Share News

Woman Funny Video: ఇలాంటి ప్రయోగాలు మహిళలకే సాధ్యమేమో.. ఉల్లిపాయలను ఎలా కట్ చేస్తుందో చూస్తే..

ABN , Publish Date - May 20 , 2025 | 07:28 PM

ఓ మహిళ ఉల్లిపాయలు కోసేందుకు సిద్ధమవుతుంది. సాధారణంగా ఉల్లిపాయలు కోసే సమయంలో కన్నీళ్లు రావడ సహజం. అయితే కొందరు ఈ సమస్య నుంచి తప్పించుకునేందుకు విచిత్ర ప్రయోగాలు చేయడం చూస్తుంటాం. తాజాగా, ఓ మహిళ ఉల్లిపాయలు కట్ చేస్తున్న విధానం చూసి అంతా అవాక్కవుతున్నారు..

Woman Funny Video: ఇలాంటి ప్రయోగాలు మహిళలకే సాధ్యమేమో.. ఉల్లిపాయలను ఎలా కట్ చేస్తుందో చూస్తే..

కొందరు మహిళలు చిత్రవిచిత్రమైన ప్రయోగాలు చేస్తుంటారు. ఇళ్లల్లోని వస్తువులను ఎవరూ వాడని విధంగా వాడేస్తుంటారు. ఒకేసారి ఐదు, ఆరు చపాతీలను చేసే వారు కొందరైతే.. మరికొందరు సైకిల్ చక్రంతో దుస్తులు ఉతికేస్తారు. ఇంకొందరేమో.. ఏకంగా కుక్కర్‌తోనే ఇస్త్రీ చేసేస్తుంటారు. ఇలాంటి విచిత్ర ప్రయోగాలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంటాయి. తాజాగా, ఇలాంటి వీడియో ఒకటి నెట్టింట చక్కర్లు కొడుతోంది. ఓ మహిళ ఉల్లిపాయలు కట్ చేసే విధానం చూసి అంతా తెగ నవ్వుకుంటున్నారు. ఈ వీడియో చూసిన వారంతా.. ‘‘ఇలాంటి ప్రయోగాలు ఇండియాలనే సాధ్యం’’.. అంటూ కామెంట్లు చేస్తున్నారు..


సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. ఓ మహిళ ఉల్లిపాయలు (woman cutting onions) కోసేందుకు సిద్ధమవుతుంది. సాధారణంగా ఉల్లిపాయలు కోసే సమయంలో కన్నీళ్లు రావడ సహజం. అయితే కొందరు ఈ సమస్య నుంచి తప్పించుకునేందుకు విచిత్ర ప్రయోగాలు చేయడం చూస్తుంటాం. హెల్మెట్ పెట్టుకుని ఉల్లిపాయలు కోసే వారిని కూడా చూస్తుంటాం.

Marriage Funny Video: ఇలాంటి ఊరేగింపును వద్దన్నా చూస్తారు.. ఎలాంటి ఏర్పాట్లు చేశారో మీరే చూడండి..


అయితే ఈమె మాత్రం విచిత్రంగా ఆలోచించింది. ప్లేటులో ఉల్లిపాయలను సిద్ధం చేసుకున్న ఈమె.. తర్వాత ఇంట్లోని వైట్ టేప్ తీసుకుని వచ్చింది. ఆ టేప్‌ను కళ్లపై అద్దాల తరహాలో అంటించుకుంటుంది. ఇలా టేప్ అంటించుకున్ తర్వాత.. (Woman cutting onions with tape over her eyes) కత్తి తీసుకుని ఉల్లిపాయలు కోసేస్తుంది. ఇలా ఉల్లిపాయలు కోసే సమయంలో కన్నీళ్లు రాకుండా విచిత్ర ప్రయోగం చేసిందన్నమాట.

Smuggling: రాత్రి వేళ జైలు పెన్సింగ్‌పై నిలబడ్డ పిల్లి.. పట్టుకుని పరిశీలించగా.. షాకింగ్ సీన్..


కాగా, ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘ఈమె ప్రయోగం మామూలుగా లేదుగా’’.. అంటూ కొందరు, ‘‘ఇలాంటి ప్రయోగాలు మహిళలకే సాధ్యం’’.. అంటూ మరికొందరు, వివిధ రకాల ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 1100కి పైగా లైక్‌లు, 3లక్షలకు పైగా వ్యూస్‌ను సొంతం చేసుకుంది.

Snake Funny Video: వైన్ షాపులోకి దూరిన పాము.. తరిమికొట్టాలని చూడగా.. ఎలా భయపెట్టిందంటే..


ఇవి కూడా చదవండి..

Viral Video: వీళ్ల తెలివి తగలెయ్య.. ఎయిర్‌పాడ్స్‌ను ఎలా వాడుతున్నారో చూస్తే.. కళ్లు తేలేస్తారు..

Python VS Leopard: పులిని మింగాలని చూసిన కొండచిలువ.. చివరికి జరిగింది చూస్తే అవాక్కవ్వాల్సిందే..

Monkey Funny Video: కొమ్మ చివరన కోతి.. పండు ఎలా కోసిందో చూస్తే..

మరిన్ని వైరల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Updated Date - May 20 , 2025 | 07:33 PM