Funny Viral Video: ఆశీర్వదించకుండా అతి చేస్తే ఇలాగే అవుతుంది.. ఈ వధువు ఏం చేసిందో చూడండి..
ABN , Publish Date - May 20 , 2025 | 08:40 PM
ఓ వివాహ కార్యక్రమంలో వధూవరుల మధ్య చోటు చేసుకున్న తమాషా సంఘటన చూసి అంతా తెగ నవ్వుకుంటున్నారు. వరుడి కాళ్లు మొక్కి ఆశీర్వాదం తీసుకునేందుకు వధువు ప్రయత్నిస్తుంది. కాళ్లు మొక్కడానికి ప్రయత్నించగా.. చివరకు షాకింగ్ ఘటన చోటు చేసుకుంటుంది..

ప్రస్తుత సోషల్ మీడియా యుగంలో ఎక్కడ ఏ చిన్న వినూత్న సంఘటన జరిగినా అది పెద్ద వార్త అయిపోతోంది. మరికొన్ని సంఘటనలు వీడియోల రూపంలో నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది. ఇక వివాహాలకు సంబంధించిన వీడియోలకైతే లెక్కేలేదు. కొన్నిసార్లు అనుకోకుండా జరిగితే.. మరికొన్నిసార్లు కొందరు అదేపనిగా ప్లాన్ చేసి మరీ ఏవేవో వీడియోలు చేస్తుంటారు. తాజాగా, ఓ వివాహంలో చోటు చేసుకున్న తమాషా సంఘటనకు సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది. ఓ వధువు వరుడి కాళ్లు మొక్కి ఆశీర్వాదం తీసుకునేందుకు ప్రయత్నించింది. ఈ క్రమంలో చివరకు ఏం జరిగిందో మీరే చూడండి..
సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. ఓ వివాహ (Marriage) కార్యక్రమంలో వధూవరుల మధ్య చోటు చేసుకున్న తమాషా సంఘటన చూసి అంతా తెగ నవ్వుకుంటున్నారు. వధూవరులు దండలు మార్చుకుంటుంటారు. ముందుగా వధువు మెడలోవరుడు దండ వేస్తాడు. ఆ తర్వాత వరుడి మెడలో వధువు దండ వేస్తుంది. ఆపై వరుడి ఆశీర్వాదం తీసుకునేందుకు ప్రయత్నిస్తుంది. కాళ్లు మొక్కడానికి ప్రయత్నించగా.. వరుడు సడన్‌గా వెనక్కు జంప్ చేసి దూరంగా జరుగుతాడు.
Watch video: ప్యారిస్ మెట్రోలో యువతి.. లెహంగాలో ఆమె అందానికి అంతా ఫిదా..
అయినా వధువు మళ్లీ ప్రయత్నించి (Bride Tried to take Groom's Blessing) కాళ్లు మొక్కాలని చూస్తుంది. రెండోసారి కూడా వరుడు వెనక్కు జరగడంతో ఆమెకు చిర్రెత్తుకొస్తుంది. చివరకు అతడి కాళ్లు (bride dragged the groom down) పట్టుకుని ధబేల్‌మని కిందపడేస్తుంది. ఆ తర్వాత ఇద్దరూ ఒకరిపై ఒకరు దాడి చేసుకుంటూ గొడవపడతారు. వధువు తన కాలితో తన్నుతూ వరుడికి చుక్కలు చూపిస్తుంది. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.
Woman Funny Video: ఇలాంటి ప్రయోగాలు మహిళలకే సాధ్యమేమో.. ఉల్లిపాయలను ఎలా కట్ చేస్తుందో చూస్తే..
ఈ వీడియోపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘ఆశీర్వదించకుండా అతి చేస్తే ఇలాగే అవుతుంది’’.. అంటూ కొందరు, ‘‘వరుడికి చుక్కలు చూపించిన వధువు’’.. అంటూ మరికొందరు, వివిధ రకాల ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 1400కి పైగా లైక్‌లు, 5 లక్షలకు పైగా వ్యూస్‌ను సొంతం చేసుకుంది.
Snake Funny Video: వైన్ షాపులోకి దూరిన పాము.. తరిమికొట్టాలని చూడగా.. ఎలా భయపెట్టిందంటే..
ఇవి కూడా చదవండి..
Viral Video: వీళ్ల తెలివి తగలెయ్య.. ఎయిర్‌పాడ్స్‌ను ఎలా వాడుతున్నారో చూస్తే.. కళ్లు తేలేస్తారు..
Python VS Leopard: పులిని మింగాలని చూసిన కొండచిలువ.. చివరికి జరిగింది చూస్తే అవాక్కవ్వాల్సిందే..
Monkey Funny Video: కొమ్మ చివరన కోతి.. పండు ఎలా కోసిందో చూస్తే..