓ యువకుడు బ్యాగుతో బస్ ఎక్కాడు. అతన్ని టార్గెట్ చేసిన దొంగలు.. కొద్దిసేపటి తర్వాత అంతా కలిసి అతడిని చుట్టుముట్టారు. చివరకు ఏం జరిగిందో మీరే చూడండి..

దొంగలు రోజురోజుకూ రెచ్చిపోతున్నారు. కొందరు రాత్రి వేళల్లో ఇళ్లల్లోకి చొరబడి నగలు, నగదు దోచుకుపోతుంటే.. మరికొందరు ఎక్కడో కూర్చుని ఫోన్ల ద్వారా లింక్‌లు పంపిస్తూ నేరాలకు తెగబడుతున్నారు. ఇంకొందరు దొంగలేమో.. మన పక్కనే ఉంటూ కళ్లుగప్పి చోరీలకు పాల్పడుతున్నారు. ఇలాంటి సంఘటనలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. తాజాగా, ఇలాంటి వీడియో ఒకటి నెట్టింట చక్కర్లు కొడుతోంది. కొందరు దొంగలు కలిసి బస్సులో చేసిన చోరీ చూసి అంతా అవాక్కవుతున్నారు. ఈ వీడియో చూసిన వారంతా.. వామ్మో.. ఎంతకు తెగించారు.. అంటూ కామెంట్లు చేస్తున్నారు.
సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. ఢిల్లీలోని (Delhi) ఏసీ బస్సులో (Bus) ఈ ఘటన చోటు చేసుకుంది. బస్సు ఎక్కిన కొందరు దొంగలు.. అమాయకుల కోసం ఎదురు చూస్తున్నారు. ఇంతలో ఓ యువకుడు బ్యాగుతో బస్ ఎక్కాడు. అతన్ని టార్గెట్ చేసిన దొంగలు.. కొద్దిసేపటి తర్వాత అంతా కలిసి అతడిని చుట్టుముట్టారు.
Accident Viral Videos: వామ్మో.. ఒళ్లు గగుర్పొడిచే వీడియో.. ఇలాంటి తప్పు ఎప్పుడూ చేయకండి..
ముందూ, వెనుకా నిలబడి అతన్ని తికమక పెట్టి, చివరకు ఆ యువకుడి బ్యాగులోని (Thieves steal young man's phone )తీసుకున్నారు. దాన్ని తీసుకున్న దొంగ.. ఆ వెనుకే ఉన్న మరో దొంగ చేతికి అందించాడు. తర్వాత ఏమీ ఎరుగనట్లు అంతా ఎవరి సీట్లలో వారు కూర్చుంటారు. ఇంతలో మరో దొంగ ఆ ఫోన్ తీసుకుని, తన నడుము వద్ద ఫ్యాంట్లో దాచేస్తాడు.
Funny Viral Video: ఇలాంటి అదృష్టం ఎంతమందికి వస్తుందీ.. ఎలా వడ్డిస్తున్నారో చూడండి..
కాసేపటి తర్వాత తన ఫోన్ మిస్ అయినట్లు గుర్తించిన ఆ బాధితుడు దొంగలను ప్రశ్నిస్తాడు. వారు తమ ఫోన్ చూపిస్తూ తమకేమీ తెలీదంటూ నటిస్తారు. అంతా కలిసి దొంగను పక్కదారి పట్టించే ప్రయత్నం చేస్తారు. ఈ వీడియో ఇంతటితో ముగుస్తుంది. ఈ ఘటన మొత్తం అక్కడే ఉన్న సీసీ కెమెరాలో రికార్డ్ అయింది. పట్టపగలే బరితెగించారుగా.. అంటూ కొందరు, ఇలాంటి దొంగలను కఠినంగా శిక్షించాలి.. అంటూ ఇంకొందరు, వివిధ రకాల ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 300కి పైగా లైక్‌లు, 11 వేలకు పైగా వ్యూస్‌ను సొంతం చేసుకుంది.
Tap Viral Video: ఈ కుళాయిని ఆన్ చేయాలంటే.. ఆలోచించాల్సిందే.. భలే సెట్ చేశాడుగా..
ఇవి కూడా చదవండి..
Python VS Leopard: పులిని మింగాలని చూసిన కొండచిలువ.. చివరికి జరిగింది చూస్తే అవాక్కవ్వాల్సిందే..
Monkey Funny Video: కొమ్మ చివరన కోతి.. పండు ఎలా కోసిందో చూస్తే..
Food Funny Video: విందులో వింత నిర్వాకం.. ఈ అతిథులు చేసిన నిర్వాకం చూస్తే అవాక్కవ్వాల్సిందే..