Share News

Drunken Man Funny Video: ప్రాణం పోయినా.. మందు పోకూడదు.. ఎలా తాగుతున్నాడంటే..

ABN , Publish Date - May 22 , 2025 | 03:23 PM

ఓ పెద్దాయన క్వార్టర్ బాటిల్ కొనుక్కుని తాగేందుకు సిద్ధమవుతాడు. సాధారణంగా ఎవరైనా మందును గ్లాసులో పోసుకుని తాగడం కామన్. అయితే ఈ పెద్దాయన మాత్రం అలా చేయలేదు. చుక్క కూడా వృథా కాకూడదు అని అనుకున్నాడో ఏమో గానీ.. విచిత్రంగా మందు తాగి అంతా అవాక్కయ్యేలా చేశాడు..

Drunken Man Funny Video: ప్రాణం పోయినా.. మందు పోకూడదు.. ఎలా తాగుతున్నాడంటే..

మందుబాబుల చేష్టలు కొన్నిసార్లు వింత వింతగా అనిపిస్తుంటాయి. ఫుల్‌‌గా మందు తాగి రోడ్లపై పడిపోయేవారు కొందరైతే.. మరికొందరు మందు కొట్టి ఏకంగా పాములను సైతం మెడలోనే వేసుకుంటుంటారు. ఇంకొందరు వాహనాలకు ఎదురుగా వెళ్లి మరీ ట్రాఫిక్ జామ్ చేసేస్తుంటారు. ఇలాంటి షాకింగ్ ఘటనలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. తాజాగా, ఇలాంటి వీడియో ఒకటి నెట్టింట చక్కర్లు కొడుతోంది. ఓ పెద్దాయన మందు తాగే విధానం చూసి అంతా అవాక్కవుతున్నారు. ఈ వీడియో చూసిన వారంతా.. ప్రాణం పోయినా ఫర్లేదు.. మందు మాత్రం పోకూడదు.. అంటూ కామెంట్లు చేస్తున్నారు.


సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral video) తెగ వైరల్ అవుతోంది. ఆస్పత్రిలో సైలెన్ బాటిల్స్ ఎక్కించుకుంటున్న ఓ పెద్దాయనకు మందు తాగాలని ఆశ పుట్టింది. అనుకున్నదే తడవుగా సెలైన్ బాటిల్ పైపుతో సహా బయటికి వచ్చేశాడు. బయట వైన్ షాపులో క్వార్టర్ బాటిల్ (Liquor bottle) కొనుక్కుని తాగేందుకు సిద్ధమవుతాడు. సాధారణంగా ఎవరైనా మందును గ్లాసులో పోసుకుని తాగడం కామన్. అయితే ఈ పెద్దాయన మాత్రం అలా చేయలేదు. చుక్క కూడా వృథా కాకూడదు అని అనుకున్నాడో ఏమో గానీ.. విచిత్రంగా మందు తాగి అంతా అవాక్కయ్యేలా చేశాడు.


అప్పటికే ముక్కులోకి సెట్ చేసిన పెట్టిన సెలైన్ పైపుతోనే (saline syringe pipe ) మందు తాగేందుకు ఫిక్స్ అయ్యాడు. ఆ సెలైన్ పైపు చివరలో ఉన్న గొట్టంలో మందు పోసేశాడు. తర్వాత దాన్ని చేత్తో పైకి ఎత్తి పట్టుకున్నాడు. అలా పైకి ఎత్తగానే అందులోని మందు మొత్తం పైపు గుండా ముక్కులోకి, అటు నుంచి అటే నేరుగా గొంతులోకి వెళ్లింది. ఇలా ఆస్పత్రి పాలైనా కూడా మందు మీద మమకారం వదులుకోలేని ఈ వృద్ధుడిని చూసి అంతా అవాక్కవుతున్నారు.


ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘ఈ పెద్దాయన.. తన జీవితంలో చివరి పెగ్గు తాగుతున్నట్లు ఉంది’’.. అంటూ కొందరు, ‘‘చుక్క మిగుల్చకుండా మొత్తం తాగేశాడుగా’’.. అంటూ మరికొందరు, వివిధ రకాల ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 430కి పైగా లైక్‌లు, 41 వేలకు పైగా వ్యూస్‌ను సొంతం చేసుకుంది.


ఇవి కూడా చదవండి..

దుప్పటి కప్పుకొని పడుకున్న వ్యక్తి.. లోపలికి దూరిన కింగ్ కోబ్రా.. చివరకు..

ఎయిర్‌పాడ్స్‌ను ఎలా వాడుతున్నారో చూస్తే..

మరిన్ని వైరల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Updated Date - May 22 , 2025 | 03:54 PM