Share News

Tiger Hunting Video: ఓర్పు, సహనం, పట్టుదల ఉంటే విజయం తథ్యం.. ఈ చిరుత పులిని చూస్తే..

ABN , Publish Date - May 22 , 2025 | 05:09 PM

ఆకలితో ఉన్న ఓ చిరుత పులి వేటకు వెళ్తుంది. అయితే ఎంత సేపు చూసినా ఏ జంతువూ కనిపించదు. కానీ ఆ చిరుత మాత్రం ఎంతో ఓపిగ్గా పొదల మాటున నక్కి ఎదురు చూస్తుంటుంది. చివరకు ఏం జరిగిందో మీరే చూడండి..

Tiger Hunting Video: ఓర్పు, సహనం, పట్టుదల ఉంటే విజయం తథ్యం.. ఈ చిరుత పులిని చూస్తే..

అడవి జంతువులకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియలో నిత్యం చూస్తుంటాం. కొన్నిసార్లు పులులు, సింహాల వేట చూస్తే భయం కలిగేలా ఉంటుంది. మరికొన్నిసార్లు ఈ వేటను బాగా గమనిస్తే.. అందులోనే మనిషి నేర్చుకోవాల్సిన చాలా విషయాలు దాగి ఉంటాయి. ఇందుకు నిదర్శనంగా అనేక సంఘటనలు మన కళ్ల ముందు జరుగుతుంటాయి. అలాంటి వీడియోలు కూడా సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. తాజాగా, ఓ చిరుత పులి వేటకు సంబంధించిన వీడియో ఒకటి నెట్టింట చక్కర్లు కొడుతోంది. ఈ వీడియోను చూసిన వారంతా.. షాకింగ్ కామెంట్లు చేస్తున్నారు..


సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. ఆకలితో ఉన్న ఓ చిరుత పులి వేటకు వెళ్తుంది. అయితే ఎంత సేపు చూసినా ఏ జంతువూ కనిపించదు. కానీ ఆ చిరుత మాత్రం ఎంతో ఓపిగ్గా పొదల మాటున నక్కి ఎదురు చూస్తుంటుంది. ఇలా చాలా సేపు ఆ చిరుత అక్కడే ఉంటూ వేట కోసం వేచి చూస్తూ ఉంటుంది.

బైకును లగేజీ ట్రాలీగా మార్చాడుగా..


ఇంతలో దూరంగా ఓ జింక అటుగా పరుగెత్తుకుంటూ రావడం గమనిస్తుంది. ఇంకేముందీ.. తన ఓర్పుకు ఫలితం దక్కడంతో మరింత ఉత్సాహంతో జింకను పట్టుకునేందుకు సిద్ధపడుతుంది. ఎగురుకుంటూ వచ్చిన జింకను.. గాల్లోకి ఎగిరిమరీ పట్టేసుకుంటుంది. ఈ క్రమంలో రెండూ దూరంగా పడిపోతాయి. అంత వేగంగా వచ్చినా కూడా ఎంతో చాకచక్యంగా జింక మెడను పట్టేసుకుంటుంది. ఇలా ఓర్పు, సహనం, పట్టుదల ఉంటే విజయం తథ్యం అనే సందేశాన్ని ఈ చిరుత చేసి చూపించింది.

ప్రియుడితో ఫోన్‌లో మాట్లాడుతున్న కూతురు.. సడన్‌‌గా..


ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘ఈ చిరుత సాహసం మామూలుగా లేదుగా’’.. అంటూ కొందరు, ‘‘ఈ చిరుతను చూసి ఎంతో నేర్చుకోవాలి’’.. అంటూ మరికొందరు, వివిధ రకాల ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం లక్షకు పైగా లైక్‌‌లు, 2.1 మిలియన్‌కు పైగా వ్యూస్‌ను సొంతం చేసుకుంది.

ప్రాణం పోయినా.. మందు పోకూడదు.. ఎలా తాగుతున్నాడంటే..


ఇవి కూడా చదవండి..

దుప్పటి కప్పుకొని పడుకున్న వ్యక్తి.. లోపలికి దూరిన కింగ్ కోబ్రా.. చివరకు..

ఎయిర్‌పాడ్స్‌ను ఎలా వాడుతున్నారో చూస్తే..

మరిన్ని వైరల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Updated Date - May 22 , 2025 | 06:02 PM