Snake Funny Video: వైన్ షాపులోకి దూరిన పాము.. తరిమికొట్టాలని చూడగా.. ఎలా భయపెట్టిందంటే..
ABN , Publish Date - May 20 , 2025 | 05:34 PM
ఎక్కడి నుంచి వచ్చిందో ఏమో గానీ.. ఓ పాము (Snake enters wine shop) వైన్ షాపులోకి దూరేసింది. లోపలికి వెళ్లిన పాము.. మందు బాటిళ్ల పక్కనే ఉన్న సీసీ కెమెరాను చుట్టేసుకుని ఉంది.

పాములకు సంబంధించిన అనేక వీడియోలను సోషల్ మీడియాలో చూస్తుంటాం. ఇళ్లల్లోకి దూరే పాములు.. ఫ్రిడ్జ్‌లు, కూలర్లు, సీలింగ్ ఫ్యాన్లు తదితర వస్తువుల మాటున దాగి భయపెడుతుంటాయి. వాటిని ఎంత తరిమికొట్టాలని చూసినా బయటికి వెళ్లకుండా ఇబ్బంది పెడుతుంటాయి. ఇలాంటి షాకింగ్ ఘటనలకు సంబంధించిన వీడియోలు తెగ వైరల్ అవుతుంటాయి. అయితే తాజాగా, ఓ పాము వీడియో చూసి అంతా తెగ నవ్వుకుంటున్నారు. వైన్ షాపులోకి దూరిన పామును బయటికి వెళ్లగొట్టేందుకు ప్రయత్నించారు. చివరకు అది చేసిన నిర్వాకం చూసి అంతా అవాక్కవుతున్నారు. ఈ వీడియో చూసిన నెటిజన్లు.. ‘‘వీక్నెస్ పట్టేసిన పాము’’.. అంటూ కామెంట్లు చేస్తున్నారు..
సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. ఎక్కడి నుంచి వచ్చిందో ఏమో గానీ.. ఓ పాము (Snake enters wine shop) వైన్ షాపులోకి దూరేసింది. లోపలికి వెళ్లిన పాము.. మందు బాటిళ్ల పక్కనే ఉన్న సీసీ కెమెరాను చుట్టేసుకుని ఉంది. దాన్ని చూసి దుకాణ సిబ్బంది కర్ర తీసుకుని తరిమికొట్టాలని చూశారు.
Smuggling: రాత్రి వేళ జైలు పెన్సింగ్‌పై నిలబడ్డ పిల్లి.. పట్టుకుని పరిశీలించగా.. షాకింగ్ సీన్..
కర్రతో పామును పట్టుకుని కింద పడేయడానిక ప్రయత్నించారు. ఇలా చేయడంతో పాముకు చిర్రెత్తుకొచ్చింది. ‘‘నన్నే బయటికి వెళ్లగొడతావా.. నిన్ను ఎలా భయపెట్టాలో నాకు తెలుసుగా’’.. అని అనుకున్నట్లుగా.. మెల్లగా మందు బాటిళ్లపైకి పాకుతూ వెళ్తుంది. కర్రతో కిందకు తోయాలని చూడగా.. పాము తోక మెలి తిప్పడంతో మందు (Snake Knocked down Wine Bottle) బాటిల్ కిందపడిపోతుంది. దీంతో ఆ వ్యక్తి గుండె గుభేల్ మంటుంది. ఎక్కడ కిందపడి పగిలిపోతుందో అనే భయంతో వెంటనే పట్టుకోవడానికి ప్రయత్నిస్తాడు.
Train Accident Video: రన్నింగ్ రైలు ఎక్కుతున్న వృద్ధుడు.. యువకుడిని పట్టుకోవడంతో.. చివరకు..
ఇంతటితో ఈ వీడియో ముగుస్తుంది. కాగా, ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలోని వివిధ వేదికల్లో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘ఈ పాము భలే షాకిచ్చిందిగా’’.. అంటూ కొందరు, ‘‘మందుబాబుల వీక్నెస్ పట్టేసిన పాము’’.. అంటూ మరికొందరు, వివిధ రకాల ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 1400కి పైగా లైక్‌లు, 39 వేలకు పైగా వ్యూస్‌ను సొంతం చేసుకుంది.
Marriage Funny Video: ఇలాంటి ఊరేగింపును వద్దన్నా చూస్తారు.. ఎలాంటి ఏర్పాట్లు చేశారో మీరే చూడండి..
ఇవి కూడా చదవండి..
Viral Video: వీళ్ల తెలివి తగలెయ్య.. ఎయిర్‌పాడ్స్‌ను ఎలా వాడుతున్నారో చూస్తే.. కళ్లు తేలేస్తారు..
Python VS Leopard: పులిని మింగాలని చూసిన కొండచిలువ.. చివరికి జరిగింది చూస్తే అవాక్కవ్వాల్సిందే..
Monkey Funny Video: కొమ్మ చివరన కోతి.. పండు ఎలా కోసిందో చూస్తే..