Home » America
భారత్‌పై విధించిన 50 శాతం టారీఫ్‌లను రద్దు చేయాలంటూ ముగ్గురు ప్రజా ప్రతినిధులు అమెరికా ప్రతినిధుల సభలో తీర్మానం ప్రవేశ పెట్టారు. శుక్రవారం డెబోరా రాస్, మార్క్ వీసే, రాజా క్రిష్ణమూర్తిలు తీర్మానం ప్రవేశపెట్టారు.
భారత్‌లో వీసా ఇంటర్వ్యూలు వాయిదా పడిన నేపథ్యంలో హెచ్-1బీ వీసాదారులకు అక్కడి ఇమిగ్రేషన్ లాయర్లు కీలక సూచనలు చేశారు. ఈ నేపథ్యంలో ఇండియాకు వెళితే వీసా స్టాంపింగ్ ఆలస్యమై చిక్కుల్లో పడాల్సి వస్తుందని హెచ్చరిస్తున్నారు.
ఆంధ్రప్రదేశ్ ఆర్థిక వ్యవస్థను పటిష్టం చేయాలనే దార్శనిక లక్ష్యంతో మంత్రి లోకేష్ నిర్వహించిన అమెరికా పర్యటనలో ఏపీ టెక్నాలజీ సర్వీసెస్ ఛైర్మన్ మన్నవ మోహన్ కృష్ణ పాల్గొన్నారు. ఈ సందర్భంగా యూఎస్ పర్యటనలో లోకేష్ పడిన శ్రమ, దిగ్గజ కంపెనీల సీఈవోలతో సమావేశాలను మోహన్ వివరించారు.
ఓ వ్యక్తి కిడ్నీ ట్రాన్స్‌ప్లాంటేషన్ జర్నీ విషాదంగా ముగిసింది. దాత నుంచి కిడ్నీ తీసుకున్న 5 వారాలకే గ్రహీత దారుణమైన వ్యాధి బారినపడ్డాడు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయాడు.
కెనడియన్ పెట్టుబడులకు సహకారం అందించాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఐటీ, విద్య శాఖల మంత్రి నారాలోకేశ్ సూచించారు. బిజినెస్ కౌన్సిల్ ఆఫ్ కెనడా అధ్యక్షుడు గోల్డీ హైదర్‌తో మంత్రి లోకేశ్ సమావేశం అయ్యారు.
హెచ్1బీ వీసాకు దరఖాస్తు చేసుకునే విదేశీ ఉద్యోగులు, వారి కుటుంబ సభ్యులు తీసుకోవాలనుకునే హెచ్4 వీసా దరఖాస్తుదారుల సోషల్ మీడియా ఖాతాల గురించి అమెరికా విదేశాంగ శాఖ కొత్త నిబంధనను ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే.
హైదరాబాద్‌కు చెందిన ఓ యువకుడు అమెరికాలో మృతిచెందాడు. సంకీర్త్ పినుమళ్ల అనే యువకుడు అమెరికాలోని యూనివర్సిటీ ఆఫ్ సైటోన్ ఒహియోలో ఎమ్మెస్ చేశారు. ఆ తర్వాత అక్కడే ఉద్యోగం చేస్తున్నారు. అయితే.. అక్కడ మంచు కురుస్తున్న కారణంగా కాలు జారి పడి మృతి చెందినట్టు సమాచారం.
ఏపీ సెమీకండక్టర్స్, ఎలక్ట్రానిక్స్ మ్యానుఫ్యాక్చరింగ్ పరిశ్రమ ఏర్పాటుకు బలమైన ఎకో సిస్టమ్ కలిగి ఉందని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఐటీ, విద్యశాఖల మంత్రి నారా లోకేశ్ వ్యాఖ్యానించారు. శాన్ ఫ్రాన్సిస్కోలో ఇంటెల్ ఐటీ సీటీవో శేష కృష్ణపురతో మంత్రి లోకేశ్ భేటీ అయ్యారు.
గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్‌తో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఐటీ, విద్యశాఖల మంత్రి నారా లోకేశ్ సమావేశం అయ్యారు. విశాఖపట్నంలో గూగుల్ ఏఐ డేటా సెంటర్ పనుల పురోగతిపై సమీక్షా సమావేశం నిర్వహించారు.
పికిల్ బాల్ టోర్నమెంట్‌ను తానా విజయవంతంగా నిర్వహించింది. క్రీడలు దైనందిన జీవితములో ముఖ్య భాగమని, అందుకే ఈ మధ్యకాలంలో ప్రాచుర్యం పొందుతున్న పికిల్ బాల్ టోర్నమెంట్‌ని దిగ్విజయముగా నిర్వహించామని తానా న్యూ ఇంగ్లాండ్ రీజినల్ కోఆర్డినేటర్ మౌనిక మానికొండ తెలిపారు.