Share News

Drunk Woman Rapido Ride: తప్పతాగి ర్యాపిడో బైక్ ఎక్కిన యువతి.. తర్వాత ఏం జరిగిందంటే..

ABN , Publish Date - Dec 09 , 2025 | 12:01 PM

ఓ యువతి తప్పతాగి ర్యాపిడో బైక్ ఎక్కింది. ర్యాపిడో బైక్ రైడర్‌కు చుక్కలు చూపించింది. ఆ యువతి బైకుపై నుంచి మొత్తంగా కిందకు జారి పోయింది. అయితే, ఆ బైక్ రైడర్ ఆమెను కిందపడిపోకుండా పట్టుకున్నాడు. పైకి లేపి కూర్చోబెడదామని ఎంతో ప్రయత్నించాడు. అయితే, అతడి వల్ల కాలేదు.

Drunk Woman Rapido Ride: తప్పతాగి ర్యాపిడో బైక్ ఎక్కిన యువతి.. తర్వాత ఏం జరిగిందంటే..
Drunk Woman Rapido Ride

ఈ మధ్య కాలంలో ఆడ, మగ అన్న తేడా లేకుండా మద్యానికి బానిస అవుతున్నారు. కొంతమంది ఆడవాళ్లు తప్పతాగి నడి రోడ్డుపై గొడవలు పెట్టుకున్న సందర్భాలు కూడా చాలానే ఉన్నాయి. తాజాగా, ఓ యువతి తప్పతాగి ర్యాపిడో బైక్ ఎక్కింది. ర్యాపిడో బైక్ రైడర్‌కు చుక్కలు చూపించింది. ఇది గమనించిన జనం యువతిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. యువతిని రోడ్డుపై పడేసి వెళ్లిపోమంటూ మండిపడ్డారు. ఈ సంఘటన దేశ రాజధాని ఢిల్లీలో చోటుచేసుకుంది. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళితే.. ఢిల్లీకి చెందిన ఓ యువతి కొద్దిరోజుల క్రితం ఓ రాత్రి నైట్ క్లబ్‌కు వెళ్లింది.


క్లబ్‌లో పిచ్చిపిచ్చిగా మందు తాగింది. తూగుతూ క్లబ్ బయటకు వచ్చింది. తను ఉండే ప్రదేశానికి వెళ్లడానికి ర్యాపిడో బైక్ బుక్ చేసుకుంది. కొద్దిసేపటి తర్వాత ర్యాపిడో బైక్ అక్కడికి వచ్చింది. యువతి బైక్ ఎక్కి కూర్చుంది. కొద్దిదూరం పోగానే ఆ యువతి రైడర్‌పై పడిపోయింది. ఓ వైపు కిందకు జారసాగింది. ఇది గమనించిన రైడర్ బైక్ ఆపేశాడు. ఆ యువతి మొత్తంగా కిందకు జారి పోయింది. అయితే, ఆ బైక్ రైడర్ ఆమెను కిందపడిపోకుండా పట్టుకున్నాడు. పైకి లేపి కూర్చోబెడదామని ఎంతో ప్రయత్నించాడు. అయితే, అతడి వల్ల కాలేదు. యువతి పూర్తిగా రోడ్డుపై పడిపోయింది. వెనకాల వచ్చిన ఓ వ్యక్తి దీన్నంతా వీడియో తీశాడు.


‘ఆమెను వదిలేయ్ బ్రో.. కింద పడనివ్వు’ అంటూ ఆగ్రహం వ్యక్తం చేశాడు. తర్వాత ఏం జరిగింది? ఆ యువతి బైకుపై ఎక్కి కూర్చుందా? అతడామెను సురక్షితంగా గమ్య స్థానానికి చేర్చాడా? అన్నది తెలియరాలేదు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. వీడియోపై స్పందిస్తున్న నెటిజన్లు.. ‘ఇలాంటి వాళ్ల వల్లే సమాజం నాశనం అవుతోంది. మరీ ఇంత దారుణమా?’..‘ఆ ర్యాపిడో బైక్ అతను చాలా మంచి వాడు కాబట్టి సరిపోయింది. లేదంటే ఘోరం జరిగి ఉండేది’ అంటూ కామెంట్లు చేస్తున్నారు.


ఇవి కూడా చదవండి

అమ్మాయితో కలిసి కాలేజ్ నుంచి పారిపోదామనుకున్నాడు.. చివరకు ఏం జరిగిందో చూస్తే..

రోజూ 300 మంది.. ప్రభుత్వ ఆస్పత్రులకు క్యూ కడుతున్న బాధితులు

Updated Date - Dec 09 , 2025 | 01:02 PM