Share News

Innovative Toilet Video: ఈ ఇంజినీర్‌కు చేతులెత్తి మొక్కాల్సిందే.. టాయిలెట్‌ను ఎక్కడ కట్టాడో చూడండి..

ABN , Publish Date - May 27 , 2025 | 04:29 PM

ఓ వ్యక్తి తన ఇంట్లో టాయిలెట్ నిర్మించాడు. ఇంట్లో టాయిలెట్ నిర్మించడంలో వింతేముందీ.. అనేగా మీ సందేహం. టాయిలెట్ నిర్మించడంలో విశేషం లేకున్నా.. ఇతను ఎక్కడ నిర్మించాడో చూసి అంతా అవాక్కవుతున్నారు. ఈ వీడియో చూసిన వారంతా ఫన్నీ కామెంట్లు చేస్తున్నారు..

Innovative Toilet Video: ఈ ఇంజినీర్‌కు చేతులెత్తి మొక్కాల్సిందే.. టాయిలెట్‌ను ఎక్కడ కట్టాడో చూడండి..

కొందరు నిర్మాణాల విషయంలో ఎంతో తెలివిగా వ్యవహరిస్తుంటారు. మరికొందరు ఉన్న పాటి కొద్ది స్థలంలోనే పెద్ద పెద్ద నిర్మాణాలు చేపడుతుంటారు. ఇక పట్టణాలు, నగరాల్లో పరిస్థితి ఏవిధంగా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. మూడు, నాలుగు అడుగుల స్థలంలోనే ఇళ్లు కట్టేస్తుంటారు. ఇలాంటి వింత వింత నిర్మాణాలకు సంబంధించిన వీడియోలు, ఫొటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. తాజాగా, ఇలాంటి వీడియో ఒకటి నెట్టింట చక్కర్లు కొడుతోంది. ఓ వ్యక్తి తన ఇంట్లో టాయిలెట్‌ను నిర్మించిన విధానం చూసి అంతా అవాక్కవుతున్నారు. ఈ వీడియో చూసిన వారంతా.. ‘‘ఈ ఇంజినీర్‌కు చేతులెత్తి మొక్కాల్సిందే’’.. అంటూ కామెంట్లు చేస్తున్నారు.


సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. ఓ వ్యక్తి తన ఇంట్లో టాయిలెట్ నిర్మించాడు. ఇంట్లో టాయిలెట్ నిర్మించడంలో వింతేముందీ.. అనేగా మీ సందేహం. టాయిలెట్ నిర్మించడంలో విశేషం లేకున్నా.. ఇతను ఎక్కడ నిర్మించాడో చూసి అంతా అవాక్కవుతున్నారు. సాధారణంగా టాయిలెట్ కమోడ్‌ను (Toilet commode) బాత్రూంలో ఓ వైపు నిర్మిస్తుంటారు.

ఈ మేక తెలివి మామూలుగా లేదుగా..


అయితే ఇతను మాత్రం స్థలాన్ని సద్వినియోగం చేయాలని అనుకున్నాడో లేక.. స్థలం తక్కవగా ఉండడం వల్ల ఇలా చేశాడో ఏమో తెలీదు గానీ.. టాయిలెట్‌ కమోడ్‌ను ఏకంగా తన ఇంటి మెట్ల మధ్యలో ఏర్పాటు చేశాడు. మెట్ల పైకి వెళ్తుండగా.. టర్నింగ్ తిరిగే ప్రాంతంలో (Toilet Commode in Middle of Stairs) ఈ కమోడ్‌ను పెట్టేశాడు. ఈ కమోడ్‌లో కూర్చుంటే.. ఇంటి పైనుంచి చూసే వారికి అంతా కనిపించే విధంగా ఉంది. దీంతో ఈ టాయిలెట్‌ను చూసి అంతా అవాక్కవుతున్నారు.

బైకుపై ఉండగానే ఈ భార్య చేసిన పనికి అంతా షాక్..


ఇలా టాయిలెట్ కమోడ్‌ను విచిత్రంగా ఏర్పాటు చేసి, అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తున్నాడన్నమాట. కాగా, ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘టాయిలెట్‌ కమోడ్‌ను ఇలా పెట్టడం ఇప్పుడే చూస్తున్నాం’’.. అంటూ కొందరు, ‘‘ఎలా వస్తాయో ఇలాంటి ఐడియాలు’’.. అంటూ మరికొందరు, వివిధ రకాల ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 4,500కి పైగా లైక్‌లు, 8.75 లక్షలకు పైగా వ్యూస్‌ను సొంతం చేసుకుంది.

ఓర్పు, సహనం, పట్టుదల ఉంటే విజయం తథ్యం.. ఈ చిరుత పులిని చూస్తే..


ఇవి కూడా చదవండి..

దుప్పటి కప్పుకొని పడుకున్న వ్యక్తి.. లోపలికి దూరిన కింగ్ కోబ్రా.. చివరకు..

ఎయిర్‌పాడ్స్‌ను ఎలా వాడుతున్నారో చూస్తే..

మరిన్ని వైరల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Updated Date - May 27 , 2025 | 05:55 PM