Share News

Goat Viral Video: ఈ మేక తెలివి మామూలుగా లేదుగా.. ఎలా తప్పించుకుందో చూడండి..

ABN , Publish Date - May 23 , 2025 | 11:49 AM

ఓ వ్యక్తి తన ఇంటి ఆవరణలోని రేకుల షెడ్డులో మేకను కట్టేసి ఉంటాడు. ఇందులో ఎలాంటి విశేషం లేకున్నా కూడా మేక చేసిన పని చూసి అంతా అవాక్కవుతున్నారు. ఆ యజమాని మేకను ఓ కర్రకు కట్టేసి వెళ్లాడు. అయితే..

Goat Viral Video: ఈ మేక తెలివి మామూలుగా లేదుగా.. ఎలా తప్పించుకుందో చూడండి..

జంతువులు కొన్నిసార్లు ఎంతో తెలివిగా వ్యవహరిస్తుంటాయి. మరికొన్నిసార్లు మనుషులు కూడా ఆశ్చర్యపోయేలా ప్రవర్తిస్తుంటాయి. స్కూటీ నడిపే ఎద్దు, మేత పెట్టలేదనే కోపంతో అలిగే ఆవులు, యజమాని పిల్లలను ప్రమాదం నుంచి కాపాడే కుక్కలు.. ఇలా ఎన్నో జంతువులు ఎవరూ ఊహించని పనులు చేస్తూ అంతా అవాక్కయ్యేలా చేస్తుంటాయి. ఇలాంటి వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. తాజాగా, ఓ తెలివైన మేక వీడియో నెట్టింట చక్కర్లు కొడుతోంది. తాడుతో కట్టేసి ఉన్నా కూడా తెలివిగా తప్పించుకున్న మేకను చూసి అంతా ఆశ్చర్యపోతున్నారు. ఈ వీడియో చూసిన వారంతా.. ‘‘ఈ మేక మహా ముదురు గురూ’’.. అంటూ కామెంట్లు చేస్తున్నారు..


సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. ఓ వ్యక్తి తన ఇంటి ఆవరణలోని రేకుల షెడ్డులో మేకను కట్టేశాడు. ఇందులో ఎలాంటి విశేషం లేకున్నా కూడా మేక చేసిన పని చూసి అంతా అవాక్కవుతున్నారు. ఆ యజమాని మేకను ఓ కర్రకు కట్టేసి వెళ్లాడు. అయితే ఎలాగైనా తప్పించుకోవాలనే ఉద్దేశంతో ఆ మేక తన బుర్రకు పదును పెట్టింది.

ఓర్పు, సహనం, పట్టుదల ఉంటే విజయం తథ్యం.. ఈ చిరుత పులిని చూస్తే..


కర్రకు ఉన్న తాడు ఊడి వచ్చేలా.. తెలివిగా తన ముందు కాళ్లను రేకులపై ఉంచి పైకి లేచింది. ఆ తర్వాత తన నోటితో తాడును పట్టుకుని కర్ర నుంచి పైకి లాగేసింది. దీంతో ఆ తాడు సులభంగా ఊడి బయటికి వచ్చేసిందన్నమాట. ఇలా కట్టేసి ఉన్నా కూడా ఈ మేక ఎంతో తెలివిగా (goat cleverly escaped) తప్పించుకుని అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. ఈ మేక తెలివి చూసి ముచ్చటపడిపోయిన దాని యజమాని, ఈ నిర్వాకాన్ని మొత్తం వీడియో తీసి సోషల్ మీడియాలో షేర్ చేశాడు.

బైకును లగేజీ ట్రాలీగా మార్చాడుగా.. ఇతడి తెలివి చూస్తే నోరెళ్లబెట్టాల్సిందే..


ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘ఈ మేక తెలివి మామూలుగా లేదుగా’’.. అంటూ కొందరు, ‘‘ఈ మేకను బంధించడం మహా కష్టం సుమీ’’.. అంటూ మరికొందరు, వివిధ రకాల ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 71 వేలకు పైగా లైక్‌లను సొంతం చేసుకుంది.

బైకుపై ఉండగానే ఈ భార్య చేసిన పనికి అంతా షాక్.. వీడియో వైరల్..


ఇవి కూడా చదవండి..

దుప్పటి కప్పుకొని పడుకున్న వ్యక్తి.. లోపలికి దూరిన కింగ్ కోబ్రా.. చివరకు..

ఎయిర్‌పాడ్స్‌ను ఎలా వాడుతున్నారో చూస్తే..

మరిన్ని వైరల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Updated Date - May 23 , 2025 | 12:58 PM