Share News

Couple Viral Video: బైకుపై ఉండగానే ఈ భార్య చేసిన పనికి అంతా షాక్.. వీడియో వైరల్..

ABN , Publish Date - May 23 , 2025 | 10:46 AM

భార్యాభర్తలు కలిసి బైకుపై వెళ్తున్నారు. ఇందులో షాక్ అవడానికి ఏమీ లేకున్నా కూడా.. మార్గ మధ్యలో భార్య చేసిన పని చూసి అంతా అవాక్కవుతున్నారు. ఏం జరిగిందో ఏమో తెలీదు గానీ.. బైకుపై వెళ్తుండగా వెనుక కూర్చున్న భార్యకు కోపం కట్టలు తెంచుకున్నట్లుంది. చివరకు ఏం చేసిందో చూడండి..

Couple Viral Video: బైకుపై ఉండగానే ఈ భార్య చేసిన పనికి అంతా షాక్.. వీడియో వైరల్..

బైకుపై వెళ్తూ విచిత్రంగా ప్రవర్తించే వారిని తరచూ చూస్తుంటాం. కొందరు ప్రేమికులు బైకులపై అసభ్యకరమైన పనులు చేయడం చూశాం, అలాగే మరికొందరు ప్రమాదకర విన్యాసాలు చేయడం కూడా చూశాం, ఇంకొందరు ఏకంగా బైకులపై డాన్స్‌లు చేయడం కూడా చూశాం. ఇలాంటి విచిత్ర సంఘటనలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. తాజాగా, బైకుపై వెళ్తున్న దంపతుల వీడియో తెగ చక్కర్లు కొడుతోంది. భర్త బండి నడుపుతుండగా.. వెనుక కూర్చున్న భార్య.. మధ్యలో విచిత్రంగా ప్రవర్తించింది. ఈ వీడియో చూసిన నెటిజన్లు షాకింగ్ కామెంట్లు చేస్తున్నారు.


సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. ఉత్తరప్రదేశ్‌లోని (Uttar Pradesh) లక్నోలో ఈ ఘటన చోటు చేసుకుంది. భార్యాభర్తలు కలిసి బైకుపై వెళ్తున్నారు. ఇందులో షాక్ అవడానికి ఏమీ లేకున్నా కూడా.. మార్గ మధ్యలో భార్య చేసిన పని చూసి అంతా అవాక్కవుతున్నారు. ఏం జరిగిందో ఏమో తెలీదు గానీ.. బైకుపై వెళ్తుండగా వెనుక కూర్చున్న భార్యకు కోపం కట్టలు తెంచుకున్నట్లుంది.

బైకును లగేజీ ట్రాలీగా మార్చాడుగా.. ఇతడి తెలివి చూస్తే నోరెళ్లబెట్టాల్సిందే..


ఇంకేముందీ.. ముందు, వెనుకూ చూడకుండా, ఎవరేమని అనుకుంటారో ఆలోచించకుండా, తాము బండిపై వెళ్తున్నమనే విషయం కూడా మర్చిపోయి రెచ్చిపోయింది. తన కాలి చెప్పు చేతిలోకి తీసుకుని, (Wife Hits Husband With Slipper on Moving Bike) భర్తను ఎడాపెడా వాయించింది. భార్య అలా చితకబాదుతున్నా కూడా భర్త ఏమాత్రం ఆగ్రహించలేదు. పైగా ఏమీ జరగనట్లు అలా బండిని నడుపుతూనే ఉంటాడు. ఆమె మాత్రం చాలా సేపు అలా చెప్పుతో కొడుతూనే ఉంటుంది. ఈమె నిర్వాకం చూసి అక్కడున్న వాహనదారులంతా షాక్ అయ్యారు. భార్య చెప్పిన దిశగా భర్త వాహనాన్ని మళ్లించలేదనే కోపంతో ఇలా చేసి ఉండొచ్చని కొందరు చెబుతున్నారు.

ప్రేమ పెళ్లికి పెద్దల అంగీకారం.. నిశ్చితార్థం రోజే ప్రియుడి ఆత్మహత్య.. కారణం తెలిస్తే..


కొందరు ఈ ఘటనను వీడియో తీసి, సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఈ వీడియో ప్రస్తుతం తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘అంతగా కొడుతుందంటే.. ఎంత పెద్ద తప్పు చేశాడో ఏమో’’.. అంటూ కొందరు, ‘‘ఈ భర్త సహనానికి సెల్యూట్ చేయాల్సిందే’’.. అంటూ మరికొందరు, వివిధ రకాల ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 4100కి పైగా లైక్‌లు, 4.68 లక్షలకు పైగా వ్యూస్‌ను సొంతం చేసుకుంది.

ఓర్పు, సహనం, పట్టుదల ఉంటే విజయం తథ్యం.. ఈ చిరుత పులిని చూస్తే..


ఇవి కూడా చదవండి..

దుప్పటి కప్పుకొని పడుకున్న వ్యక్తి.. లోపలికి దూరిన కింగ్ కోబ్రా.. చివరకు..

ఎయిర్‌పాడ్స్‌ను ఎలా వాడుతున్నారో చూస్తే..

మరిన్ని వైరల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Updated Date - May 23 , 2025 | 10:47 AM