Home » Delhi
Rahul letter to PM: ప్రధాని మోదీకి రాహుల్ గాంధీ లేఖ రాశారు. పహల్గామ్ ఉగ్రదాడి నేపథ్యంలో వెంటనే పార్లమెంటు సమావేశాలు ఏర్పాటు చేయాలని లేఖలో పేర్కొన్నారు.
సిబిఐ అధికారి రాంసింగ్‌తో సహా సునీత దంపతులపై దాఖలైన కేసులో తాజా దర్యాప్తు నివేదికను ఏపీ ప్రభుత్వం సుప్రీంకోర్టుకు అందజేసింది. రాంసింగ్, సునీత దంపతులపై కావాలనే కేసు పెట్టారని, అవినాశ్ రెడ్డే ఇద్దరు పోలీసు అధికారులను అడ్డం పెట్టుకొని ఈ తతంగం అంతా నడిపారని ఆ నివేదికలో ఏపీ ప్రభుత్వం పేర్కొంది.
గౌతమ్ గంభీర్‌ను చంపేస్తానంటూ బెదిరించిన ఘటనలో కీలక పరిణామం చోటు చేసుకుంది. గౌతమ్ గంభీర్‌ను చంపేస్తానంటూ బెదిరించిన ఇంజినీరింగ్ విద్యార్థిని ఢిల్లీ పోలీసులు అరెస్ట్ చేశారు. గౌతమ్ గంభీర్‌కు బెదిరింపు మెయిల్స్ పంపిన గుజరాత్‌కు చెందిన ఇంజినీరింగ్ విద్యార్థి జిగ్నేశ్ సిన్హ్ పర్మార్ (21)గా పోలీసులు గుర్తించి అరెస్ట్ చేశారు.
పద్మా అవార్డుల ప్రదానోత్సవం సోమవారం సాయంత్రం రాష్ట్రపతి భవన్లో జరగనుంది. ఎంపికైనవారికి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అవార్డులను ప్రదానం చేస్తారు. నందమూరి బాలకృష్ణ పద్మవిభూషణ్ అవార్డును అందుకోనున్నారు.
Borugadda Anil Supreme Court: వైసీపీ నేత బోరుగడ్డ అనిల్‌కు సుప్రీం కోర్టులో చుక్కెదురైంది. బెయిల్‌పై హైకోర్టులోనే తేల్చుకోవాలని ఉన్నతన్యాయస్థానం స్పష్టం చేసింది.
ఏపీ రాజధాని అమరావతిలో నిర్మాణ పనులను మే2న ప్రధాని మోదీ ప్రారంభించనున్నారు. అమరావతి, ఏపీకి సంబంధించిన పలు అంశాలపై సీఎం చంద్రబాబు.. మోదీతో మాట్లాడనున్నారు. శుక్రవారం రాత్రికి ఢిల్లీలోనే చంద్రబాబు బస చేస్తారు. శనివారం ఉదయం సీఎం చంద్రబాబు ఢిల్లీ నుంచి బయలుదేరి విశాఖపట్టణానికి చేరుకుంటారు.
జమ్మూలోని అనంత్ నాగ్ జిల్లా పహల్గాంలో ఉగ్రవాదుల కాల్పుల ఘటనలో 26 మంది అమాయక టూరిస్టులు అశువులు బాసిన విషయం తెలిసిందే. అయితే ఈ క్రమంలో పాకిస్థాన్‌కు చెందిన ఓ వ్యక్తి కేక్ తీసుకుని వెళ్లే వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు..
Pahalgam Terror Attack: అనంత్‌నాగ్ పోలీసులు పహల్గామ్లో పర్యాటకులపై దాడికి పాల్పడ్డ వారిని గుర్తించే పనిలో పడ్డారు. ఈ నేపథ్యంలోనే ముగ్గురు అనుమానితుల చిత్రాలను విడుదల చేశారు. వీరిలో ఇద్దరిని పాకిస్తాన్‌కు చెందిన వారిగా గుర్తించారు.
CM Chandrababu: ఏపీ సీఎం చంద్రబాబు శుక్రవారం నాడు ఢిల్లీ వెళ్లనున్నారు. ఢిల్లీలో ప్రధాని మోదీతో సమావేశం కానున్నారు. ఈమేరకు సీఎం చంద్రబాబు పర్యటన షెడ్యూల్ ఖరారైంది.
పర్యాటకులను గుర్రంపై బైసారను తీసు కెళ్తుంటాడు హుస్సేన్. అదే అతనికి జీవనోపాధి. మంగళవారం కూడా పర్యటకులను బైసారన్ పచ్చిక బయళ్ల ప్రాంతానికి తీసుకెళ్లాడు. అక్కడి క్యాంపుల్లోని పర్యాటకులు ప్రకృతిని ఆస్వాదిస్తున్నపుడే ఉగ్రవాదులు కాల్పులకు తెగ బడ్డారు. వారిని అడ్డుకొనే క్రమంలో హుస్సేన్ ప్రాణాలొదిలాడు.