Share News

Smuggling: రాత్రి వేళ జైలు పెన్సింగ్‌పై నిలబడ్డ పిల్లి.. పట్టుకుని పరిశీలించగా.. షాకింగ్ సీన్..

ABN , Publish Date - May 20 , 2025 | 04:27 PM

జైల్లో రాత్రి వేళ పోలీసులు షాకయ్యే ఘటన చోటు చేసుకుంది. జైలు వెలుపల పెన్సింగ్‌పై పిల్లి (Cat on prison fence) అనుమానాస్పదంగా కనిపించింది. చాలా సేపు పిల్లిని గమనించిన ఓ పోలీసుకు అనుమానం వచ్చింది. చివరకు పట్టుకుని పరిశీలించగా.. షాకింగ్ సీన్ కనిపించింది..

Smuggling: రాత్రి వేళ జైలు పెన్సింగ్‌పై నిలబడ్డ పిల్లి..  పట్టుకుని పరిశీలించగా.. షాకింగ్ సీన్..

జైలు నుంచి తెలివిగా తప్పించుకునే ఖైదీలు, జైలు లోపల కూడా సకల సౌకర్యాలు అనుభవించే ఖైదీలు.. ఇలాంటి సీన్లు కేవలం సినిమాల్లోనే చూస్తుంటాం. నిజ జీవితంలో కూడా కొన్ని జైళ్లలో ఇలాంటి సంఘటనలు చోటు చేసుకోవడం చూస్తుంటాం. అయితే తాజాగా, ఓ జైల్లో వింత ఘటన చోటు చేసుకుంది. ఓ పిల్లి దొంగగా జైల్లోకి ఎంటరయ్యేందుకు ప్రయత్నించింది. పోలీసులకు అనుమానం వచ్చి పట్టుకుని చూడగా.. షాకింగ్ సీన్ కనిపించింది. ఇంతకీ అసలు ఏం జరిగిందంటే..


సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. సెంట్రల్ అమెరికాలోని (Central America) ఈశాన్య కోస్టారికా ప్రాంతంలో ఈ ఘటన చోటు చేసుకుంది. స్థానికంగా ఉన్న జైల్లో రాత్రి వేళ పోలీసులు షాకయ్యే ఘటన చోటు చేసుకుంది. జైలు వెలుపల పెన్సింగ్‌పై పిల్లి (Cat on prison fence) అనుమానాస్పదంగా కనిపించింది. చాలా సేపు పిల్లిని గమనించిన ఓ పోలీసుకు అనుమానం వచ్చింది. దీంతో అలారం మోగించి, మొత్తం సిబ్బందిని అలెర్ట్ చేశాడు.

Train Accident Video: రన్నింగ్ రైలు ఎక్కుతున్న వృద్ధుడు.. యువకుడిని పట్టుకోవడంతో.. చివరకు..


Costa-Rica-cat-in-jail.jpg

చివరకు పోలీసులు ఆ పిల్లిని, ఎంతో జాగ్రత్తగా పట్టుకుని కిందకు తీసుకొచ్చారు. తీరా చూస్తే పిల్లి శరీరంపై తెలుపు, నలుపు రంగులో ఉండే ప్యాకెట్లను టేపుతో అతికించారు. వాటిని చివరకు కత్తిరించి చూడగా, అందులో డగ్స్ (Drug pockets on the cat's body) బయటపడ్డాయి. ఓ ప్యాకెట్‌లో 236 గ్రాముల గంజాయి ఉండగా, మరో ప్యాకెట్‌లో 68 గ్రాముల క్రాక్ పేస్ట్‌తో పాటూ రెండు రోలింగ్ పేపర్ షీట్లు లభ్యమయ్యాయి. వాటిని స్వాధీనం చేసుకున్న పోలీసులు.. పిల్లితో పాటూ పరిసరాల్లో పరిశీలించగా.. ఎలాంటి ఆధారాలూ లభించలేదు.

Viral Video: వీళ్ల తెలివి తగలెయ్య.. ఎయిర్‌పాడ్స్‌ను ఎలా వాడుతున్నారో చూస్తే.. కళ్లు తేలేస్తారు..


ఖైదీలకు డ్రగ్స్ సరఫరా చేసేలా ఈ పిల్లికి ట్రైనింగ్ ఇచ్చి పంపించినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. పిల్లిని కోస్టారికన్ నేషనల్ యానిమల్ హెల్త్ సర్వీస్‌‌ సెంటర్‌కు తరలించారు. ఈ పిల్లికి శిక్షణ ఎవరు ఇచ్చారు, ఎక్కడి నుంచి గంజాయిని పంపిస్తున్నారు, దీని వెనుక ఇంకా ఎవరెవరు ఉన్నారు అనే విషయాలపై ఖైదీలను విచారిస్తున్నారు. కాగా, ఇలా పిల్లితో స్మగ్లింగ్ చేయించడంపై అంతా అవాక్కవుతున్నారు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు.

Marriage Funny Video: ఇలాంటి ఊరేగింపును వద్దన్నా చూస్తారు.. ఎలాంటి ఏర్పాట్లు చేశారో మీరే చూడండి..


ఇవి కూడా చదవండి..

Viral Video: వీళ్ల తెలివి తగలెయ్య.. ఎయిర్‌పాడ్స్‌ను ఎలా వాడుతున్నారో చూస్తే.. కళ్లు తేలేస్తారు..

Python VS Leopard: పులిని మింగాలని చూసిన కొండచిలువ.. చివరికి జరిగింది చూస్తే అవాక్కవ్వాల్సిందే..

Monkey Funny Video: కొమ్మ చివరన కోతి.. పండు ఎలా కోసిందో చూస్తే..

మరిన్ని వైరల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Updated Date - May 20 , 2025 | 04:58 PM